మోటో జి 9 పవర్ పెద్ద కెమెరా, పెద్ద బ్యాటరీతో తక్కువ ధరలో వచ్చింది

మోటో జి 9 పవర్ పెద్ద కెమెరా, పెద్ద బ్యాటరీతో తక్కువ ధరలో వచ్చింది
HIGHLIGHTS

మోటరోలా కొత్త స్మార్ట్‌ఫోన్ మోటో జి 9 పవర్‌ను భారత్‌ లో విడుదల చేసింది.

6000 mAh శక్తివంతమైన బ్యాటరీ

64 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌

మోటరోలా కొత్త స్మార్ట్‌ఫోన్ మోటో జి 9 పవర్‌ను భారత్‌ లో విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ 6000 mAh శక్తివంతమైన బ్యాటరీ మరియు 64 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఈ ఫోన్‌లో మరికొన్ని గొప్ప ఫీచర్లు కూడా ఉన్నాయి. ముందుగా యూరప్‌లో లాంచ్ అయిన ఈ మోటో జి 9 పవర్ ఫోన్ గురించి తెలుసుకుందాం …

మోటో జి 9 పవర్ స్పెసిఫికేషన్లు

మోటో జి 9 పవర్ కొత్త స్మార్ట్‌ఫోన్‌లో పెద్ద 6.8 అంగుళాల HD + ఎల్‌సిడి డిస్‌ప్లే ఉంది. ఈ ఫోన్ క్వాల్కమ్ యొక్క స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. సాఫ్ట్‌వేర్ విషయానికొస్తే, మోటో జి 9 పవర్ మోడల్‌ ఆండ్రాయిడ్ 10 తో వస్తుంది. ఈ ఫోన్ 4 జిబి ర్యామ్ మరియు 64 జిబి స్టోరేజ్ వేరియంట్‌లతో, మైక్రో ఎస్‌డి కార్డ్ స్లాట్ ను కూడా కలిగి ఉంది. ఇది ఫోన్ స్టోరేజ్ ను 512 జిబి వరకు విస్తరించడానికి ఉపయోగపడుతుంది.

మోటో జి 9 పవర్ స్మార్ట్‌ఫోన్ 64 ఎంపి ప్రాధమిక సెన్సార్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. మోటరోలా యొక్క ఈ కొత్త హ్యాండ్‌సెట్‌లో 2 ఎంపి మాక్రో మరియు 2 ఎంపి డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి. మోటో జి 9 పవర్ సెల్ఫీల కోసం 16 ఎంపి సెన్సార్‌ను కలిగి ఉంది.

మోటరోలా స్మార్ట్‌ఫోన్‌లో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది, ఇది 20W వరకు వేగంగా ఛార్జింగ్ చేయడానికి మద్దతు ఇస్తుంది. మోటో జి 9 పవర్ స్మార్ట్‌ఫోన్‌లో వెనుక భాగంలో అమర్చిన ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది.

మోటో జి 9 పవర్ ధర

కంపెనీ తన కొత్త మోటో జి 9 పవర్ ఫోన్‌ను ఒకే వేరియంట్‌లో విడుదల చేసింది. ఈ ఫోన్‌లో 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఉన్నాయి. ఈ వేరియంట్‌ను కేవలం రూ. 11999 రూపాయల కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ మొదట సేల్ డిసెంబర్ 15 న మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌లో జరుగనుంది.

మోటో జి 9 పవర్ కలర్ అప్షన్లు

మోటో జి 9 పవర్ స్మార్ట్‌ఫోన్ ఎలక్ట్రిక్ వైలెట్ మరియు మెటాలిక్ సేజ్ అనే రెండు రంగులలో లభిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo