Micromax In సిరీస్ స్మార్ట్ ఫోన్ల ఫస్ట్ లుక్ వచ్చేసింది

HIGHLIGHTS

గత కొన్ని రోజులుగా ఊరిస్తున్న Micromax In సిరీస్ స్మార్ట్ ఫోన్ల ఫస్ట్ లుక్ వచ్చేసింది

Micromax In సిరీస్ రెండు స్మార్ట్ ఫోన్ల ఫస్ట్ లుక్ చూపించారు.

In సిరీస్ స్మార్ట్ ఫోన్లను లాంచ్ చెయ్యడానికి డేట్ ఫిక్స్

Micromax In సిరీస్ స్మార్ట్ ఫోన్ల ఫస్ట్ లుక్ వచ్చేసింది

గత కొన్ని రోజులుగా ఊరిస్తున్న Micromax In సిరీస్ స్మార్ట్ ఫోన్ల ఫస్ట్ లుక్ వచ్చేసింది. భారతీయ మొబైల్ బ్రాండ్ Micromax నవంబర్ 3న ఈ In సిరీస్ స్మార్ట్ ఫోన్లను లాంచ్ చెయ్యడానికి డేట్ ఫిక్స్ చేయగా, అంతకంటే ముందుగానే ఈ ఫోన్ల గురించి వినూత్నమైన టీజింగ్స్ కూడా మొదలు పెట్టింది. ఇప్పటికే ట్విట్టర్ ఈ ఫోన్ల గురించిన కొన్ని వివరాలను వెల్లడించగా, మైక్రోమ్యాక్స్ Co-Founder రాహుల్ శర్మ ఒక ఇంటర్వ్యూలో ఈ స్మార్ట్ ఫోన్ల ఫస్ట్ లుక్ వెల్లడించారు.       

Digit.in Survey
✅ Thank you for completing the survey!

లేటెస్ట్ గా ప్రముఖ యూట్యూబర్ టెక్నీకల్ గురూజీ తో ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ శర్మ రెండు స్మార్ట్ ఫోన్ల ఫస్ట్ లుక్ చూపించారు. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ల పేరు లేదా వివరాలను మాత్రం ఎక్కడా వెల్లడించలేదు. కాబట్టి, Micromax In సిరీస్ నుండి ఎన్ని ఫోన్లను లాంచ్ చేయాలనిచూస్తుందో అనే విషయం చర్చనీయాంశంగా మారుతుంది. అలాగే, ఈ వీడియోలో చూపించిన స్మార్ట్ ఫోన్ల యొక్క కొన్ని వివరాలు కనిపించాయి.

వీడియోలో చూపించిన స్మార్ట్ ఫోన్లు తెలుపు మరియు బ్లూ కలర్ వేరియంట్లు. అలాగే, వీటిలో బ్లూ కలర్ వేరియంట్  వెనుక X ప్యాట్రన్ తో ఆకట్టుకునేలా కనిపిస్తోంది. ఇక కెమెరాల పరంగా వెనుక ఒక LED ఫ్లాష్ తో కూడిన క్వాడ్ కెమెరా సెటప్ కనిపిస్తోంది. ఫింగర్ ప్రింట్ కూడా వెనుక కెమెరా సెటప్ క్రింద ఎగువ మధ్యలో కనిపిస్తోంది. ఇక డిస్ప్లే విషయానికి వస్తే, ముందుగా ట్విట్టర్ టీజింగ్ నుండి ఇవి ఫుల్ డిస్ప్లే లేదా ప్రస్తుతం ట్రెండ్ గా నడుస్తున్న పంచ్ హోల్ డిస్ప్లే తో ఉండవచ్చు.

ఇక ఇప్పటికే వచ్చిన కొన్ని నివేదికల ప్రకారం ఈ స్మార్ట్ ఫోన్ లో 48MP క్వాడ్ కెమెరా సెటప్ మరియు ఈ ఫోన్ల డిస్ప్లే టాప్ సెంటర్ కెమేరా కటౌట్ వున్నట్లుగా చెబుతున్నాయి. అయితే, ఫస్ట్ లుక్ తెలిసింది కానీ, ఖచ్చితమైన స్పెషిఫికేషన్ల తెలియాలంటే మాత్రం నవంబర్ 3 న ఈ స్మార్ట్ ఫోన్ల లాంచ్ వరకూ ఆగాల్సిందే.                                                

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo