Tecno Spark 7 Pro: బడ్జెట్ ధరలో అదిరే ఫీచర్లతో వచ్చింది

Tecno Spark 7 Pro: బడ్జెట్ ధరలో అదిరే ఫీచర్లతో వచ్చింది
HIGHLIGHTS

Tecno Spark 7 Pro: బడ్జెట్ ధరలో అదిరే ఫీచర్లతో వచ్చింది

Tecno Spark 7 Pro స్మార్ట్ ఫోన్ ను మంచి ఫీచర్లతో అందించింది

బడ్జెట్ ధరలో పెద్ద 48MP ట్రిపుల్ కెమెరా మరియు పవర్ ఫుల్ గేమింగ్ చిప్ సెట్

Tecno Spark 7 Pro: బడ్జెట్ ధరలో అదిరే ఫీచర్లతో వచ్చింది. టెక్నో తన Tecno Spark 7 Pro స్మార్ట్ ఫోన్ ను మంచి ఫీచర్లతో అందించింది. ఈ ఫోన్ ను కేవలం 10 వేల రూపాయల బడ్జెట్ ధరలో పెద్ద 48MP ట్రిపుల్ కెమెరా మరియు పవర్ ఫుల్ గేమింగ్ చిప్ సెట్ తో పాటుగా చూడగానే ఆకట్టుకునే డిజైన్ తో  విడుదల చేసింది.

Tecno Spark 7 Pro: ప్రైస్

ఈ Tecno Spark 7 Pro స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్స్  లో లభిస్తుంది. బేసిక్ వేరియంట్ 4GB+64GB స్టోరేజ్ తో రూ.9,999 ధరతో, మరొక వేరియంట్ 4GB+64GB స్టోరేజ్ తో రూ.10,999 ధరతో ప్రకటించింది. అయితే, లాంచ్ అఫర్ క్రింద SBI క్రెడిట్ కార్డ్ లతో కొనేవారికి 1000 రూపాయల తక్కువకే లభిస్తుంది. ఈ ఫోన్ మే 28 నుండి ఆన్లైన్ లో సేల్ కి అందుబాటులో వుంటుంది.                                                                          

 Tecno Spark 7 Pro: స్పెక్స్

Tecno Spark 7 Pro లో 6.6 అంగుళాల పెద్ద పంచ్ హోల్ డిజైన్ డిస్ప్లేని HD+ రిజల్యూషన్ తో కలిగి వుంటుంది. ఈ డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్ తో స్మూత్ గా వుంటుంది. టెక్నో స్పార్క్ 7 ప్రో మీడియా టెక్ హీలియో G80 చిప్ సెట్ తో పనిచేస్తుంది మరియు 4GB / 6GB వేరియంట్లలో అందించబడుతుంది. అధనపు స్టోరేజ్ కోసం మైక్రో SD కార్డు అప్షన్ కూడా వుంటుంది.

ఈ ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ చాలా పెద్దగా ఆకర్షణీయంగా కనిపించేలా డిజైన్ చేసారు. ఈ సెటప్ లో 48MP ప్రధాన కెమెరా కలిగిన AI ట్రిపుల్ కెమెరా సెటప్ వుంది. ఇక ఫోన్ ముందు భాగంలో వున్నా పంచ్ హోల్ కటౌట్ లో 8MP సెల్ఫీ కెమెరా కూడా వుంటుంది. ఈ ఫోన్ ప్రొఫెషన్ కెమెరా వంటి వీడియోలను అందించ గల శక్తితో ఉంటుందని కంపెనీ చెబుతోంది.    

టెక్నో స్పార్క్ 7 ప్రో పెద్ద 5,000 mAh బ్యాటరీని 10W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగి వుంటుంది. ఈ ఫోన్ HiOS 7.5 స్కిన్ పైన ఆండ్రాయిడ్ 11 తో పనిచేస్తుంది. వెనుక ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు ఫాస్ట్ కనెక్టివిటీ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ ఆల్ప్స్ బ్లూ, స్ప్రూస్ గ్రీన్ మరియు మ్యాగ్నెట్ బ్లాక్ వంటి మూడు ఆకర్షణీయమైన రంగులలో లభిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo