Tecno POVA CURVE 5G ఇండియా లాంచ్ మరియు ఫీచర్స్ రిలీజ్ చేసిన టెక్నో.!
Tecno POVA CURVE 5G స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అవుతోంది
లాంచ్ డేట్ మరియు కీలకమైన ఫీచర్స్ ను కూడా టెక్నో రిలీజ్ చేసింది
సరికొత్త StarShip Inspired డిజైన్ తో లాంచ్ చేస్తున్నట్లు టెక్నో తెలిపింది
Tecno POVA CURVE 5G స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ డేట్ మరియు కీలకమైన ఫీచర్స్ ను కూడా టెక్నో రిలీజ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను సరికొత్త డిజైన్ మరియు ఆకట్టుకునే డీటెయిల్స్ తో లాంచ్ చేయబోతున్నట్లు టెక్నో టీజింగ్ చేస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ తో పాటు కీలకమైన ఫీచర్స్ తో Flipkart ద్వారా టెక్నో టీజింగ్ చేస్తోంది. ఈ అప్ కమింగ్ టెక్నో స్మార్ట్ ఫోన్ డీటెయిల్స్ పై ఒక లుక్కేద్దామా.
SurveyTecno POVA CURVE 5G : లాంచ్
టెక్నో పోవా కర్వ్ 5జి స్మార్ట్ ఫోన్ ను మే 29వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ అందించిన ప్రత్యేకమైన టీజర్ పేజీ నుంచి ఈ ఫోన్ లాంచ్ డేట్ ను కన్ఫర్మ్ చేసింది. ఇది మాత్రమే కాదు ఈ ఫోన్ యొక్క డిజైన్ మరియు కీలకమైన ఫీచర్స్ కూడా ఇదే పేజీ నుంచి అందించింది.
Tecno POVA CURVE 5G : ఫీచర్స్
ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను సరికొత్త స్టార్ షిప్ ఇన్స్పైర్డ్ డిజైన్ తో లాంచ్ చేస్తున్నట్లు టెక్నో తెలిపింది. ఫోన్ చూడటానికి రోబో సర్క్యూట్ డిజైన్ తో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. టెక్నో పోవా కర్వ్ స్మార్ట్ ఫోన్ ఫ్యూచర్ కర్వ్ డిజైన్ తో ఉంటుందని కూడా టెక్నో చెబుతోంది. ఈ ఫోన్ లో స్మూత్ కర్వుడ్ AMOLED స్క్రీన్ ఉంటుందని టెక్నో కన్ఫర్మ్ చేసింది. ఈ టెక్నో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ చాలా స్లీక్ గా ఉన్నట్లు కూడా ఈ ఫోన్ టీజర్ ఇమేజ్ ద్వారా క్లియర్ చేసింది.

టెక్నో పోవా కర్వ్ 5జి స్మార్ట్ ఫోన్ 64MP AI డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో NFC ఫీచర్ కూడా అందించింది. ఈ ఫోన్ సర్కిల్ టు సెర్చ్ మరియు AIGC Portrait 2.0 వంటి మరిన్ని ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇది కాకుండా యూజర్ సేఫ్టీ కోసం ఈ ఫోన్ లో AI సపోర్ట్ ఉంటుందట. క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ వంటి వాటిని ఫోటో తీసినప్పుడు అది సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కనిపించకుండా ELLA Blur ఎఫెక్ట్ తో బ్లర్ చేస్తుందని టెక్నో తెలిపింది.
Also Read: Mega Tablet Premier League సేల్ నుంచి మొబైల్ ఫోన్ రేటుకే లభిస్తున్న బెస్ట్ టాబ్లెట్.!
ఇది కాకుండా ఈ ఫోన్ కోసం అందించిన టీజర్ వీడియోలో ఈ ఫోన్ చాలా విషయాల్లో AI పవర్ కలిగిన ఫోన్ గా ఉంటుందని కూడా గొప్పగా చెబుతోంది. ఇందులో ఈ ఫోన్ AI ఆటో కాల్ ఆన్సరింగ్ ఫీచర్ కలిగిన సెగ్మెంట్ ఫస్ట్ ఫోన్ అవుతుంది టెక్నో తెలిపింది. AI ఫోటో ప్రాబ్లం సాల్వర్, AI కాల్ ట్రాన్స్ లేషన్ మరియు మరిన్ని AI ఫీచర్స్ తో ఈ ఫోన్ వస్తుందని టెక్నో వెల్లడించింది.