Tecno Pova 6 Neo 5G: రూ. 14,999 రేటుకే AI ఫోన్ లాంచ్ చేసిన టెక్నో.!

HIGHLIGHTS

ఈరోజు సరికొత్త 5జి స్మార్ట్ ఫోన్ ను టెక్నో లాంచ్ చేసింది

15 వేల ఉప బడ్జెట్ లో AI ఫీచర్స్ తో ఈ ఫోన్ ను లాంచ్ చేసింది

Tecno Pova 6 Neo 5G ఫోన్ ను అమెజాన్ స్పెషల్ గా తీసుకువచ్చింది

Tecno Pova 6 Neo 5G: రూ. 14,999 రేటుకే AI ఫోన్ లాంచ్ చేసిన టెక్నో.!

Tecno Pova 6 Neo 5G: ఈరోజు సరికొత్త 5జి స్మార్ట్ ఫోన్ ను టెక్నో లాంచ్ చేసింది. అదే, టెక్నో పోవా 6 నియో 5జి స్మార్ట్ ఫోన్ మరియు 15 వేల ఉప బడ్జెట్ లో AI ఫీచర్స్ తో ఈ ఫోన్ ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ ను అమెజాన్ స్పెషల్ గా తీసుకువచ్చింది. టెక్నో పోవా 6 నియో 5జి ఫోన్ ప్రైస్ మరియు ఫీచర్స్ తో సహా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Tecno Pova 6 Neo 5G: ప్రైస్

టెక్నో పోవా 6 నియో 5జి స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 14,999 ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ పైన రూ. 2,000 రూపాయల వరకు తగ్గింపు అందుకునే ఆఫర్స్ ను కూడా అందించింది. అవేమిటంటే, ఈ ఫోన్ పై రూ. 1,000 లాంచ్ డిస్కౌంట్ ఆఫర్ మరియు ఎక్స్ చేంజ్ పై రూ. 1,000 తగ్గింపు ఆఫర్ లను ప్రకటించింది. సెప్టెంబర్ 14వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి Amazon ద్వారా ఈ ఫోన్ సేల్ కి అందుబాటులోకి వస్తుంది.

Also Read: Jio Phone Prima 2: రూ. 2,799 ధరకే సూపర్ ఫీచర్ ఫోన్ లాంచ్ చేసిన జియో.!

Tecno Pova 6 Neo 5G: ఫీచర్స్

టెక్నో ఈ ఫోన్ ను 6.7 ఇంచ్ HD+ LCD స్క్రీన్ తో లాంచ్ అయ్యింది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు డైనమిక్ పోర్ట్ ఫీచర్ తో వస్తుంది. ఈ ఫోన్ ను మీడియాటెక్ డైమెన్సిటీ 6300 5G చిప్ సెట్ తో అందించింది. ఈ ఫోన్ 8GB ఫిజికల్ ర్యామ్ మరియు 8GB వర్చువల్ ర్యామ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ లో 256GB హెవీ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఉంటుంది.

Tecno Pova 6 Neo 5G

ఈ ఫోన్ లో 108MP AI డ్యూయల్ రియర్ కెమెరా మరియు 8MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ కెమెరా AIGC పోర్ట్రైట్, AI మ్యాజిక్ ఎరేజర్, AI వాల్ పేపర్ మరియు Ask AI వంటి చాలా AI ఫీచర్స్ ను కలిగి వుంది. ఈ ఫోన్ లో Dolby Atmos సౌండ్ సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్ సెటప్ వుంది. ఈ లేటెస్ట్ టెక్నో ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బ్యాటరీ సపోర్ట్ తో వస్తుంది.పోవా 6 నియో ఫోన్ IP 54 డస్ట్ మరియు స్ప్లాష్ రెసిస్టెంట్ తో పాటు అల్ డైరెక్షన్ NFC ఫీచర్ తో కూడా వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo