Jio Phone Prima 2: రూ. 2,799 ధరకే సూపర్ ఫీచర్ ఫోన్ లాంచ్ చేసిన జియో.!
రిలయన్స్ జియో మరొక జియో ఫీచర్ ఫోన్ ను లాంచ్ చేసింది
Jio Phone Prima 2 పేరుతొ లాంచ్ చేసిన ఈ ఫోన్ డైరెక్ట్ కాలింగ్ ఫీచర్ తో వచ్చింది
ఈ ఫోన్ ను చాలా చవక ధరలో మరిన్ని ఫీచర్స్ తో జియో లాంచ్ చేసింది
Jio Phone Prima 2: రిలయన్స్ జియో మరొక జియో ఫీచర్ ఫోన్ ను లాంచ్ చేసింది. జియో ఫోన్ ప్రైమా 2 పేరుతొ లాంచ్ చేసిన ఈ ఫీచర్ ఫోన్ డైరెక్ట్ కాలింగ్ ఫీచర్ తో వస్తుంది. ఈ ఫోన్ ను చాలా చవక ధరలో మరిన్ని ఫీచర్స్ తో జియో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ధర మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయో ఒక లుక్కేద్దాం పదండి.
SurveyJio Phone Prima 2: ధర
రిలయన్స్ జియో ఈ ఫోన్ ను కేవలం రూ. 2,799 ధరతో విడుదల చేసింది. ఈ ఫోన్ ను అమెజాన్ ఇండియా నుంచి సేల్ కి అందుబాటులోకి కూడా తీసుకు వచ్చింది. Buy From Here
Jio Phone Prima 2: ఫీచర్స్
జియో ఫోన్ ప్రైమ్ 2 ఫీచర్ ఫోన్ ను కర్వుడ్ డిజైన్ మరియు లెథర్ టెక్స్చర్ తో అందించింది. ఈ ఫోన్ కోవడానికి చాలా అనువైన గ్రిప్ ను ఈ టెక్స్చర్ తో అందించింది. ఈ ఫోన్ లో 2.4 ఇంచ్ కర్వుడ్ స్క్రీన్ వుంది. పేరు చెప్పలేదు కానీ ఈ ఫోన్ క్వాల్కమ్ ప్రోసెసర్ తో పని చేస్తుందని జియో తెలిపింది మరియు ఈ ఫోన్ 4GB ర్యామ్ మరియు మెమొరీ కార్డ్ తో 128GB వరకు స్టోరేజ్ పెంచుకునే అవకాశం ఉంటుంది.

ఈ జియో కొత్త ఫీచర్ ఫోన్ KaiOS 2.5.3 పై నడుస్తుంది మరియు రియర్ మరియు సెల్ఫీ కెమెరా లను కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ డైరెక్ట్ వీడియో కాలింగ్ సపోర్ట్ ను కలిగి ఉందని జియో తెలిపింది. ఈ ఫీచర్ ఫోన్ 2000 mAh బిగ్ బ్యాటరీ ని కలిగి వుంది 4G సపోర్ట్ కలిగిన సింగల్ నానో SIM సపోర్ట్ తో వస్తుంది.
Also Read: Vivo T3 Ultra 5G: రేపు లాంచ్ కి సిద్ధమైన ఈ ఫోన్ టాప్ 5 ఫీచర్లు ముందే తెలుసుకోండి.!
ఇక ఈ ఫోన్ ఇతర ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ Youtube, Facebook, గూగుల్ అసిస్టెంట్, UPI అండ్ Scan QR పేమెంట్స్, JioPay మరియు సౌండ్ అలర్ట్ వంటి ఫీచర్ ను కలిగి వుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile