ప్రముఖ బడ్జెట్ మొబైల్ తయారీ సంస్థ Tecno అతిపెద్ద బ్యాటరీతో స్మార్ట్ ఫోన్ తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. అదే, Tecno Pova 3 స్మార్ట్ ఫోన్ మరియు ఫోన్ ను 7000mAh బిగ్ బ్యాటరీని కలిగి ఉన్నట్లు కంపెనీ టీజర్ ద్వారా తెలియచేసింది. కేవలం పెద్ద బ్యాటరీ మాత్రమే కాదు ఈ ఫోన్ లో మరిన్ని ఫీచరాలు మరియు ఆకట్టుకునే స్పెక్స్ ను కూడా జత చేసినట్లు టెక్నో టీజింగ్ చేస్తోంది. ఈ ఫోన్ కోసం అమెజాన్ ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ అందించింది. కాబట్టి, ఈ ఫోన్ అమెజాన్ ద్వారా సేల్ కావచ్చు. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లో ఏమేమి వివరాలను అందచనున్నదో తెలుసుకుందామా.
Survey
✅ Thank you for completing the survey!
Tecno Pova 3: స్పెక్స్
ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ యొక్క కీలకమైన వివరాలను కంపెనీ ఇప్పటికే టీజర్ ద్వారా వెల్లడించింది. దీని ప్రకారం, టెక్నో పోవా 3 అతిపెద్ద 7000 mAh బ్యాటరీని 33W ఫాస్ట్ ఛార్జింగ్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ వేగవంతమైన గేమింగ్ ప్రాసెసర్ Helio G88 శక్తితో పనిచేస్తుంది. అంతేకాదు, దీనికి జతగా 6GB ర్యామ్ మరియు 5GB వర్చువల్ ర్యామ్ ఫీచర్ ను కూడా జత చేసినట్లు ప్రకటించింది. ఇక డిస్ప్లే పరంగా, ఈ ఫోన్ లో బిగ్ 6.9 ఇంచ్ FHD+ డాట్ డిస్ప్లేని కూడా అందించింది.
కెమెరా వివరాలను కూడా టెక్నో టీజర్ ద్వారా బయటపెట్టింది. ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ వుంది మరియు ఇందులో 50MP మైన్ కేమెరా వుంది. అలాగే, క్వాడ్ LED ఫ్లాష్ కూడా వుంది. గేమింగ్ కోసం 4D వైబ్రేషన్ Z-Axiz లీనియర్ మోటార్ మరియు డ్యూయల్ స్టీరియో స్పీకర్లను కూడా ఈ ఫోన్ కలిగి వుంది.
అయితే, ప్రస్తుతానికి ఈ ఫోన్ యొక్క స్పెక్స్ మరియు ఫీచర్లను మాత్రమే టెక్నో వెల్లడించింది. కానీ, విడుదల తేదీని మాత్రం ఇంకా వెల్లడించలేదు. ఈ ఫోన్ ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు టీజింగ్ చేస్తోంది.