Motorola Signature స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ డేట్ అనౌన్స్ చేసిన మోటోరోలా.!
Motorola Signature స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ మరియు టైం ను ఈరోజు కంపెనీ రివీల్ చేసింది
CES 2026 నుంచి ఈ ఫోన్ ను కంపెనీ రివీల్ చేసింది
8K వీడియో అండ్ డాల్బీ విజన్ సపోర్ట్ కెమెరా వంటి జబర్దస్త్ ఫీచర్స్ తో ఈ ఫోన్ ఇండియాలో లాంచ్ అవుతుంది
Motorola Signature స్మార్ట్ ఫోన్ ఇండియాలో ఎప్పుడు లాంచ్ అవుతోందో డేట్ మరియు టైం ను ఈరోజు కంపెనీ రివీల్ చేసింది. CES 2026 నుంచి ఈ ఫోన్ ను కంపెనీ రివీల్ చేసింది మరియు ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో లాంచ్ కావడానికి సిద్ధంగా ఉంది. ఈ ఫోన్ సూపర్ డిజైన్, 8K వీడియో అండ్ డాల్బీ విజన్ సపోర్ట్ కెమెరా వంటి జబర్దస్త్ ఫీచర్స్ తో ఈ ఫోన్ ఇండియాలో లాంచ్ అవుతుంది. ఈ అప్ కమింగ్ మోటోరోలా స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ అండ్ ఫీచర్స్ తెలుసుకోండి.
SurveyMotorola Signature : లాంచ్ డేట్?
మోటోరోలా సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్ ను జనవరి 23వ తేదీ ఇండియాలో లాంచ్ చేస్తున్నట్లు మోటోరోలా అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం ఫ్లిప్ కార్ట్ అందించిన ప్రత్యేకమైన టీజర్ పేజీ నుంచి ఈ ఫోన్ లాంచ్ టీజింగ్ వివరాలు మరియు డేటా అందించింది.
Motorola Signature: ఫీచర్స్
ఈ ఫోన్ వివరాలు ఇప్పటికే కంపెనీ బయటకు వెల్లడించింది. కంపెనీ ప్రకారం, ఈ ఫోన్ కేవలం 6.99mm మందం కలిగిన అల్ట్రా స్లిమ్ బాడీ తో ఉంటుంది. ఈ ఫోన్ అల్యూమినియం ఫ్రేమ్ మరియు ప్రీమియం ఫినిష్ కాంబోలో ఉంటుంది. అంతేకాదు, పాంటోన్ సర్టిఫైడ్ కలర్స్ తో ఉంటుంది. ఈ ఫోన్ లో 6.8 అంగుళాల బిగ్ LTPO AMOLED డిస్ప్లే ఉంటుంది. ఈ స్క్రీన్ 1.5K రిజల్యూషన్, 165Hz రిఫ్రెష్ రేట్ మరియు గరిష్టంగా 6,200 నిట్స్ టాప్ బ్రైట్నెస్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ HDR10+ సపోర్ట్ మరియు డాల్బీ విజన్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.

ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ క్వాల్కమ్ యొక్క లేటెస్ట్ శక్తివంతమైన ఫ్లాగ్ షిప్ చిప్ సెట్ Snapdragon 8 Gen 5 తో వస్తుంది. దీనికి జతగా 12GB ర్యామ్ మరియు 512GB స్టోరేజ్ కలిగి ఉంటుందని చెబుతున్నారు. అయితే, ఇండియా వేరియంట్ గురించి ఇంకా ఈ వివరాలు కన్ఫర్మ్ కాలేదు. ఈ ఫోన్ Android 16 ఆపరేటింగ్ సిస్టం తో జతగా Hello UI లేటెస్ట్ సాఫ్ట్ వేర్ తో నడుస్తుంది.
ఇక కెమెరా సెటప్ గురించి చూస్తే, ఈ ఫోన్ లో 50MP Sony LYTIA 828 ప్రధాన సెన్సార్, 50MP పెరిస్కోప్ టెలిఫోటో (3x ఆప్టికల్ జూమ్) మరియు 50MP అల్ట్రా వైడ్ కెమెరా కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా ఉంటుంది. ఈ కెమెరా ఏకంగా 8K రిజల్యూషన్ వీడియోలు మరియు 4K Dolby Vision వీడియో సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. అలాగే, ఈ ఫోన్ లో ముందు 50MP సెల్ఫీ కెమెరా ఉంటుంది మరియు ఇది కూడా 4K వీడియో సపోర్ట్ కలిగి ఉంటుంది.
Also Read: Amazon Sale నుంచి గెలాక్సీ S25, OnePlus 15 మరియు పిక్సెల్ 9A పై భారీ డిస్కౌంట్ అందుకోండి.!
బ్యాటరీ అండ్ ఛార్జింగ్ పరంగా, ఈ ఫోన్ లో 5,200mAh పెద్ద బ్యాటరీ ఉంటుంది మరియు 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 50W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ లో Bose ట్యూన్డ్ డ్యూయల్ స్టీరియో స్పీకర్ సెటప్ ఉంటుంది మరియు డాల్బీ అట్మాస్ సౌండ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ కూడా ఇండస్ట్రీ లీడింగ్ IP68 అండ్ IP69 రేటింగ్ తో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ సపోర్ట్ కలిగి ఉంటుంది.