Tecno Pop 9: ప్రీమియం డిజైన్ తో టెక్నో కొత్త ఫోన్ లాంచ్ అవుతోంది.!

HIGHLIGHTS

Tecno Pop 9 స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ అనౌన్స్ చేసింది

టెక్నో పాప్ 9 స్మార్ట్ ఫోన్ ను త్వరలోనే విడుదల చేస్తుందని కంపెనీ అనౌన్స్ చేసింది

టెక్నో పాప్ 9 స్మార్ట్ ఫోన్ ను అమెజాన్ స్పెషల్ గా తీసుకొస్తున్నట్లు కూడా అనౌన్స్ చేసింది

Tecno Pop 9: ప్రీమియం డిజైన్ తో టెక్నో కొత్త ఫోన్ లాంచ్ అవుతోంది.!

Tecno Pop 9 స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ మరియు కీలకమైన ఫీచర్స్ ను కంపెనీ అనౌన్స్ చేసింది. భారత మార్కెట్లో 5G ఫోన్స్ చాలా వేగంగా మార్కెట్ వాటా ఆక్రమిస్తున్నా, 4G స్మార్ట్ ఫోన్ మార్కెట్ కూడా బాగానే వుంది. అందుకే, ఈ కేటగిరిలో కూడా టెక్నో కొత్త ఫోన్ లను వేగంగా విడుదల చేస్తోంది. ఇటీవలే పాప్ 8 ను విడుదల చేసిన టెక్నో చాలా వేగంగా ఇదే సిరీస్ నుంచి పాప్ 9 ను కూడా లాంచ్ చేస్తోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Tecno Pop 9 : లాంచ్

టెక్నో పాప్ 9 స్మార్ట్ ఫోన్ ను త్వరలోనే విడుదల చేస్తుందని కంపెనీ అనౌన్స్ చేసింది. అయితే, ఈ ఫోన్ లాంచ్ డేట్ కంటే ముందే ఈ ఫోన్ యొక్క ఎక్స్ పెక్టడ్ ప్రైస్ మరియు కీలకమైన ఫీచర్స్ తో టీజింగ్ మొదలు పెట్టింది. టెక్నో పాప్ 9 స్మార్ట్ ఫోన్ ను అమెజాన్ స్పెషల్ గా తీసుకొస్తున్నట్లు కూడా అనౌన్స్ చేసింది.

Tecno Pop 9 Features

టెక్నో పాప్ 9 స్మార్ట్ ఫోన్ ను X,X99 ధరతో కంపెనీ టీజింగ్ చేస్తోంది. ఇది బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కాబట్టి 8 వేల రూపాయల కంటే తక్కువ ధరలో లాంచ్ కావచ్చని అంచనా వేస్తున్నారు. అయితే, టెక్నో అధికారికంగా అనౌన్స్ చేసే వరకు మనం ఈ విషయాన్ని అంచనా ధరగా మాత్రమే చూస్తాము.

Also Read: Redmi A4 5G ని కేవలం రూ. 8,499 ధరకే లాంచ్ చేసింది.. ఫీచర్స్ మాత్రం అదుర్స్.!

Tecno Pop 9 : ఫీచర్స్

టెక్నో పాప్ 9 స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ G50 చిప్ సెట్ తో లాంచ్ అయ్యే మొదటి ఫోన్ గా ఉంటుంది. ఈ ఫోన్ 6GB ర్యామ్ ఫీచర్ మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుందని కూడా టెక్నో ముందే వెల్లడించింది. ఈ ఫోన్ చాలా స్లీక్ డిజైన్ తో ఉంటుంది మరియు రౌండ్ కార్నర్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP54 రేటింగ్ తో ఉంటుంది.

ఈ అప్ కమింగ్ టెక్నో ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా ఉంటుంది మారియు ఇందులో 50MP మెయిన్ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ పెద్ద స్క్రీన్ ను పంచ్ హోల్ డిజైన్ తో కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 90Hz రిఫ్రెష్ రేట్ తో ఉంటుంది. ఈ ఫోన్ లో 5000 mAh బిగ్ బ్యాటరీ మరియు 18W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ను కలిగి ఉంటుంది. ఇది మాత్రమే కాదు ఈ ఫోన్ లో DTS సౌండ్ సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కూడా ఉంటాయి.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile