స్పెక్స్ సరిపోలిక :శామ్సంగ్ గెలాక్సీ S10e vs షావోమి మి 9

స్పెక్స్ సరిపోలిక :శామ్సంగ్ గెలాక్సీ S10e vs షావోమి మి 9
HIGHLIGHTS

ఈ రెండు ఫోనులలో ఏ ఫోన్ ఒక మంచి హార్డ్వేర్ తీసుకొస్తుంది మరియు పోటీలో ఏ స్మార్ట్ ఫోన్ విజయం సాధించగలదని తెలుసుకోవడానికి ఈ రెండు స్మార్ట్ ఫోన్లను సరిపోల్చి చూద్దాం ?

శామ్సంగ్ గెలాక్సీ S10e, గెలాక్సీ S10, గెలాక్సీ S10 + వంటి మూడు స్మార్ట్  ఫోన్లను,  గెలాక్సీ S  లైనప్ లో మూడు ప్రధాన డివైజెస్ గా  శామ్సంగ్ ప్రారంభించింది. ఈ మూడు ఫోన్లలో అన్నింటికంటే చౌకైన స్మార్ట్ ఫోన్, గాలక్సీ S10e, ఇది రూ. 55,900 ప్రారంభ ధర వద్ద ప్రారంభించబడింది. మరోవైపు షావోమి చైనాలో తన Mi 9 ను  బుధవారం ప్రారంభించింది, ఇది Xiaomi Mi 8 కి ఒక వారసుడిగా ఉంది. అందువల్ల ఈ రెండు ఫోనులలో ఏ ఫోన్ ఒక మంచి హార్డ్వేర్ తీసుకొస్తుంది మరియు  పోటీలో ఏ స్మార్ట్ ఫోన్ విజయం సాధించగలదని తెలుసుకోవడానికి ఈ రెండు స్మార్ట్ ఫోన్లను సరిపోల్చి చూద్దాం ?

డిస్ప్లే

శామ్సంగ్ గెలాక్సీ S10e ఒక 5.8-అంగుళాల FHD + ఇన్ఫినిటీ- O డిస్ప్లేని కలిగి ఉంది, ఇది ఒక చిన్న పంచ్ హోల్ కటౌట్  కలిగి ఉంటుంది, ఇది ఒక నోచ్ కు బదులుగా సెల్ఫీ కెమెరా కోసం ముందు డిస్ప్లేలో ఒక పంచ్ హోల్ చేయబడుతుంది. మరోవైపు, షావోమి మి 9, 2340 x 1080 పిక్సల్స్ యొక్క రిజల్యూషన్ను అందించే ఒక 6.39 అంగుళాల శామ్సంగ్ AMOLED డిస్ప్లేని కలిగి ఉంది.

పర్ఫార్మెన్సు

శామ్సంగ్ గెలాక్సీ S10e ఒక Exynos 9820 ఆక్టా-కోర్ ప్రాసెసరుతో వస్తుంది, ఇది ఒక 6GB RAM మరియు 128GB అంతర్గత మెమరీతో జత చేయబడుతుంది, అలాగే ఇది ఒక మైక్రో SD కార్డు ద్వారా 512GB వరకు పంచుకోగల సామర్ధ్యాన్నికలిగి ఉంటుంది. మరోవైపు, షావోమి మి 9 ఒక తాజా క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్  855 ఆక్టా -కోర్ ప్రాసెసర్ ద్వారా మద్దతు ఇస్తుంది, ఇది 6GB RAM మరియు 128GB అంతర్గత మెమరీతో పాటు జత చేయబడుతుంది, అయితే ఇందులో మెమోరిని పెంచుకునే అవకాశంలేదు.

కెమెరాలు

షావోమి మి 9 యొక్క ప్రధాన ముఖ్యాంశాలలో ఒకటిగా దాని వెనుక భాగంలోని  48MP + 16MP + 12MP ట్రిపుల్ కెమెరా సెటప్ గురించి చేప్పుకోవచ్చు. ముందు, ఈ ఫోనులో సెల్ఫీల కోసం 20MP సెన్సారును అందించారు. మరొక పైపు, శామ్సంగ్ గెలాక్సీ S10e ముందువైపు 10MP సెన్సారుతో పాటుగా వెనుక  ఏర్పాటు చేసిన డ్యూయల్ 12MP + 16MP కెమెరాను కలిగి ఉంది.

ఇప్పుడు, మార్చి 5 వరకు భారతదేశంలో శామ్సంగ్ గెలాక్సీ S10e  ప్రీ-ఆర్డర్ల కోసం అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 55,900 రూపాయలకు అందుబాటులో ఉంది. ముందుగా బుక్ చేసిన వారికి 6,000 రూపాయల క్యాష్ బ్యాక్ కూడా అందుతుంద,  అందుకోసం HDFC  బ్యాంకు క్రెడిట్ లేదా డెబిట్ కార్డుతో పేమెంట్ చేయాల్సివుంటుంది . మరోవైపు, షావోమి మి 9 చైనాలో CNY 3,999 (appx Rs 31,800) ధరతో విడుదల చేయబడింది. ఈ ఫోన్ అతిత్వరలో భారతదేశంలో కనిపించనుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo