స్పెక్స్ సరిపోలిక : రియల్మీU1 vs అసూస్ జెన్ ఫోన్ మాక్స్ ప్రో M2 టైటానియం ఎడిషన్

స్పెక్స్ సరిపోలిక : రియల్మీU1 vs అసూస్ జెన్ ఫోన్ మాక్స్ ప్రో M2 టైటానియం ఎడిషన్
HIGHLIGHTS

మార్కెట్లో మంచి అమ్మకాలను సాధించినటువంటి, ఈ రెండు స్మార్ట్ ఫోన్లను సరిపోల్చి చూద్దాం.

2018 లో వచ్చినటువంటి ఉత్తమ బడ్జెట్ స్మార్ట్ ఫోన్లలో, అసూస్ జెన్ ఫోన్ మాక్స్ ప్రో M2 కూడా ఒకటి. ఈ ఫోన్ కారిన్ గొరిల్లా గ్లాస్ 6 యొక్క రక్షణతో వస్తుంది మరియు క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 660 ప్రాసెసర్ తో వస్తుంది. ఇంకొక వైపు, RealMe U1 గురించి చూస్తే, ఇది ఒక మీడియా టెక్ హీలియో P70 చిప్సెట్ తో వచ్చిన ప్రపంచంలో మొదటి స్మార్ట్ ఫోన్. రూ. 10,000 కంటే తక్కువ ధరలో ఒక స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నట్లయితే ఈ ఫోన్ ఒక మంచి ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చు. ఇప్పుడు RealMe U1 కూడా భారతదేశంలో 1,000 రూపాయల తక్కువధరతో అందుతుంది. అయితే, దాని 4GB RAM వేరియంట్ ఇప్పటికీ అదే ధర వద్ద అమ్మకాలను కొనసాగిస్తోంది. ఈ రెండింటిలో, హార్డ్వేర్ పరంగా ఏది గొప్పగా ఉంటుంది పరిశీలించాడనికి వీటిని సరిపోల్చి చూద్దాం.

RealMe U1 vs Max Pro M2.png

మీరు పైన షీట్ లో చూడవచ్చు, అసూస్ జెన్ ఫోన్ మాక్స్ ప్రో M2 ఒక 1080 x 2280 పిక్సెల్స్ గల ఒక 6.26-అంగుళాల డిస్ప్లేని అందిస్తుంది. ఈ ఫోన్ పైన ఒక సంప్రదాయ నోచ్ ఉంది, ఇందులో ఒక సెల్ఫీ కెమెరా మరియు ఒక మైక్ ఉన్నాయి. మరొక వైపు, రియల్మీU1 1080 x 2340 పిక్సల్స్ యొక్క రిజల్యూషనుతో  వచ్చిన ఒక పెద్ద 6.3-అంగుళాల స్క్రీన్ కలిగి ఉంది. ఇది పైభాగంలో ఒక వాటర్ డ్రాప్ నోచ్ కలిగివుంది, ఇది మీ ఫోన్లో కంటెంట్ను చూడడానికి మరింత ఎక్కువ స్క్రీన్ స్థలాన్ని అందిస్తుంది.

మీరు ఒక క్వాల్కమ్ చిప్సెట్స్ అభిమాని అయితే, అసూస్ జెన్ ఫోన్ మాక్స్ ప్రో M2 ఒక క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 660 ప్రాసెసర్ ద్వారా శక్తిని కలిగివుంది, ఇది 3GB RAM మరియు 32GB అంతర్గత మెమరీతో జతగా వస్తుంది. మరొక వైపు, రియల్మీU1 కూడా 3GB RAM మరియు 32GB అంతర్గత మెమరీతో జత చేయబడినది మరియు ఒక మీడియా టెక్ హీలియో P70 చిప్సెట్ కలిగి ఉన్న మొట్టమొదటి స్మార్ట్ ఫోన్.

ఈ రెండు స్మార్ట్ ఫోన్ల కెమెరాల విషయానికి వస్తే, రియల్మీU1 స్మార్ట్ ఫోన్ ముందు AI- ఆధారిత 25MP సెల్ఫీ కెమెరాతో పాటుగా వెనుకవైపు ఒక డ్యూయల్  13MP + 2MP కెమెరా సెటప్పుతో సంస్థ ద్వారా వచ్చిన మొదటి సెల్ఫీ-సెంట్రిక్ ఫోన్. ఒక అసూస్ జెన్ ఫోన్ మాక్స్ ప్రో M2 కూడా ముందు ఒక 13MP సెన్సారుతో పాటుగా వెనుక డ్యూయల్ 12MP + 5MP కెమెరా సెటప్పుతో ఉంది.

అసూస్ జెన్ ఫోన్ మాక్స్ ప్రో M2 టైటానియం ఎడిషన్ భారతదేశం లో రూ 12,999 ధరతో అందుబాటులో ఉంది, అయితే  రియల్మీU1 ఇప్పుడు Amazon.in నుండి Rs 10,999 డిస్కౌంట్ ధర వద్ద అందుబాటులో ఉంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo