స్పెక్స్ సరిపోలిక : మోటో G7 vs మోటో G6

స్పెక్స్ సరిపోలిక : మోటో G7 vs మోటో G6
HIGHLIGHTS

మోటో విడుదలచేయనున్న G-సిరీస్ లో ఒకటైన మోటో G7 ను దాని ముందు ఫోన్ అయిన మోటో G6 తో సరిపోల్చి చూద్దాం.

ఇటీవల కాలంలో అత్యంత ప్రాచుర్యం పొందిన మోటో జి-సిరీస్ శ్రేణిలో నాలుగు కొత్త స్మార్ట్ ఫోన్లను విడుదల చేయనున్నట్లు మోటో ప్రకటించింది. మోటరోలా, ఒక     పరిమిత బడ్జెట్లో గొప్ప ప్రత్యేకతలను అందిచేదిగా ఈ  G సిరీస్ ను పిలుస్తారు. ఈ కొత్త సిరీస్ నుండి ప్రకటించిన Moto G7, 2018 లో మంచి ఫెచర్లతో వచ్చిన Moto G6 కంపెనీ స్థానంలో ప్రకటించింది. కాబట్టి, కంపెనీ దాని ముందు తీసుకొచ్చిన Moto G6 తో పోలిస్తే దాని తాజా Moto G7 అందించే కొత్త అంశాలను  చూడటానికి ఎంతవరకు ఆసక్తికరంగా ఉంటుందో తెలుసుకోవడానికి ఈ రెండింటిని సరిపీల్చి చూద్దాం.

Moto G7 vs Moto G6.png

ఈ రెండు స్మార్ట్ ఫోన్ల డిస్ప్లే విషయానికి వస్తే,మోటో G6 ఫోన్ 1080 x 2160 పిక్సెల్స్ తో రిజల్యూషన్ను అందిచే ఒక 5.70-అంగుళాల డిస్ప్లేతో ఉంటుంది. ఒక Moto G7 ఫోన్ గురించి చూస్తే ఇది 1080 x 2270 పిక్సల్స్ యొక్క రిజల్యూషన్ను అందించే కొద్దిగా పెద్దధైన ఒక 6.2 అంగుళాల స్క్రీన్ కలిగివుంటుంది.

ఇక ప్రాసెసర్ల విషయానికి వస్తే, మోటో G6 ఒక క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 450 ఆక్టా -కోర్ ప్రాసెసరుతో జతగా, 4GB RAM మరియు 64GB అంతర్గత మెమరీతో వస్తుంది. ఇక Moto G7 క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 632 చిప్సెట్  తో వస్తుంది, ఇది మోటో G6 ప్రాసెసర్ అయిన స్నాప్ డ్రాగన్ 450 కంటే వేగంగా ఉంటుంది. ఈ ఫోన్ 4GB RAM మరియు 64GB అంతర్గత మెమరీని కలిగి ఉంది, ఒక మైక్రో SD కార్డ్ ద్వారా 128GB వరకు స్టోరేజిని పెంచుకోవచ్చు.

కెమేరా విభాగంలో, ఈ రెండు ఫోన్లు కూడా వెనుక ఒక 12MP + 5MP డ్యూయల్ కెమెరా సెటప్పును కలిగివుంటాయి. అయితే, ఇది మోటో G7 లోముందు  8MP సెన్సార్ను అందించింది, ముందుగా వచ్చిన Moto G6 లో ముందు 16MP యూనిట్ కలిగి ఉంది. మెగాపిక్సెల్స్ కంటే కెమెరా నాణ్యతకు దోహదపడే  ఇతర కారణాలు చాలా ఉన్నందువల్ల, ఈ విభాగంలో తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు.

Moto G6 భారతదేశంలో రూ .15,990 ధరతో ప్రారంభించబడింది. ఈ ఫోన్ ఇప్పుడు అమెజాన్ ఇండియాలో 12,999 రూపాయల రాయితీ ధర వద్ద అందుబాటులో ఉంది. మరోవైపు, మోటో G7 న్ని త్వరలో ఇండియాలో ప్రారంభించనుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo