స్పెక్స్ కంపారిజన్ : హువావే మేట్ 20 vs హువావే P20

స్పెక్స్ కంపారిజన్ : హువావే మేట్ 20 vs హువావే P20
HIGHLIGHTS

ఈ రోజు మనం, ట్రిపుల్ కెమెరాలతో నిన్నవిడుదలైన హువావే మేట్ 20ప్రో ను హువావే P20 ప్రో తో సరిపోల్చనున్నాము.

నవంబర్ 26 న హువాయ్ ఇండియాలో తన మేట్ 20 ప్రో ని విడుదల చేసింది. ఈ స్మార్ట్ఫోన్ ఒక ట్రిపుల్ 40MP + 20MP + 8MP వెనుక కెమెరాను కలిగి ఉంది మరియు 6.39 అంగుళాల డిస్ప్లేతో వస్తుంది. మరొక వైపు, వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా కలిగిన హువావే యొక్క మొదటి సామ్రాట్ ఫోన్ అయినటువంటి,  P20 ప్రో కలిగివున్నాము. కాబట్టి, మీ కోసం ఉత్తమమైన కొనుగోలు ఏది అవనుందో, శీఘ్ర వివరణతో పోలికలను సరిపోల్చి చూద్దాం.

Huawei mate vs pro.png

ఈ రెండు ప్రీమియం పరికరాల ప్రదర్శనను వివరంగా పోల్చి చూస్తే, 1440 x 3120 పిక్సెల్స్ యొక్క రిజల్యూషన్ను అందించే ఒక 6.3 అంగుళాల డిస్ప్లేతో హువాయ్ యొక్క మేట్ 20 ప్రో వస్తుంది. మరోవైపు, హువావే P20 ప్రో 1080 x 2240 పిక్సెల్స్ యొక్క రిజల్యూషనుతో ఒక 6.10-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది. మీరు ఒక పెద్ద స్క్రీన్ పరిమాణం కలిగిన ఒక స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, హువాయ్ P20 ప్రో మీరు ఎంచుకునే వాటిలో ఉండవచ్చు, ఇది కొద్దిగా పెద్ద ప్రదర్శనతో వస్తుంది. అయితే, మేట్ 20 ప్రోఫోన్  P20 ప్రో కంటే మంచి రిజల్యూషన్  అందిస్తుంది.

వీటి పనితీరు విషయానికి వస్తే, హువావే మేట్ 20 ప్రో కిరిన్ 980 ఆక్టా – కోర్ ప్రాసెసరుతో ఉంటుంది, అయితే ఈ హువావే  P20 ప్రో కిరిన్ 970 ప్రాసెసర్ మద్దతు ఇస్తుంది.

కెమెరా విభాగంలోకివస్తే, ఈ రెండు పరికరాలు కూడా వెనుకవైపు ఏర్పాటు చేసిన ట్రిపుల్ కెమెరాలతో వస్తాయి. ఈ మేట్ 20  మరియు P20 ప్రో రెండు ముందు భాగంలో 24MP కెమేరాతో,  వెనుకవైపు ఏర్పాటు చేయబడిన 40MP + 20MP + 8MP ట్రిపుల్ కెమెరాలతో వస్తాయి.

మేట్ 20 ప్రో తాజా Android 9.0 పై నడుస్తుంది, హువాయ్ P20 ప్రో Android 8.0 Oreo తో వస్తుంది . మేట్ 20 ప్రో భారతదేశంలో 69,990 రూపాయల నుండి ప్రారంభమవుతుంది, అయితే మీరు P20 ప్రో రూ .64,999 ధరతో పొందవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo