స్పెక్స్ సరిపోలిక : శామ్సంగ్ గెలాక్సీ M30 vs అసూస్ జెన్ఫోన్ మాక్స్ ప్రో M2
ఒకే ధర విభాగంలో వుండే రెండు స్మార్ట్ ఫోన్లను సరిపోల్చి చూద్దాం.
శామ్సంగ్ తన గెలాక్సీ M సిరీస్ నుండి గెలాక్సీ M30 ని మరోక వేరియంట్ గా ప్రవేశపెట్టింది, మరియు ఈ M సిరీస్ లో ఇది చాలా ప్రీమియం ఫోనుగా ఉంది. ఈ ఫోన్ రూ .14,990 ప్రారంభ ధరతో ఉంటుంది. భారతదేశంలో ప్రవేశపెట్టిన ఈ ధరతో పోలిస్తే, ఇది ఆసుస్ జెన్ఫోన్ మాక్స్ ప్రో M2 కి దగ్గరిగా ఉంటుంది. ఈ శామ్సంగ్ గెలాక్సీ M30 వెనుకవైపున ఒక ట్రిపుల్ కెమెరా సెటప్ను కలిగి ఉంది మరియు సూపర్ AMOLED FHD + డిస్ప్లేతో వస్తుంది. ఇంకొక వైపు, అసూస్ జెన్ఫోన్ మాక్స్ ప్రో M2 ఒక డ్యూయల్ రియర్ కెమెరాలు మరియు ఒక 6.26 అంగుళాల FHD + డిస్ప్లే కలిగి ఉంది. కాబట్టి, ఈ రెండు పరికరాల యొక్క వివరాలను పోల్చి , వీటిమధ్య తేడా ఏమిటో చూద్దాం.
Surveyడిస్ప్లే
శామ్సంగ్ గెలాక్సీ M30 ఫోన్ 1080 x 2220 పిక్సల్స్ యొక్క రిజల్యూషన్ను అందించే ఒక 6.4 అంగుళాల FHD + డిస్ప్లే తో ఉంటుంది. ఈ ఫోన్ డిస్ప్లే పైన చిన్న వాటర్-డ్రాప్ నోచ్ కలిగి ఉంది, ఇది ముందు భాగంలోని కెమెరా మరియు మైక్రోఫోన్ను కలిగి ఉంటుంది. మరోవైపు, ఆసుస్ జెన్ఫోన్ మాక్స్ ప్రో M2 ఫోన్ 1080 x 2280 పిక్సల్స్ యొక్క రిజల్యూషనుతో కొద్దిగా చిన్నదైన ఒక 6.26-అంగుళాల డిస్ప్లేతో ఉంటుంది.
ప్రాసెసర్, RAM మరియు స్టోరేజి
శామ్సంగ్ గెలాక్సీ M30 ఒక Exynos 7904 ఆక్టా-కోర్ ప్రాసెసర్, 4GB RAM మరియు 64GB అంతర్గత మెమరీ జతగా వస్తుంది. మరోవైపు, ఆసుస్ జెన్ఫోన్ మాక్స్ ప్రో M2, ఒక క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 660 ప్రాసెసర్,4GB RAM మరియు 64GB అంతర్గత మెమరీతో జతగా వస్తుంది, దీన్ని 2TB వరకు విస్తరించవచ్చు.
కెమెరాలు
శామ్సంగ్ గెలాక్సీ M30 ముందు ఒక 16MP సెన్సారుతో పాటుగా వెనుక ఒక 16MP + 5MP + 5MP ట్రిపుల్ రియర్ కెమెరాను కలిగివుంటుంది. ఇంకొక వైపు, అసూస్ జెన్ఫోన్ మాక్స్ ప్రో M2 సెల్ఫీ కోసం ముందు 13MP కెమేరాతో పాటు వేనుక 12MP + 5MP డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది.
ధర
శామ్సంగ్ గెలాక్సీ M 30 ఇండియాలో రూ .14,990 ధరతో లభిస్తుంది. ఇక అసూస్ జెన్ఫోన్ మాక్స్ ప్రో M2 ఇండియాలో రూ .14,999 ధరతో ఉంటుంది.