సామ్సంగ్, సోనీ, HTC ఫోనులలో ఆండ్రాయిడ్ N – 7.0 అప్ డేట్ తో వస్తున్న మోడల్స్

సామ్సంగ్, సోనీ, HTC ఫోనులలో ఆండ్రాయిడ్ N – 7.0 అప్ డేట్ తో వస్తున్న మోడల్స్

సోనీ కంపెని కొన్ని Xperia డివైజెస్ లో ఆండ్రాయిడ్ Nougat అప్ డేట్ వస్తున్నట్లు అనౌన్స్ చేసింది. గూగల్ Nougat 7.0 వెర్షన్ ను మొదటి phase లో రిలీజ్ చేసిన ఒక రోజు తరువాత సోనీ ఇలా అనౌన్స్ చేయటం ఎవరూ ఊహించలేదు.

ఆండ్రాయిడ్ N అప్ డేట్ రానున్న సోనీ మోడల్స్..

  • Xperia Z3+
  • Xperia Z5
  • Xperia Z5 compact (ఇండియా లో రిలీజ్ కాలేదు)
  • Xperia Z5 premium
  • Xperia X
  • Xperia XA
  • Xperia XA Ultra
  • Xperia X performance (ఇండియా లో రిలీజ్ కాలేదు)
  • Xperia Z4 Tablet (ఇండియా లో రిలీజ్ కాలేదు)

అయితే సోనీ మరిన్ని ఫోనులు వస్తున్నట్లు తెలపలేదు ఎక్కడా. సో కేవలం వీటికి మాత్రమే ఆండ్రాయిడ్ N అప్ డేట్ వస్తుంది అని అంచనా. అయితే అప్ డేట్ రావటానికి కనీసం రెండు నెలలు పడుతుంది అని రిపోర్ట్స్. ఆండ్రాయిడ్ కొత్త వెర్షన్ అప్ డేట్ లో ప్రతీ సంవత్సరం ఉండేది ఈ late.

సామ్సంగ్ ఫోనుల్లో ప్రస్తుతానికి నోట్ 7 కు రెండు నెలలో అప్ డేట్ వస్తున్నట్లు తెలిపింది కంపెని. దీనితో పాటు S7 లైన్ లోని మోడల్స్ కూడా సపోర్ట్ చేస్తాయి అని అంచనా.

HTC ప్రస్తుతానికి కేవలం మూడు ఫోనులకు ఆండ్రాయిడ్ N వస్తున్నట్లు తెలిపింది. అవి – HTC One A9, HTC 10 and One M9. మిగిలిన డివైజెస్ అప్ డేట్ లిస్టు లో యాడ్ అవుతాయా లేదా అని htc కూడా తెలపలేదు. అసలు ఆండ్రాయిడ్ కొత్త వెర్షన్ ఎందుకు వెంటనే అన్ని ఫోనులకు రాదు అని తెలుసుకోవటానికి ఈ లింక్ లోకి వెళ్ళగలరు.
ఈ క్రింద మీరు samsung galaxy A5 2016 తెలుగు రివ్యూ వీడియో ను చూడగలరు..

PJ Hari

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo