శాంసంగ్ గెలాక్సీ M42 5G ఫోన్ వచ్చేసింది

శాంసంగ్ గెలాక్సీ M42 5G ఫోన్ వచ్చేసింది
HIGHLIGHTS

20 వేల ధరలో 5G టెక్నాలజీ

గెలాక్సీ M42 5G ఫోన్ 5G ఫీచర్లతో లాంచ్

ఇండియాలో శాంసంగ్ తన గెలాక్సీ M42 5G స్మార్ట్ ఫోన్ ను 5G ఫీచర్లతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ 20 వేల ధరలో 5G టెక్నాలజీ మరియు మంచి పెర్ఫార్మెన్స్ తో వుంటుందని శాంసంగ్ తెలిపింది. ఈ శాంసంగ్ 5G ఫోన్ ను ముందుగా కొనేవారికి ఇంట్రడక్టరి అఫర్ క్రింద మరింత తక్కువ ధరకే పొందవచ్చు. ఈ ఫోన్ యొక్క అన్ని వివరాలను ఈ క్రింద చూడవచ్చు.  

శాంసంగ్ గెలాక్సీ M42 5G : ధర

శాంసంగ్ గెలాక్సీ M42 5G  (6జీబీ + 128 జీబీ ) : రూ.21,999

శాంసంగ్ గెలాక్సీ M42 5G  (8జీబీ + 256 జీబీ ) : రూ.23,999

అయితే, మే 1 కి మొదటిసారిగా సేల్ కి అందుబాటులోకి రానున్న ఈ ఫోన్ ను ఇంట్రడక్టరీ అఫర్ క్రింద 2,000 రూపాయల తక్కువ ధరకే కొనుగోలు చెయవచ్చు. అమెజాన్ మరియు శాంసంగ్ రిటైల్ స్టోర్స్ నుండి కోనుగోలు చెయ్యవచ్చు.      

శాంసంగ్ గెలాక్సీ M42 5G : ప్రత్యేకతలు

గెలాక్సీ M42 5G స్మార్ట్ ఫోన్ పెద్ద 6.62 -అంగుళాల HD + రిజల్యూషన్ గల సూపర్ AMOLED డిస్ప్లే తో వుంటుంది మరియు ఇది 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 300Hz టచ్ శ్యాంప్లింగ్ రేట్ గల డిస్ప్లే. ఇందులో, సెల్ఫీ కెమెరా కోసం పైన చిన్న నోచ్ డిజైన్ ని అందించింది.

ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 750 5G ప్రాసెసర్ శక్తితో వస్తుంది మరియు ఇది ఆక్టా-కోర్ CPU. ఇది 8GB RAM మరియు 128GB స్టోరేజ్ ఎంపికతో జత చేయబడుతుంది. ఇది OneUI 3.1 ఆధారితంగా ఆండ్రాయిడ్ 11 తో వస్తుంది.

ఇక కెమెరాల విషయంలో, శాంసంగ్ గెలాక్సీ M42 5G వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్ తో వస్తుంది. దీనిలో, ప్రధాన కెమెరాని 48MP సెన్సార్ తో అందించింది. దీనికి జతగా 8MP వైడ్ యాంగిల్, 5MP మ్యాక్రో కెమెరా మరియు 5MP డెప్త్ సెన్సార్ లను జతచేసింది. ముందు భాగంలో, 20 MP సెల్ఫీ కెమెరాని అందించింది. ఈ ఫోన్ పెద్ద 5,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని 15W  అడాప్టివ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగివుంటుంది.                         

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo