Samsung Galaxy A12 బడ్జెట్ ధరలో విడుదల

Samsung Galaxy A12 బడ్జెట్ ధరలో విడుదల
HIGHLIGHTS

Samsung తన Galaxy A12 స్మార్ట్ ఫోన్ ను సరసమైన ధరలో విడుదల చేసింది.

Galaxy A12 ఫోన్ ధరను మాత్రం బడ్జెట్ లోనే ఉంచింది.

Samsung Galaxy A12 ఫోన్ A సిరీస్ నుండి ఎక్కువ ఫీచర్లతో వచ్చిన సరసమైన ఫోనుగా వుంటుంది.

Samsung తన Galaxy A12 స్మార్ట్ ఫోన్ ను సరసమైన ధరలో విడుదల చేసింది. Galaxy A12 పెద్ద బ్యాటరీ, 48 MP క్వాడ్ కెమెరా సెటప్ మరియు మరిన్ని ఇతర ఫీచర్లతో వస్తుంది. ఎక్కువ ఫీచర్లను అఫర్ చేస్తున్న కూడా, శామ్సంగ్ ఈ ఫోన్ ధరను మాత్రం బడ్జెట్ లోనే ఉంచింది. ఈ ఫోన్ A సిరీస్ నుండి ఎక్కువ ఫీచర్లతో వచ్చిన సరసమైన ఫోనుగా వుంటుంది.

Samsung Galaxy A12: ధర

Samsung Galaxy A12  రెండు వేరియంట్ లలో లభిస్తుంది. ఇక Galaxy A12 యొక్క ధర విషయానికి వస్తే, 4GB మరియు 64GB స్టోరేజ్ బేసిక్ వేరియంట్ ని Rs.12,999 రుపాయల ధరతో, 128GB స్టోరేజ్ వేరియంట్ ని Rs.13,999 రుపాయల ధరతో విడుదల చేసింది.

Samsung Galaxy A12: స్పెషిఫికేషన్స్

Samsung Galaxy A12 స్మార్ట్ ఫోన్ 6.5 అంగుళాల HD+ డిస్ప్లేని కలిగివుంది. ఈ డిస్ప్లేవాటర్ డ్రాప్ డిజైన్ తో వస్తుంది. Galaxy A12 మీడియా టెక్ యొక్క Helio P35 ఆక్టా కోర్ ప్రొసెసర్ ని కలిగి వుంది. ఇది Power VR గ్రాఫిక్స్ తో వస్తుంది. ఈ మొబైల్ 4GB ర్యామ్ మరియు 64GB/128GB ఇంటర్నల్ స్టోరేజ్ అప్షన్లతో వస్తుంది. స్టోరేజ్ ను మరింతగా పెంచడానికి SD కార్డు అప్షన్ కూడా ఇవ్వబడింది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 10 ఆధారితంగా One UI Core 2.5 స్కిన్ పైన నడుస్తుంది.       

Samsung Galaxy A12 స్మార్ట్ ఫోన్ కెమెరా పరంగా, వెనుక భాగంలో క్వాడ్ కెమెరా సెటప్ కలిగి వుంది. ఈ క్వాడ్ కెమెరా సెటప్ లో 48MP ప్రైమరీ కెమెరాకి జతగా 5MP అల్ట్రా వైడ్ కెమెరా, 2MP మ్యాక్రో మరియు  2MP డెప్త్ సెన్సార్ వున్నాయి. ఈ ఫోన్ ముందుభాగంలో సెల్ఫీల కోసం 8MP సెల్ఫీ కెమెరాని అందించింది. Samsung Galaxy A12 స్మార్ట్ ఫోన్ మొత్తానికి పవర్ అందించడాని 5,000 mAh బ్యాటరీని 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో అందించింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo