ఇండియాలో విడుదలైన SAMUNG Z FLIP : ఇవే టాప్ ఫీచర్లు

ఇండియాలో విడుదలైన SAMUNG Z FLIP : ఇవే టాప్ ఫీచర్లు

2020 ఫిబ్రవరి 11 న శామ్సంగ్ తన గెలాక్సీ అన్ ప్యాక్డ్ కార్యక్రమంలో కొత్త క్లామ్‌షెల్ ఫోల్డబుల్ ఫోన్‌ ను ప్రకటించింది. ఈ డివైజ్  US లో అందుబాటులోకి వచ్చినప్పటికీ, ఇది భారతదేశంలో ఇంకా విడుదల చేయబడలేదు. అయితే, కంపెనీ చిట్టచివరకు మన దేశంలో కూడా ఈ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ కోసం ప్రీ-ఆర్డర్లు తీసుకోవడం ప్రారంభించింది. ఈ ఫోల్డబుల్ ఫోన్, కేవలం 8GB + 256GB మోడల్ తో ప్రకటించింది మరియు దీన్ని సొంతం చేసుకోవాలంటే మాత్రం రూ. 1,09,999 రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇది, మిర్రర్ బ్లాక్, మిర్రర్ పర్పుల్, మిర్రర్ గోల్డ్ వంటి మూడు కలర్ ఆప్షన్లలో అందిస్తున్నారు. వినియోగదారులు శామ్సంగ్ ఇ-స్టోర్ ద్వారా ఈ ఫోన్ను ముందస్తు ఆర్డర్(ప్రీ ఆర్డర్)  చేయవచ్చు మరియు ఆఫ్‌లైన్ రిటైలర్లను ఎంచుకోవచ్చు.

ఫిబ్రవరి 26 నుండి శామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ ప్రీ-ఆర్డర్‌లను ప్రారంభిస్తుంది. కంపెనీ బాక్స్ లోపల ఉచిత కవర్ మరియు AKG హెడ్‌ ఫోన్లను ప్యాక్ చేస్తోంది. ఓపెన్  సేల్ ను తరువాత తేదీలో ప్రారంభించవచ్చని భావిస్తున్నారు.

శామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ మడత పెట్టగల ఒక 6.7-అంగుళాల Full -HD (1080×2636 పిక్సెల్స్) 21.9: 9 ఆస్పెక్టు రేషియో మరియు 425 PPI పిక్సెల్ సాంద్రతతో డైనమిక్ అమోలెడ్ ఇన్ఫినిటీ ఫ్లెక్స్ డిస్ప్లేని కలిగి ఉంది. అలాగే, ఇది 303 పిపి పిక్సెల్ సాంద్రతతో ద్వితీయ 1.1-అంగుళాల (112×300 పిక్సెల్స్) సూపర్ అమోలెడ్ డిస్ప్లేను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 855+ SoC యొక్క శక్తితో వస్తుంది. ఇది 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. అయితే, మైక్రో SD కార్డుతోస్టోరేజిని మరింత విస్తరించడానికి ఇందులో ఎంపిక మాత్రం ఇవ్వలేదు.

ఆప్టిక్స్ విషయానికొస్తే, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ ను కలిగి ఉంది: ఇందులో 12MP వైడ్ యాంగిల్ సెన్సార్ (ఎఫ్ / 1.8, 1.4-మైక్రాన్ పిక్సెల్స్, 78-డిగ్రీ ఎఫ్‌ఒవి) + 12 ఎంపి అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ (ఎఫ్ / 2.2 , 1.12-మైక్రాన్ పిక్సెల్స్, 123-డిగ్రీ FoV, OIS). ముందు భాగంలో 10 MP సెల్ఫీ షూటర్ ఉంది. హ్యాండ్‌సెట్ 3300 ఎంఏహెచ్ బ్యాటరీని ప్యాక్ చేస్తుంది మరియు సింగిల్ మోనో స్పీకర్‌ను కలిగి ఉంది.

గెలాక్సీ జెడ్ ఫ్లిప్ కొత్త ఫ్లెక్స్ మోడ్ UI తో వస్తుంది, ఇది గెలాక్సీ జెడ్ ఫ్లిప్‌ను విభిన్న కోణాల్లో తెరవడానికి అనుమతిస్తుంది. ఇద్న్హులో అందించిన చిన్న స్క్రీన్ ఫోన్ను  తెరవకుండానే అన్ని ముఖ్యమైన నోటిఫికేషన్‌ లను స్కాన్ చేయడానికి స్వైప్-టు-నోటిఫికేషన్ ఫీచరును కలిగి ఉంది. అంతేకాక, దుమ్మును చేరనీయకుండా చేయడం కోసం శామ్సంగ్, కీలు అంచులలో చిన్న నైలాన్ ఫైబర్స్ ను జతచేసింది. ఈ ఈ స్క్రీను 200,000 సార్లు తెరిచి మూసినా ఎటువంటి ఇబ్బంది ఉండదని సంస్థ చెబుతోంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo