శామ్సంగ్ గెలాక్సీ A సిరీస్ నుండి A10,A30 మరియు A50 స్మార్ట్ ఫోన్లను విడుదలచేసింది

శామ్సంగ్ గెలాక్సీ A సిరీస్ నుండి A10,A30 మరియు A50 స్మార్ట్ ఫోన్లను విడుదలచేసింది
HIGHLIGHTS

శామ్సంగ్ గెలాక్సీ A10 సింగిల్, గెలాక్సీ A30 డ్యూయల్ మరియు గెలాక్సీ A30 ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్పుతో ఉంటాయి.

శామ్సంగ్ గెలాక్సీ A నుండి సరోకొత్తగా మూడు స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది. అవి,  శామ్సంగ్ గెలాక్సీ A10, గెలాక్సీ A30 మరియు గెలాక్సీ A50 స్మార్ట్ ఫోన్. వీటిలో, గెలాక్సీ A30 బడ్జెట్ ఫోన్ కాగా, మిగిలిన గెలాక్సీ A30 మరియు గెలాక్సీ A50 స్మార్ట్ ఫోన్లు మిడ్ రేంజ్ సెగ్మెంట్ పోన్లుగా ఉంటాయి. అలాగే, వీటిని వాటి ధరలకు తగ్గట్టుగా, శామ్సంగ్ గెలాక్సీ A10 సింగిల్ కెమెరాతో అందించగా,  గెలాక్సీ A30 స్మార్ట్ ఫోన్ను డ్యూయల్ కెమెరాతో మరియు గెలాక్సీ A30 ను ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్పుతో అందించింది.

శామ్సంగ్ గెలాక్సీ A10

ఈ స్మార్ట్ ఫోన్ ఒక ఎంట్రీలెవల్ బడ్జెట్ స్మార్ట్ ఫోనుగా శామ్సంగ్ తీసుకొచ్చింది. ఇది ఒక 6.2 అంగుళాల HD+ ఇన్ఫినిటీ v- డిస్ప్లేతో ఉంటుంది. అంటే, V వలనే ఉండే ఒక వాటర్ డ్రాప్ నోచ్ అన్నమాట. ఒక దీని ఆప్టిక్స్ పరంగా చూస్తే, ఇది వెనుక భాగంలో కేవలం 13MP సింగిల్ కెమెరాతో పాటుగా ముందు 5MP సెల్ఫీ కెమేరాతో అందించబడింది మరియు ఇది ఒక పేస్ రికనైజేషన్ సపోర్టుతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్, ఒక Exynos 7884 ఆక్టా కోర్ ప్రొసెసర్ శక్తితో 3GB ర్యామ్ జతగా వస్తుంది.  ఈ ఫోన్ రెడ్, బ్లూ ,బ్లాక్ రంగులలో లభిస్తుంది మరియు ఒక 3,400 mAh బయటరీతో వస్తుంది.

శామ్సంగ్ గెలాక్సీ A30

ఇక ఈ శామ్సంగ్ గెలాక్సీ A30 స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే,  ఒక మిడ్ రేంజ్ సెగ్మెంట్ స్మార్ట్ ఫోనుగా శామ్సంగ్ తీసుకొచ్చింది. ఇది ఒక 6.4 అంగుళాలసూపర్ AMOLED ఇన్ఫినిటీ U- డిస్ప్లేతో ఉంటుంది. అంటే, U వలనే ఉండే ఒక వాటర్ డ్రాప్ నోచ్ అన్నమాట. ఇది వెనుక భామతో ఒక ఫింగర్ ప్రింట్ సెన్సారుతో వస్తుంది మరియు ఒక 4,000 mAh బ్యాటరీ ఇందులో అందించింది. అలాగే ఆప్టిక్స్ పరంగా చూస్తే, ఇది వెనుక భాగంలో 16MP+5MP  డ్యూయల్ కెమెరాతో పాటుగా ముందు 16MP సెల్ఫీ కెమేరాతో అందించబడింది మరియు ఇది ఒక 3D Arc డిజన్ తో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్, ఒక Exynos 7904 ఆక్టా కోర్ ప్రొసెసర్ శక్తితో 4GB ర్యామ్ జతగా వస్తుంది.  ఈ ఫోన్ రెడ్, బ్లూ ,బ్లాక్ రంగులలో లభిస్తుంది.

శామ్సంగ్ గెలాక్సీ A50

గెలాక్సీ A సిరీస్ నుండి వచ్చిన మూడు ఫోన్లలో, ఈ శామ్సంగ్ గెలాక్సీ A50 స్మార్ట్ ఫోన్ ప్రీమియంగా ఉంటుంది.  ఈ ఫోన్ ఒక  6.4 అంగుళాల ఫుల్ HD+ సూపర్ AMOLED ఇన్ఫినిటీ U- డిస్ప్లేతో ఉంటుంది. సంస్థ ప్రకారంగా, ఇది ఒక 91.6 %స్క్రీన్- టూ- బాడీ రేషియోతో వస్తుంది.  ఇది వేనుక భాగంలో ఒక ట్రిపుల్ రియర్ కెమేరా సెటప్పును కలిగి ఉంటుంది. ఈ ట్రిపుల్ రియర్ కెమెరా, ఒక 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ జతగా 25MP ప్రధాన కెమరాతో జతగా మరొక 5MP డెప్త్  కెమేరాని కలిగి ఉంటుంది. ఈ కెమేరా, శామ్సంగ్ యొక్క ఇంటెలిజెంట్ సీన్ ఆప్టిమైజర్ ని ఉపయోగించి, కాంట్రాస్ట్, బ్రైట్ మరియు కలర్ ను ఆప్టిమైజ్ చేస్తుంది.

ఈ  శామ్సంగ్ గెలాక్సీ A50  స్మార్ట్ ఫోన్ ఒక Exynos 9610 ఆక్టా – కోర్ ప్రాసెసర్ మరియు జతగా 6GB ర్యామ్ శక్తితో నడుస్తుంది. ఈ ఫోన్ ఒక ఆన్ స్క్రీన్  ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో అందించబడింది. ఇది ఒక 15W ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేయగల ఒక 4,000 mAh బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్, బ్లూ, బ్లాక్ మరియు వైట్ వంటి మూడు కలర్ల ఎంపికతో లభిస్తుంది. ఇది, 4GB మరియు 6GB ర్యామ్ వేరియంట్లలో లభిస్తుంది.                       

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo