Samsung Galaxy Unpacked: కొత్త ఫోల్డబుల్ ఫోన్లు మరియు స్మార్ట్ వాచ్‌లపై భారీ అంచనాలు.!

HIGHLIGHTS

శాంసంగ్ గెలాక్సీ అన్ ప్యాక్డ్ ఈవెంట్ డేట్ ను శాంసంగ్ కన్ఫర్మ్ చేసింది

Samsung Galaxy Unpacked ఈవెంట్ పై భారీ అంచనాలు ఉన్నాయి

ఈవెంట్ నుంచి కొత్త ఫోల్డబుల్ ఫోన్లు మరియు స్మార్ట్ వాచ్‌ లు లాంచ్ కావచ్చని అంచనా

Samsung Galaxy Unpacked: కొత్త ఫోల్డబుల్ ఫోన్లు మరియు స్మార్ట్ వాచ్‌లపై భారీ అంచనాలు.!

Samsung Galaxy Unpacked: ఎట్టకేలకు శాంసంగ్ గెలాక్సీ అన్ ప్యాక్డ్ ఈవెంట్ డేట్ ను శాంసంగ్ కన్ఫర్మ్ చేసింది. ఇది శాంసంగ్ నిర్వచించే బిగ్ ఈవెంట్ మరియు 2026 ఈవెంట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే, ఈ అప్ కమింగ్ ఈవెంట్ నుంచి కొత్త ఫోల్డబుల్ ఫోన్లు మరియు స్మార్ట్ వాచ్‌ లు లాంచ్ కావచ్చని భారీ అంచనాలు ఉన్నాయి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Samsung Galaxy Unpacked: ఈవెంట్ డేట్ ఏమిటి?

శాంసంగ్ గెలాక్సీ అన్ ప్యాక్డ్ ఈవెంట్ జూలై 22న జరుగుతుంది. శాంసంగ్ ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా అత్యాధునిక స్మార్ట్‌ ఫోన్లు, స్మార్ట్‌ వాచ్‌లు మరియు ఇతర గ్యాడ్జెట్‌ లను పరిచయం చేస్తుంది. ఈసారి కూడా న్యూ టెక్నాలజీ, మెరుగైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లు మరియు మరింత శక్తివంతమైన ఫోల్డబుల్ డివైస్‌ లను శాంసంగ్ ఆవిష్కరించే అవకాశం ఉందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Samsung Galaxy Unpacked: ఫోల్డబుల్ ఫోన్

ఈ ఏడాది గెలాక్సీ అన్ ప్యాక్డ్ ఈవెంట్‌ లో న్యూ జనరేషన్ ఫోల్డబుల్ ఫోన్ ప్రధాన ఆకర్షణగా నిలిచే అవకాశం ఉందని చెబుతున్నారు. గత మోడళ్లతో పోలిస్తే ఈ అప్ కమింగ్ మోడల్స్ మరింత సన్నని డిజైన్, బలమైన హింజ్, మెరుగైన డిస్‌ప్లే మరియు గొప్ప పెర్ఫార్మెన్స్ అందించే ప్రాసెసర్‌ వంటి ఫీచర్స్ తో వచ్చే అవకాశం ఉందని సమాచారం.

Samsung Galaxy Unpacked

ఇదే కాదు, ఈ అప్ కమింగ్ ఫోల్డబుల్ ఫోన్లు కెమెరా సామర్థ్యాలు కూడా చాలా గొప్పగా ఉంటాయని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. తక్కువ వెలుగు ఉన్న సందర్భాల్లో కూడా అద్భుతమైన ఫోటోలు ఈ ఫోన్ లో పొందవచ్చు. అంతేకాదు, AI ఆధారిత ఫోటో ఎడిటింగ్ మరియు వీడియో నాణ్యతలో మెరుగుదల వంటి ఫీచర్లు కూడా అందుబాటులోకి రావచ్చు.

కొత్త స్మార్ట్‌ వాచ్‌ లాంచ్

ఫోల్డబుల్ ఫోన్ తో పాటు కొత్త Galaxy Watch మోడళ్లను కూడా కంపెనీ విడుదల చేసే అవకాశం ఉంది. వీటిలో మరింత ఖచ్చితమైన హెల్త్ ట్రాకింగ్, స్లీప్ విశ్లేషణ, హార్ట్‌రేట్ మానిటరింగ్, ఫిట్‌ నెస్ ఫీచర్లతో పాటు ఎక్కువ సమయం నిల్చి ఉండే బ్యాటరీ వంటి అప్‌ గ్రేడ్‌ లు ఉండే అవకాశం ఉంది.

ఇది కాకుండా Galaxy Buds వంటి వైర్‌ లెస్ ఇయర్‌ బడ్స్‌ కు సంబంధించిన కొత్త ప్రకటనలు కూడా ఈ ఈవెంట్‌ లో ఉండవచ్చని టెక్ మార్కెట్ అంచనా వేస్తోంది.

Also Read: Google Pixel 11 Series లాంచ్‌ ఈవెంట్‌ ఆహ్వానాలు పంపుతున్న గూగుల్.. ఏయే మోడళ్లు వస్తున్నాయంటే.!

ప్రత్యక్ష ప్రసారం

శాంసంగ్ గెలాక్సీ అన్ ప్యాక్డ్ ఈవెంట్ ను ప్రపంచవ్యాప్తంగా ఆన్‌ లైన్‌ లో ప్రత్యక్ష ప్రసారం చేసే అవకాశం ఉంది. దీంతో టెక్నాలజీ అభిమానులు ఇంటి నుంచే కొత్త ప్రొడక్ట్స్ ఆవిష్కరణను వీక్షించవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile