Google Pixel 11 Series లాంచ్ ఈవెంట్ ఆహ్వానాలు పంపుతున్న గూగుల్.. ఏయే మోడళ్లు వస్తున్నాయంటే.!
Google Pixel 11 Series లాంచ్ కోసం గూగుల్ రంగం సిద్ధం చేసింది
మీడియా ప్రతినిధులకు మరియు టెక్ ఇండస్ట్రీ పార్టనర్స్ కి అధికారిక ఆహ్వానాలు పంపించడం ప్రారంభించింది
పిక్సెల్ 11 సిరీస్ తో పాటు మరికొన్ని కొత్త గూగుల్ డివైస్ లను కూడా కంపెనీ ఆవిష్కరించే అవకాశం ఉంది
గూగుల్ స్మార్ట్ ఫోన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న Google Pixel 11 Series లాంచ్ కోసం గూగుల్ రంగం సిద్ధం చేసింది. గూగుల్ తన వార్షిక Made by Google ఈవెంట్ నిర్వహణకు సంబంధించి మీడియా ప్రతినిధులకు మరియు టెక్ ఇండస్ట్రీ పార్ట్నర్స్ కి అధికారిక ఆహ్వానాలు (Invites) పంపించడం ప్రారంభించింది. ఈవెంట్ ఆగస్టు 12 న అమెరికాలోని న్యూయార్క్ సిటీ లో జరగనుంది. ఈ సందర్భంగా పిక్సెల్ 11 సిరీస్ తో పాటు మరికొన్ని కొత్త గూగుల్ డివైస్ లను కూడా కంపెనీ ఆవిష్కరించే అవకాశం ఉంది.
SurveyGoogle Pixel 11 Series : లాంచ్ డేట్
పైన తెలిపిన విధంగా గూగుల్ తన అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ ను 2026 ఆగస్టు 12 న రిలీజ్ చేయడానికి సిద్దమయ్యింది. ఈ సిరీస్ గురించి ఇప్పటికే భారీ అంచనాలు మార్కెట్ నడుస్తున్నాయి. గత జనరేషన్ ఫోన్ లతో పోలిస్తే ఈ అప్ కమింగ్ సిరీస్ చాలా అప్గ్రేడ్ లు కలిగి ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఏయే మోడళ్లు లాంచ్ అయ్యే అవకాశం ఉంది?
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం గూగుల్ ఈసారి మొత్తం నాలుగు ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్లను పరిచయం చేసే అవకాశం ఉంది. ఈ నాలుగు ఫోన్లు ఇక్కడ చూడవచ్చు.
- గూగుల్ పిక్సెల్ 11
- గూగుల్ పిక్సెల్ 11 ప్రో
- గూగుల్ పిక్సెల్ 11 ప్రో XL
- గూగుల్ పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్
అయితే, ఫోల్డబుల్ మోడల్ మార్కెట్లో కొంత ఆలస్యంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయినప్పటికీ, లాంచ్ ఈవెంట్ లో ఈ ఫోన్ ను కూడా ప్రకటించే అవకాశం ఉందని రిపోర్టులు చెబుతున్నాయి. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ గురించి మార్కెట్ లో ఇప్పటికే చాలా రూమర్లు మరియు అంచనా ఫీచర్స్ చక్కర్లు కొడుతున్నాయి.
Tensor G6 ప్రాసెసర్
ఈ అప్ కమింగ్ సిరీస్ లో గూగుల్ సరికొత్తగా రూపొందించిన కొత్త Tensor G6 చిప్ సెట్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇది 2nm టెక్నాలజీ పై రూపొందించబడిన తొలి Tensor చిప్ కావచ్చని లీక్స్ చెబుతున్నాయి.
AI మ్యాజిక్
కొత్త ఫోన్ లాంచ్ చేసే ప్రతిసారి పిక్సెల్ ఫోన్ కెమెరాకు మరింత ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్న గూగుల్, ఈసారి కూడా AI ఆధారిత ఫోటోగ్రఫీ ఫీచర్లను మరింత శక్తివంతంగా తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది.
Also Read: Philips Dolby Smart Tv పై జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్ రిలీజ్ చేసిన ఫ్లిప్ కార్ట్ GOAT Sale
Android 17 OS
పిక్సెల్ 11 సిరీస్ లో లేటెస్ట్ Android 17 ఆపరేటింగ్ సిస్టమ్ (OS) ప్రీ ఇన్ స్టాల్ గా వచ్చే అవకాశం ఉంది. Gemini AI ఆధారిత కొత్త స్మార్ట్ ఫీచర్లు, మెరుగైన సెక్యూరిటీ, మరింత వేగవంతమైన పెర్ఫార్మెన్స్ ఈ ఫోన్స్ ప్రధాన ఆకర్షణగా ఉండనున్నాయి.
ఇప్పటి వరకు మార్కెట్ లో మరియు ఆన్లైన్ లోకి వచ్చిన లీక్స్ మరియు రూమర్లు చూసాము. ఈ ఫోన్ లాంచ్ తర్వాత ఈ ఎస్టిమేషన్ ఫీచర్స్ లో నిజం ఎంత ఉందో తెలుస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
