Samsung Galaxy S26 FE launched globally know price and features
Samsung Galaxy S26 FE స్మార్ట్ ఫోన్లు ఎట్టకేలకు ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసింది. శామ్సంగ్ గెలాక్సీ సిరీస్ యొక్క బడ్జెట్ స్మార్ట్ ఫోన్ వేరియంట్ గా ఇది మార్కెట్లో అడుగు పెట్టింది. ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ని సరికొత్త డిజైన్ మరియు ఫీచర్స్ తో పాటు AI శక్తితో శాంసంగ్ విడుదల చేసింది. జస్ట్ ఇప్పుడే మార్కెట్లో అడుగుపెట్టిన ఈ శాంసంగ్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ యొక్క భారత వేరియంట్ ప్రైస్ మరియు ఫీచర్స్ పై ఒక లుక్కేద్దామా.
శాంసంగ్ గెలాక్సీ s26 FE స్మార్ట్ ఫోన్ ని గ్లోబల్ మార్కెట్లో కేవలం 699 యూఎస్ డాలర్ ప్రైస్ ట్యాగ్ తో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క బేసిక్ వేరియంట్ అయిన 8 జీబీ మరియు 128 జీబీ వేరియంట్ ని ఈ ప్రైస్ తో విడుదల చేసింది. 799 US డాలర్ తో రిలీజ్ చేసింది.
ఈ లేటెస్ట్ శాంసంగ్ స్మార్ట్ ఫోన్ యొక్క ఇండియా వేరియంట్ ప్రైస్ ఇంకా విడుదల కాలేదు. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ సెప్టెంబర్ 18వ తేదీ నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుందని శాంసంగ్ తన అఫీషియల్ వెబ్సైట్ నుంచి అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ US ప్రైస్ తో పోలిస్తే, ఈ ఫోన్ 80 నుంచి 90 వేల రూపాయల ప్రైస్ తో వచ్చే అవకాశం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
Also Read: Raksha Bandhan 2026: మీ తోబుట్టువులకు షేర్ చేయడానికి బెస్ట్ విషెస్ మరియు ఇమేజస్ ఇక్కడ అందించాము.!
శాంసంగ్ ఈ స్మార్ట్ ఫోన్ ను 6.7 ఇంచ్ డైనమిక్ AMOLED 2X స్క్రీన్ తో లాంచ్ చేసింది. ఈ స్క్రీన్ FHD+ రిజల్యూషన్,120Hz రిఫ్రెష్ రేట్ మరియు 3,400 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. ఈ ఫోన్ ని శాంసంగ్ గెలాక్సీ సిరీస్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన Exynos 2500 చిప్ సెట్ తో లాంచ్ చేసింది. ఇది శాంసంగ్ అందించిన డేకా కోర్ లేటెస్ట్ చిప్సెట్ మరియు మంచి పెర్ఫార్మన్స్ అందిస్తుందని శాంసంగ్ తెలిసింది. అంతేకాదు ఈ స్మార్ట్ ఫోన్లో 8GB ర్యామ్ మరియు 256gb ఇంటర్నల్ స్టోరేజ్ కూడా శాంసంగ్ అందించింది.
కెమెరా పరంగా, ఈ ఫోన్ లో 50MP మెయిన్ కెమెరా జతగా 12MP అల్ట్రా వైడ్ మరియు 8MP టెలిఫోటో సెన్సార్ కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా అందించింది. ఇది ఏకంగా 8K UHD వీడియో సపోర్ట్ మరియు లేటెస్ట్ ఏఐ కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఇది కాకుండా ఈ ఫోన్ ముందు భాగంలో 12MP సెల్ఫీ కెమెరా కూడా అందించింది.
గెలాక్సీ ఎస్ 26 FE స్మార్ట్ ఫోన్ 4900 mAh బ్యాటరీతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ లో 45W ఫాస్ట్ వైర్డ్ ఛార్జ్ సపోర్ట్ మరియు వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్ ని కూడా అందించింది. ఈ ఫోన్ ను లేటెస్ట్ One UI జతగా ఆండ్రాయిడ్ 17 OS తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ అల్యూమినియం ఫ్రేమ్ మరియు గొరిల్లా గ్లాస్ విక్టస్ కాంబినేషన్ తో చాలా దృఢమైన డిజైన్ లో వచ్చింది.