Samsung Galaxy S25+: ఫాస్ట్ వైర్లెస్ ఛార్జ్ మరియు AI సపోర్ట్ తో లాంచ్ అయ్యింది.!

Samsung Galaxy S25+: ఫాస్ట్ వైర్లెస్ ఛార్జ్ మరియు AI సపోర్ట్ తో లాంచ్ అయ్యింది.!

Samsung Galaxy S25+: శామ్సంగ్ గెలాక్సీ S25 సిరీస్ నుంచి ఈరోజు మూడు ఫోన్లు విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ పెద్ద స్క్రీన్, ఫాస్ట్ వైర్లెస్ ఛార్జ్ మరియు AI సపోర్ట్ తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ను గ్లోబల్ మార్కెట్ తో పాటు ఇండియన్ మార్కెట్ లో కూడా విడుదల చేసింది. ఈ రోజే సరికొత్తగా విడుదలైన ఈ శామ్సంగ్ స్మార్ట్ ఫోన్ ప్రతి వివరాలు తెలుసుకోండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Samsung Galaxy S25+: ఫీచర్స్

శామ్సంగ్ గెలాక్సీ S25+ 5జి స్మార్ట్ ఫోన్ పెద్ద 6.7 ఇంచ్ Dynamic AMOLED 2X స్క్రీన్ తో వచ్చింది. ఈ స్క్రీన్ QHD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు అడాప్టివ్ కలర్ టోన్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను లేటెస్ట్ చిప్ సెట్ తో లాంచ్ చేసింది మరియు దీనికి జతగా 12GB ర్యామ్ మరియు 512GB ర్యామ్ స్టోరేజ్ సపోర్ట్ కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ లో కూడా శామ్సంగ్ గెలాక్సీ S25 లో కలిగిన అదే కెమెరా ఉంటుంది. ఇందులో 12MP అల్ట్రా వైడ్, 50 MP వైడ్ మరియు 10MP టెలిఫోటో ట్రిపుల్ కెమెరా వుంది మరియు ముందు 12MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ 4K వీడియో రికార్డింగ్, స్టన్నింగ్ ఇమేజెస్ మరియు జూమ్ సపోర్ట్ తో వస్తుందని శామ్సంగ్ తెలిపింది.

ఈ శామ్సంగ్ గెలాక్సీ S25 ఫోన్ తో పోలిస్తే ఈ ఫోన్ పెద్ద బ్యాటరీ మరియు మరింత వేగవంతమైన ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 4900 mAh బ్యాటరీ వుంది మరియు డిడ్ 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ లో ఫాస్ట్ వైర్లెస్ ఛార్జింగ్ 2.0 సపోర్ట్ కూడా వుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 OS పైన శామ్సంగ్  లేటెస్ట్ One UI 7 సాఫ్ట్ వేర్ తో పని చేస్తుంది. ఈ ఫోన్ కూడా IP68 రేటింగ్ తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది.

Samsung Galaxy S25+: ధర

శామ్సంగ్ ఈ ఫోన్ ను US మార్కెట్ లో $999 స్టార్టింగ్ ప్రైస్ తో లాంచ్ చేసింది. ఈ ప్రైస్ ను బేసిక్ వేరియంట్ (12GB + 256GB) వేరియంట్ కోసం నిర్ణయించింది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo