Samsung Galaxy S25 5G: కొత్త ఫీచర్స్ మరియు AI సపోర్ట్ తో లాంచ్ అయ్యింది.!

Samsung Galaxy S25 5G: కొత్త ఫీచర్స్ మరియు AI సపోర్ట్ తో లాంచ్ అయ్యింది.!

Samsung Galaxy S25 5G స్మార్ట్ ఫోన్ ను ఈరోజు శామ్సంగ్ విడుదల చేసింది. గెలాక్సీ ఎస్25 సిరీస్ లో ఈ ఫోన్ బేసిక్ ఫోన్ అవుతుంది మరియు ప్రైస్ పరంగా కూడా ఈ సిరీస్ లో తక్కువ రేటులో ఉంటుంది. అయితే, ఈ ఫోన్ స్పెక్స్ పరంగా ఆకట్టుకునే స్పెక్స్ తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ధర మరియు ఫీచర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం పదండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Samsung Galaxy S25 5G : ఫీచర్స్

శామ్సంగ్ గెలాక్సీ ఎస్25 స్మార్ట్ ఫోన్ 6.2 ఇంచ్ Dynamic AMOLED 2X స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ సూపర్ స్మూత్ 120Hz రిఫ్రెష్ రేట్, FHD+ రిజల్యూషన్ మరియు విజన్ బూస్టర్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 7.2mm మందంతో చాలా సన్నగా ఉంటుంది. ఈ ఫోన్ ను శామ్ చిప్ సెట్ తో లాంచ్ చేసింది. దీనికి జతగా 12GB ర్యామ్ మరియు 512GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.

ఈ శామ్సంగ్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ 12MP అల్ట్రా వైడ్, 50 MP వైడ్ మరియు 10MP టెలిఫోటో కెమెరాలు కలిగిన ట్రిపుల్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో ముందు 12MP సెల్ఫీ కెమెరాని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కెమెరా AI ఫీచర్స్, 30fps / 60 fps 4K వీడియో రికార్డింగ్ మరియు మరిన్ని కెమెరా ఫీచర్స్ తో వస్తుంది.

శామ్సంగ్ గెలాక్సీ ఎస్25 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 15 OS తో శామ్సంగ్  యొక్క లేటెస్ట్ One UI 7 సాఫ్ట్ వేర్ తో నడుస్తుంది. ఈ ఫోన్ లో 4000 mAh బిగ్ బ్యాటరీ వుంది మరియు ఇది 25W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ మరియు ఫాస్ట్ వైర్లెస్ ఛార్జింగ్ 2.0 సపోర్ట్ కూడా వుంది. ఈ ఫోన్ IP68 రేటింగ్ తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది.

Samsung Galaxy S25 5G : ప్రైస్

శామ్సంగ్ గెలాక్సీ ఎస్25 స్మార్ట్ ఫోన్ ను US మార్కెట్ లో $799 ప్రారంభ ధరతో లాంచ్ చేసింది.

Samsung Galaxy S25 5G : ఇండియా ప్రైస్

శామ్సంగ్ గెలాక్సీ ఎస్25 స్మార్ట్ ఫోన్ ను రెండు వేరియంట్స్ లో లాంచ్ చేసింది. ఈ రెండు వేరియంట్ ధర వివరాలు ఈ క్రింద చూడవచ్చు.

శామ్సంగ్ గెలాక్సీ S25 (12GB + 256GB) ధర : రూ. 80,999

శామ్సంగ్ గెలాక్సీ S25 (12GB + 512GB) ధర : రూ. 92,999

ఈ ఫోన్ Pre-Book ఈ రోజు నుంచి మొదలయ్యింది. ఈ ఫోన్ ను అమెజాన్ మరియు Samsung అధికారిక వెబ్సైట్ ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చు.

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile