Samsung Galaxy S23 Ultra 5G స్మార్ట్ ఫోన్ పై రూ . 37,000 భారీ డిస్కౌంట్ అందుకోండి, అంటోంది అమెజాన్. శామ్సంగ్ గెలాక్సీ అల్ట్రా 5జి స్మార్ట్ ఫోన్ సూపర్ 200MP కెమెరా సెటప్ తో ఉంటుంది. ఈ శామ్సంగ్ స్మార్ట్ ఫోన్ ను మంచి బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ తో మరింత చవక ధరకు అందుకోవచ్చు. అమెజాన్ ఈరోజు ఆఫర్ చేస్తున్న ఈ భారీ స్మార్ట్ ఫోన్ డీల్ ను గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
Survey
✅ Thank you for completing the survey!
Samsung Galaxy S23 Ultra 5G : ఆఫర్
శామ్సంగ్ గెలాక్సీ S23 అల్ట్రా స్మార్ట్ ఫోన్ కంపెనీ అధికారిక వెబ్సైట్ నుంచి రూ. 1,09,999 ధరలో సేల్ అవుతోంది. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్ నుంచి ఈరోజు రూ. 37,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో రూ. 72,999 ధరకే సేల్ అవుతోంది. ఈ స్మార్ట్ ఫోన్ పై సెలెక్టెడ్ క్రెడిట్ కార్డ్స్ పై రూ. 5,951 రూపాయల వడ్డీ సేవింగ్ అందించే No Cost EMI ఆఫర్ ని కూడా అందించింది. Buy From Here
శామ్సంగ్ గెలాక్సీ S23 అల్ట్రా స్మార్ట్ ఫోన్ Snapdragon 8 Gen 2 చిప్ సెట్ తో పని చేస్తుంది. ఈ ఫోన్ లో 12GB ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Galaxy AI సపోర్ట్ ను కలిగి స్మార్ట్ గా ఉంటుంది మరియు సామ్రాట్ గా పనులు చేస్తుంది. ఈ ఫోన్ ఆర్మోర్ అల్యూమినియం ఫ్రేమ్ మరియు గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ సూపర్ బ్రైట్నెస్ కలిగిన AMOLED స్క్రీన్ మరియు S-Pen సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ లో 200MP మెయిన్, 12MP అల్ట్రా వైడ్, 10MP + 10MP టెలిఫోటో కెమెరాలు కలిగిన క్వాడ్ రియర్ కెమెరా సెటప్ మరియు ముందు 10MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ కెమెరా 8K UHD వీడియో రికార్డింగ్ సపోర్ట్ మరియు సూపర్ ఫోటోలు అందించే సెటప్ ను కలిగి వుంది. ఈ ఫోన్ లో అల్ట్రా ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బ్యాటరీ కూడా ఉంటుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile