ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి SAMSUNG Galaxy S21 FE 5G పైన భారీ డిస్కౌంట్.!

HIGHLIGHTS

SAMSUNG Galaxy S21 FE 5G పైన భారీ డిస్కౌంట్

శామ్సంగ్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్ ను మీ బడ్జెట్ ధరలోనే అందుకే అవకాశం

ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి SAMSUNG Galaxy S21 FE 5G పైన భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ప్రో గ్రేడ్ కెమేరా మరియు AMOLED 2X డిస్ప్లే వంటి ప్రీమియం ఫీచర్లు కలిగిం ఈ ప్రీమియం స్మార్ట్ ఫోన్ ఇప్పుడు రూ. 18,000 భారీ డిస్కౌంట్ తో ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ 2023 సేల్ నుండి లభిస్తోంది ప్రీమియం స్మార్ట్ ఫోన్ ను అదీకూడా శామ్సంగ్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్ ను మీ బడ్జెట్ ధరలోనే అందుకే అవకాశం ఈ సేల్ ద్వారా ఫ్లిప్ కార్ట్ అందించింది. ఈ ఫోన్ ఆఫర్లు, ధర మరియు స్పెక్స్ తెలుసుకోండి. 

SAMSUNG Galaxy S21 FE 5G: ఆఫర్లు

ఈ స్మార్ట్ ఫోన్ రూ. 49,999 ధరతో ఇండియన్ మార్కెట్ లో విడుదలైంది. ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ 2023 సేల్ నుండి ఈరోజు రూ.18,000 భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 31,999 ధరతో లభిస్తోంది. ఈ Galaxy S21 FE 5G ఫోన్ ను SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మరియు EMI అప్షన్ తో కొనుగోలు చేస్తే 10% అదనపు డిస్కౌంట్ కూడా పొందవచ్చు.                  

Galaxy S21 FE 5G స్మార్ట్ ఫోన్ శామ్సంగ్ యొక్క సొంత ఫాస్ట్ 5G ప్రోసెసర్ Exynos 2100 తో వస్తుంది. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.4 ఇంచ్ FHD+ Dynamic AMOLED 2X డిస్ప్లేని కలిగి వుంది. ఈ ఫోన్ 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ ఫోన్ లో 12MP (డ్యూయల్ పిక్సెల్ AF & OIS) ప్రధాన కెమేరా + 12MP అల్ట్రా వైడ్ + 8MP (OIS) టెలిఫోటో (30X స్పేస్ జూమ్) ట్రిపుల్ కెమేరా సెటప్ ను కలిగి వుంది. 32MP సెల్ఫీ కెమేరా కూడా ఈ ఫోన్ లో వుంది. 

ఈ ఫోన్ కెమేరాతో Pro Grade ఫోటోలు మరియు వీడియోలను చిత్రీకరించవచ్చు. ఈ ఫోన్ లో 4500 mAh బ్యాటరీని ఫాస్ట్ మరియు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగి వుంది. ఈ వాటర్ రెసిస్టెంట్ మరియు గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటక్షన్ తో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :