శామ్సంగ్ గెలాక్సీ S10 E vs గెలాక్సీ S10 vs గెలాక్సీ S10+ : మధ్య వ్యత్యాసం ఎమిటో తెలుసా?

Updated on 21-Feb-2019
HIGHLIGHTS

శామ్సంగ్ దాని గెలాక్సీ S శ్రేణి లైనప్ కింద మూడు కొత్త ప్రధాన స్మార్ట్ ఫోన్లను ప్రవేశపెట్టింది.

నిన్న, శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన ఒక కార్యక్రమంలో శామ్సంగ్ అనేక అనేక స్మార్ట్ ఫోన్లను ప్రారంభించింది. అయితే, టాక్ ఆఫ్ ది టౌన్ మాత్రం ఏప్రిల్ 26, 2019 న ప్రారంభించాలని ఆలోచిస్తున్న, గెలాక్సీ ఫ్యూచరిస్టిక్ మడవగల స్మార్ట్ ఫోన్. ఆ విషయం అటుంచితే, శామ్సంగ్ దాని ప్రజాదరణ గెలాక్సీ S శ్రేణి లైనప్ కింద మూడు కొత్త ప్రధాన స్మార్ట్ ఫోన్లను ప్రవేశపెట్టింది అవి – గెలాక్సీ S10, గెలాక్సీ S10e, మరియు గాలక్సీ S10 +. శామ్సంగ్ గెలాక్సీ S10 + చాలా ప్రీమియం వేరియంట్. ఇక, గెలాక్సీ S10 మరియు S10 + రెండూ కూడా గెలాక్సీ S9 యొక్క అప్డేటూగా చెప్పొచ్చు.అయితే,  ఈ గెలాక్సీ S10 త్రయంలో గెలాక్సీ S10e ఒక బడ్జెట్ ఫోన్ అవుంతుంది. కాబట్టి, ఈ ఫోన్లను కొనుగోలు చేసే విషయం గురించి మీరు ఆలోచిస్తున్నట్లయితే, ఈ మూడు స్మార్ట్ ఫోన్లలో మీకు ఏది సరైనదిగా ఉంటుంది? అని తెలుసుకోవడానికి, వీటిని సరిపోల్చి చూద్దాం.  

డిస్ప్లే & డిజైన్

గెలాక్సీ S10, S10e, మరియు S10 ప్లస్, ఈ మూడు డివైజెస్ ను శామ్సంగ్ తాజా ఇన్ఫినిటీ- O డిస్ప్లేతో తీసుకువచ్చింది . గెలాక్సీ S10e, S10 మరియు S10 + మధ్య ప్రధాన వ్యత్యాసంగా వాటి డిస్ప్లే పరిమాణం. గాలక్సీ S10e ఒక 5.8-అంగుళాల డిస్ప్లేని కలిగి ఉంది, అయితే గెలాక్సీ S10 కొద్దిగా పెద్దదైన ఒక 6.1-అంగుళాల స్క్రీన్ కలిగి ఉంది. ఇక పేరు సూచిస్తున్నట్లుగా, S10 + ఒక పెద్ద 6.4-అంగుళాల క్వాడ్ HD ప్యానెల్ను కలిగి ఉంది. వీటిలో, ఒక నోచ్ కు బదులుగా, ఈ మూడు పరికరాలలో సెల్ఫీ కెమెరా కోసం ముందు డిస్ప్లేలో పంచ్ హోల్ ఉంటుంది. గాలక్సీ S10e మరియు S10 తో పోలిస్తే గెలాక్సీ S10 + కొద్దిగా పెద్దదైన రంధ్రంతో లభిస్తుంది, ఎందుకంటే ఇది ముందుభాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. అంతేకాక, మరో ప్రధాన వ్యత్యాసం కూడా ఉంది, అదేమిటంటే  గెలాక్సీ S10 మరియు S10 + లు కర్వ్డ్ డిస్ప్లేతో వస్తాయి, కానీ  S10e  ఫ్లాట్ ప్యానెల్ తో వస్తుంది.

గెలాక్సీ S10 మరియు S10 + రెండు కూడా ఒక కొత్త అల్ట్రాసోనిక్ వేలిముద్ర సెన్సార్ను కలిగి ఉంటాయి, ఇది డిస్ప్లేలో పొందుపరచబడింది. అయితే, ఈ టెక్నాలజీ  గెలాక్సీ S10e లో మాతరం అందించలేదు.

ప్రాసెసర్, RAM మరియు స్టోరేజ్

ఇక వీటి పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినప్పుడు, గెలాక్సీ S10e మరియు గెలాక్సీ S10 ఒక Exynos ద్వారా ఆధారితమైన 9820 ఆక్టా కోర్ ప్రాసెసర్ తో నడుస్తాయి. గెలాక్సీ S10e – 6GB / 128GB మరియు 8GB / 256GB స్టోరేజి వంటి రెండు వేరియంట్ మోడల్లలో లభిస్తుంది. మరోవైపు, సంస్థ గెలాక్సీ S10 ను 8GB / 256GB వేరియంట్ మాత్రమే విడుదల చేసింది. ఇందులో ఒక మైక్రో SD కార్డ్ ద్వారా 512GB వరకు స్టోరేజి విస్తరించవచ్చు. ఇక గెలాక్సీ S10 + యొక్క గురించి చూస్తే, ఇది ప్రీమియం డివైజ్ అయినాకూడా, ఇది అదే ఎక్సినోస్ 9820 ఆక్టా-కోర్ ప్రాసెసర్ ద్వారా మద్దతు ఇస్తుంది, ఇది 128GB, 512GB మరియు 1TB స్టోరేజి మోడల్లలో అందుబాటులో ఉంటుంది. ఒక మైక్రో SD కార్డ్ ద్వారా 512GB వరకు స్టోరేజిని పెంచుకోవచ్చు.

కెమేరాలు

గెలాక్సీ S10e వెనుక భాగంలో 16MP + 12MP  డ్యూయల్ కెమెరాలు ఉన్నాయి, ఇది 16MP సెన్సార్ అల్ట్రా-వైడ్ ఫోటోలను క్లిక్ చేయడానికి ఉపయోగించవచ్చు. అలాగే, స్వయంచాలకంగా 30 వేర్వేరు సన్నివేశాలను ఆటోమేటిగ్గా కనుగొనగల మెరుగైన శామ్సంగ్ ఆప్టిమైజ్ ఫీచర్ ఉంది. మరొక వైపు, శామ్సంగ్ గెలాక్సీ S10 మరియు S10 + ఒక ట్రిపుల్ 16MP + 12MP + 12MP వెనుక కెమెరాలని కలిగి ఉంటాయి. గెలాక్సీ S10e లో లేనటువంటి12MP కెమేరా 2x ఆప్టికల్ జూమ్ ని అనుమతిస్తుంది.

ముందు, గెలాక్సీ S10 మరియు S10e సెల్ఫీ క్లిక్ కోసం ఒక 10MP సెన్సార్ కలిగివున్నాయి. ఇక గెలాక్సీ S10 + ముందుభాగంలో డ్యూయల్ 10MP + 8MP ఫ్రంట్ కెమెరాలు ఉంటాయి. ముందు అందించిన 8MP డెప్త్ సెన్సార్ మీరు బెక్హె ఎఫెక్టుతో సెల్ఫ్లను క్లిక్ చేయడానికి అనుమతిస్తుంది.

ధర

శామ్సంగ్ గెలాక్సీ S10e  749 డాలర్ల వద్ద ప్రారంభించబడింది, ఇది మనకు దాదాపుగా రూ. 53,296 (aprox) కి సమానంగా ఉంటుంది  అనువదిస్తుంది. మరోవైపు, గెలాక్సీ S10 8GB / 128GB వేరియంట్ ధర 899 డాలర్లు. ఇది ఇండియా కరెన్సీలో ఇంచుమించు రూ. 63,970 (aprox)గా ఉంటుంది. ఇక ఈ మూడు స్మార్ట్ ఫోన్లలో ప్రీమియం ఫోన్ అయిన, గెలాక్సీ S10 +  999 డాలర్లతో  ప్రారంభవవుతుంది ఇది రూ. 71,086 (aprox) గా ఉంటుంది.

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :