apple today launches Home View and Home Pod Mini 2 for home entertainment
యాపిల్ ఈరోజు Home View మరియు Home Pod Mini 2 రెండు కొత్త కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ చేసింది. ఈ ప్రొడక్ట్స్ ని ఎలాంటి అట్టహాసం లేకుండా చాలా సైలెంట్ గా ప్రపంచ మార్కెట్ కి పరిచయం చేసింది. వీటిలో హోమ్ వ్యూ అనేది పెద్ద స్క్రీన్ మరియు స్పీకర్ సెటప్ తో వస్తుంది. అయితే, హోమ్ ప్యాడ్ మినీ 2 స్మార్ట్ స్పీకర్ గా వచ్చింది. ఈ రెండు ప్రొడక్ట్స్ ని కూడా హోమ్ ఎంటర్టైన్మెంట్ కోసం ప్రత్యేకంగా అందించినట్లు యాపిల్ తెలిపింది.
ముందుగా యాపిల్ లాంచ్ చేసిన హోమ్ వ్యూ ప్రోడక్ట్ విషయానికి వస్తే, ఇది కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ సెటప్ తో వస్తుంది. ఈ డివైజ్ ఇండియా ప్రైస్ ని రూ. 39,900 రూపాయలుగా నిర్ణయించింది. యాపిల్ ఈరోజు నుంచే ఈ డివైజ్ ప్రీ ఆర్డర్స్ కూడా స్టార్ట్ చేసింది. అయితే, ఈ డివైజ్ నవంబర్ 13 నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఇది స్పీకర్ మరియు వాల్ మౌంట్ రెండు మోడల్స్ లో లభిస్తుంది.
ఇక ఫీచర్స్ విషయానికి వస్తే, ఇది 7 ఇంచ్ లిక్విడ్ రెటీనా డిస్ప్లేతో వస్తుంది. ఈ డిస్ప్లే 500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 1088×1088 రిజల్యూషన్ మరియు ట్రూ టోన్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇది యాపిల్ యొక్క లేటెస్ట్ A18 chip తో పని చేస్తుంది. ఇందులో వీడియో కాలింగ్ మరియు సెల్ఫీల కోసం 12MP కెమెరా ఉంది. ఇందులో రెండు స్పీకర్లు మరియు ఉఫర్ తో వస్తుంది. ఇందులో Dolby Atmos సౌండ్ సపోర్ట్ కూడా ఉంది. ఇది లేటెస్ట్ Siri AI సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.
Also Read: boAt 7.1.4 Dolby Atmos సౌండ్ బార్ పై పండుగ సేల్ బిగ్ డీల్ .. ఏకంగా 18 వేల తగ్గింపు.!
ఇది యాపిల్ అందించిన హోమ్ పాడ్ క్కి మినీ వెర్షన్ అని చెప్పవచ్చు. అంటే, ఇది యాపిల్ అందించిన స్మార్ట్ స్పీకర్ మరియు గొప్ప ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది. యాపిల్ ఈ స్మార్ట్ స్పీకర్ ని రూ. 18,900 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ చేసింది. ఈ స్పీకర్ ప్రీ ఆర్డర్స్ కూడా ఈరోజు స్టార్ట్ చేసింది. అయితే, ఇది అక్టోబర్ 30వ తేదీ నుంచి సేల్ అవుతుంది.
ఇది యాపిల్ అందించిన బడ్జెట్ స్మార్ట్ స్పీకర్ మరియు మంచి ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది. ఇది 3.3 ఇంచ్ ఎట్టు మరియు 3.9 ఇంచ్ వెడల్పుతో గుండ్రంగా ఉంటుంది. ఇందులో ఫుల్ రేంజ్ స్పీకర్ మరియు డ్యూయల్ పాసివ్ రేడియేటర్లు అందించింది. ఈ సెటప్ తో పాటు 360º సౌండ్ కోసం కస్టమ్ అకౌస్టిక్ వేవ్ గైడ్ ఫీచర్ ని కూడా అందించింది. అంతేకాదు, Siri మరియు వాయిస్ కమాండ్ తో పాటు కాలింగ్ కోసం 3 మైక్ సెటప్ కలిగి ఉంటుంది. ఇది స్టీరియో పెయిర్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది. ఇది యాపిల్ మ్యూజిక్, iTunes మ్యూజిక్ మరియు తర్డ్ పార్టీ మ్యూజిక్ సర్ర్వీసెస్ తో కూడా పని చేస్తుంది. ఇందులో టెంపరేచర్ మరియు హ్యుమిడిటీ సెన్సార్ లు కూడా ఉన్నాయి.