ఐ ప్యాడ్ ప్రో ని లక్ష్యంగా చేసికొని క్రొత్త శామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్4 ని తెస్తుంది deX ఇంటిగ్రేషన్ తో

ఐ ప్యాడ్ ప్రో ని లక్ష్యంగా చేసికొని క్రొత్త శామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్4 ని తెస్తుంది deX ఇంటిగ్రేషన్ తో
HIGHLIGHTS

కొత్త శామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్4 ఆగస్టు 10 నుండి యూ ఎస్ లో అమ్మకానికి సిద్దమవుతుంది ఇది స్నాప్ డ్రాగన్ 835 ద్వారా ఆధారితంగా ఉంటుంది.

ఒకవేళ మీరు ఆండ్రాయిడ్ ట్యాబ్లేట్ ప్రియులైతే మీకు ఒక శుభవార్త !. శామ్సంగ్ తన గెలాక్సీ ట్యాబ్ ఎస్4 యొక్క  విడుదలని ప్రకటించింది . ఈ ట్యాబ్లేట్ ఆగష్టు 10న యూ ఎస్ లో అమ్మకానికి ఉండనుంది . కానీ, ఇండియాలో ఈ ట్యాబ్ ఎప్పటికి అందుబాటులోకి రానున్నదన్న సమాచారం ఇంకా తెలియరాలేదు. అయితే , ఇందులో వై – ఫై కేవలం రెండు వేరియంట్లలో మాత్రమే అందనుంది అవి :64జీబీ మరియు 256జీబీ వరుసగా $649.99 మరియు $749.99 గా ఉన్నాయి.ఒక సెల్యులార్ వెర్షన్ కూడా యూ ఎస్ లో అందుబాటులో ఉంటుంది. 

అలాగే దీని స్పెసిఫికేషన్ విషయానికివస్తే శామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్4, 16 :10తో కూడిన 2560 X 1600 పిక్సెల్స్ కలిగిన ఒక 10.5-ఇంచ్ సూపర్ అమోల్డ్ డిస్ప్లేని కలిగివుంది. దీనిలో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 835 SoC తొ అనుసంధానించి 4జీబీ ర్యామ్ అంతర్గతంగా వున్నాయి. పైన తెలిపిన విధంగా ఇది రెండు స్టోరేజి ఎంపికలతో ఎంచుకునే వీలుంది అవి -64జీబీ మరియు 256జీబీ ఇంకా మెమొరీ సహాయంతో 400జీబీ వరకు విస్తరించుకునే వీలుంటుంది. ఈ ట్యాబ్లట్ ఆండ్రాయిడ్ ఒరెయో 8.1 తో  వస్తుంది మరియు  ఒక 7,300mAh  బ్యాటరీతో ప్యాకేజీ గా వస్తుంది. ఇంకా ఇది శామ్సంగ్ నోట్ సిరీస్ లో గుర్తిపు ఛిహ్నంగా ఉన్న ఎస్-పెన్ యాక్సెసరీ కలిగివుంది. నోట్ సిరీస్ గురించి మాట్లాడుతూ, ఆగష్టు 9న న్యూయార్క్ లో జరగనున్న ఒక కార్యక్రమంలో నోట్ 9 గురించి ప్రకటించనుంది అని తెలిపారు.

ఈ ట్యాబ్ ఎస్4 కోసం శామ్సంగ్ అధికారకంగా ఓకే కీబోర్డు ని కూడా అమ్మనుంది. ఈ   కీ బోర్డు డాక్ కి ట్యాబ్ ని అనుసంధానం చేయగానే ఆటోమేటిక్ గా శామ్సంగ్ deX మొదలవుతుంది. ఈ deX మోడ్ లో వినియోగదారులు ట్యాబ్ మరియు కీ బోర్డు ఒకే సరి ఉపయోగించుకునే వీలుంది మరియుకంటెంట్ ను ఒక విండో నుండి మరొక విండో కి లాగాడనికి కూడా వీలుంటుంది.ఇదే విధంగా శామ్సంగ్ నోట్ 9 ని కూడా ఒక సపరేట్ మానిటర్ గా వాడుకునే వీలుంటుంది . ఐప్యాడ్ లాంటివి ఇలాంటి మల్టీ టాస్కింగ్ కి సహకరించడం చాల కష్టం, ఒకవేళ  శామ్సంగ్ deX ట్యాబ్ ఎస్4 తో మంచి పనితీరును చూపిస్తే మాత్రం ఇది ఐప్యాడ్లలో అన్నిటికంటే పై చేయిగా ఉండడమే కాక అమ్మకాల ఉత్పాదనను పెంచుతుంది. అయితే,మేము మాత్రం డివైజ్ రివ్యూ కి వచ్చిన తరువాత మాత్రమే ధ్రువీకరించడం జరుగుతుంది.  

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo