Samsung Galaxy M55 5G ఈ Top – 5 ఫీచర్స్ తో ఇండియాలో లాంఛ్ అవుతోంది.!

Samsung Galaxy M55 5G ఈ Top – 5 ఫీచర్స్ తో ఇండియాలో లాంఛ్ అవుతోంది.!
HIGHLIGHTS

Samsung Galaxy M55 5G ఏప్రిల్ 8న ఇండియాలో లాంఛ్ అవుతోంది

సాంసంగ్ ఈ ఫోన్ యొక్క టాప్ ఫీచర్స్ తో టీజింగ్ మొదలు పెట్టింది

6.7 ఇంచ్ Super AMOLED స్క్రీన్ తో సాంసంగ్ గెలాక్సీ M55 5జి వస్తుంది

సాంసంగ్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ Samsung Galaxy M55 5G ఏప్రిల్ 8న ఇండియాలో లాంఛ్ అవుతోంది. సాంసంగ్ ఈ ఫోన్ యొక్క టాప్ ఫీచర్స్ తో టీజింగ్ మొదలు పెట్టింది. అయితే, వాస్తవానికి ఈ ఫోన్ బ్రెజిల్ మార్కెట్ లో ఇటీవలే విడుదల అయ్యింది. ఇప్పుడు ఇండియాలో విడుదల కావడానికి సిద్దమవుతోంది. ఈ అప్ కమింగ్ ఫోన్ ఎటువంటి ఫీచర్లను కలిగి ఉన్నదో ఒక లుక్కేద్దాం పదండి.

Samsung Galaxy M55 5G టాప్ 5 ఫీచర్లు

Display

6.7 ఇంచ్ Super AMOLED స్క్రీన్ తో సాంసంగ్ గెలాక్సీ M55 5జి వస్తుంది. ఈ డిస్ప్లే FHD+ రిజల్యూషన్ మరియు విజన్ బూస్టర్ ఫీచర్ ను కలిగి ఉంటుంది. అలాగే, ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ తో కూడా ఉంటుంది.

Processor & OS

Samsung Galaxy M55 5G Processor
Samsung Galaxy M55 5G Processor

సాంసంగ్ ఈ స్మార్ట్ ఫోన్ ను Snapdragon 7 Gen 1 ఆక్టా కోర్ 5జి ప్రోసెసర్ తో తీసుకు వస్తున్నట్లు తెలిపింది. అంతేకాదు, ఈ ఫోన్ లో లేటెస్ట్ UI 6.1 సాఫ్ట్ వేర్ తో కూడిన Android 14 OS ఉంటుంది.

Design

ఈ ఫోన్ డిజైన్ పరంగా కూడా ఆకట్టుకుంటుంది. ఎందుకంటే, ఈ ఫోన్ ను చూడగానే ప్రియం లుక్స్ తో కనిపిస్తుంది మరియు వెనుక రెండు అందమైన కలర్ ఆప్షన్ లలో కూడా వస్తుంది.

Also Read: Gold Rate Down: పసిడి ప్రియులకు ఊరట.. ఈరోజు తగ్గిన గోల్డ్ రేట్.!

Camera

సాంసంగ్ అప్ కమింగ్ ఫోన్ లో మంచి కెమేరా సెటప్ వుంది. ఈ ఫోన్ లో వెనుక 50MP + 8MP + 2MP ట్రిపుల్ రియర్ కెమేరా వుంది. అలాగే, ఈ ఫోన్ లో ముందు పవర్ ఫుల్ 50MP సెల్ఫీ కెమేరా కూడా వుంది.

Battery & Charge Tech

సాంసంగ్ గెలాక్సీ M55 5జి ఫోన్ ను 5000 mAh బ్యాటరీతో మరియు వేగవంతమైన 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో తీసుకు వస్తున్నట్లు కూడా కంపెనీ టీజర్ లో తెలిపింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo