Samsung Galaxy M47 5G: పెర్ఫార్మన్స్ మరియు మన్నిక ప్రధానంగా లాంచ్ అవుతోంది.!

HIGHLIGHTS

Samsung Galaxy M47 5G ఇండియా లాంచ్ డేట్ విడుదల చేసింది

పెర్ఫార్మన్స్ మరియు మన్నిక ప్రధానంగా లాంచ్ చేస్తున్నట్లు శాంసంగ్ అధికారికంగా తెలియ చేసింది

ఈ ఫోన్ 6.7 ఇంచ్ బిగ్ సూపర్ AMOLED డిస్ప్లే కలిగి ఉంటుంది

Samsung Galaxy M47 5G: శాంసంగ్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఎం 47 లాంచ్ డేట్ మరియు కీలక సమాచారం ఈరోజు శాంసంగ్ విడుదల చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను పెర్ఫార్మన్స్ మరియు మన్నిక ప్రధానంగా లాంచ్ చేస్తున్నట్లు శాంసంగ్ అధికారికంగా తెలియ చేసింది. అంతేకాదు, ఈ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్స్ కూడా ఈరోజు వెల్లడించింది.

Samsung Galaxy M47 5G: లాంచ్ డేట్

శాంసంగ్ గెలాక్సీ ఎం 47 స్మార్ట్ ఫోన్ జూన్ 29వ తేదీ ఇండియన్ మార్కెట్లో విడుదల చేయబడుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్ స్పెషల్ గా లాంచ్ అవుతుంది. అమెజాన్ ఈ ఫోన్ కోసం ప్రత్యేకమైన సేల్ పార్ట్నర్ గా ఉంటుంది మరియు ఈ ఫోన్ కోసం ప్రత్యేకమైన టీజర్ పేజి అందించింది కూడా టీజింగ్ చేస్తోంది.

Samsung Galaxy M47 5G: ఫీచర్స్

శాంసంగ్ గెలాక్సీ ఎం 47 స్మార్ట్ ఫోన్ ను గొప్ప పెర్ఫార్మన్స్ అందించే క్వాల్కమ్ Snapdragon 6 Gen 3 తో అందిస్తున్నట్లు కంపెనీ అనౌన్స్ చేసింది. అంతేకాదు, ఈ చిప్ సెట్ తో జతగా వేగవంతమైన LPDDR5X ర్యామ్ మరియు USB 3.1ఫాస్ట్ రెస్పాన్స్ స్టోరేజ్ ని కూడా అందించింది. ఇది ఈ ఫోన్ మంచి పర్ఫార్మెన్స్ కోసం నిర్మించబడినట్లు తెలుపుతుంది.

డిజైన్ పరంగా, ఈ ఫోన్ స్లీక్ అండ్ స్టన్నింగ్ డిజైన్ ఉన్నట్లు ఇమేజ్ ద్వారా తెలుస్తోంది. అంతేకాదు, ఈ ఫోన్ మన్నిక ప్రధానంగా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఇందులో 4x స్క్రాచ్ రెసిస్టెంట్ కలిగిన గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ మరియు 2 మీటర్ డ్రాప్ తట్టుకునే శక్తి తో ఈ ఫోన్ లాంచ్ అవుతుందని శాంసంగ్ తెలిపింది. ఈ ఫోన్ లేటెస్ట్ OS తో లాంచ్ అవుతుంది మరియు 6 సంవత్సరాల OS అండ్ రెగ్యులర్ సెక్యూరిటీ అప్డేట్స్ కూడా అందుకుంటుంది.

ఈ ఫోన్ డిస్ప్లే విషయానికి వస్తే, ఈ ఫోన్ 6.7 ఇంచ్ బిగ్ సూపర్ AMOLED డిస్ప్లే కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు మంచి బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ స్లీక్ డిజైన్ లో ఉన్నా కూడా ఇందులో 6000 mAh బిగ్ బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్ వేగంగా ఛార్జ్ చేసే 45W ఫాస్ట్ ఛార్జ్ మరియు బైపాస్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.

Also Read: OnePlus Nord Buds 4 : టాప్ 5 ఫీచర్స్ మరియు ప్రత్యేకతలు తెలుసుకోండి.!

ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఈ సెటప్ లో 50MP OIS మెయిన్ కెమెరా, 5MP అల్ట్రా వైడ్ మరియు 2MP మాక్రో కెమెరాలు ఉంటాయి. అలాగే, ఈ ఫోన్ లో 12MP HDR సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ AI ఫిల్టర్లు, ఎరేజర్ వంటి చాలా Ai కెమెరా ఫీచర్స్ ఉంటాయి. అంతేకాదు, ఈ ఫోన్ 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ రోగ్ రెడ్ మరియు బ్లేజ్ బ్లూ రెండు రంగుల్లో లాంచ్ చేస్తుంది.

మొత్తానికి, ఈ ఫోన్ ను పర్ఫార్మెన్స్ ప్రధానంగా ఆల్ రౌండ్ ఫీచర్స్ తో లాంచ్ చేయబోతున్నట్లు చూడవచ్చు.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :