OnePlus Nord Buds 4 : టాప్ 5 ఫీచర్స్ మరియు ప్రత్యేకతలు తెలుసుకోండి.!

HIGHLIGHTS

వన్ ప్లస్ అప్ కమింగ్ ఇయర్ బడ్స్ లాంచ్ డేట్ తో పాటు కీలక ఫీచర్లు కూడా విడుదల చేసింది

టాప్ 5 ఫీచర్స్ మరియు ప్రత్యేకతలు లాంచ్ కంటే ముందే తెలుసుకోండి

54 గంటల ప్లే బ్యాక్ అందించే లాంగ్ బ్యాటరీ కలిగి ఉంటుంది

OnePlus Nord Buds 4 : టాప్ 5 ఫీచర్స్ మరియు ప్రత్యేకతలు తెలుసుకోండి.!

OnePlus Nord Buds 4 : వన్ ప్లస్ అప్ కమింగ్ ఇయర్ బడ్స్ లాంచ్ డేట్ తో పాటు కీలక ఫీచర్లు కూడా వన్ ప్లస్ విడుదల చేసింది. ఈ అప్ కమింగ్ ఇయర్ బడ్స్ ఆకట్టుకునే కొత్త డిజైన్, పెద్ద స్పీకర్ మరియు పరిసర శబ్దాలను నిలువరించే ANC వంటి ఫీచర్స్ తో లాంచ్ చేస్తోంది. ఈ అప్ కమింగ్ వన్ ప్లస్ ఇయర్ బడ్స్ టాప్ 5 ఫీచర్స్ మరియు ప్రత్యేకతలు లాంచ్ కంటే ముందే తెలుసుకోండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

OnePlus Nord Buds 4 : టాప్ 5 ఫీచర్స్

డిజైన్ అండ్ బ్యాటరీ

ఈ వన్ ప్లస్ అప్ కమింగ్ ఇయర్ బడ్స్ ను జేబులో ఈజీగా క్యారీ చేసే ఓవెల్ అండ్ సర్కిల్ మిడ్ డిజైన్ తో అందించింది. ఈ ఇయర్ బడ్స్ కాంపాక్ట్ డిజైన్ లో ఉంటుంది మరియు ఈ సైజులో కూడా 54 గంటల ప్లే బ్యాక్ అందించే లాంగ్ బ్యాటరీ కలిగి ఉంటుంది.

12mm టైటానియం కోటెడ్ స్పీకర్

ఈ వన్ ప్లస్ ఇయర్ బడ్స్ 12mm టైటానియం కోటెడ్ స్పీకర్ ఉంటుంది. ఈ సెటప్ కలిగిన స్పీకర్ లు డీప్ బాస్, క్లియర్ వోకల్స్ మరియు మెరుగైన ఆడియో అనుభవాన్ని అందించే విధంగా ఉంటాయి. ఇవి గొప్ప సౌండ్ అందించే అవకాశం ఉంటుంది.

52dB యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్ (ANC)

ఈ అప్ కమింగ్ ఇయర్ బడ్స్ 52dB వరకు రియల్ టైమ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ 5000Hz వరకు నాయిస్ క్యాన్సిలేషన్ రేంజ్‌తో చెవి వెలుపలి శబ్దాలను నిరోధించి క్లీన్ సౌండ్ అందిస్తుంది.

కాలింగ్

ఈ వన్ ప్లస్ అప్ కమింగ్ ఇయర్ బడ్స్ కాలింగ్ కోసం గొప్ప సెటప్ కలిగి ఉంది. ఈ ఇయర్ బడ్స్ 6 Mic సెటప్ మరియు నోయిస్ రిడక్షన్ ఫీచర్ తో వస్తుంది. అంటే, ఇందులో మొత్తం 6 మైక్రోఫోన్లు ఉన్నాయి మరియు ఇది ఏఐ ఆధారిత కాల్ నాయిస్ రిడక్షన్ టెక్నాలజీ తో గాలి లేదా చుట్టూ ఉండే రణగొణ ధ్వని తగ్గించి స్పష్టమైన కాల్ సౌకర్యం అందిస్తుంది.

OnePlus Nord Buds 4 top 5 features

సౌండ్ టెక్

ఈ ఇయర్ బడ్స్ లో 3D Spatial Audio సపోర్ట్‌ ఉన్నట్లు వన్ ప్లస్ తెలిపింది. అంటే, ఇందులో మీకు మంచి ఆడియో అనుభూతి లభించే అవకాశం ఉంటుంది. అంతేకాదు, ఈ బడ్స్ గేమింగ్ కోసం లో లేటెన్సీ మోడ్ కూడా కలిగి ఉంటుంది.

మొత్తంగా చూస్తే, ఈ అప్ కమింగ్ వన్ ప్లస్ ఇయర్ బడ్స్ నార్డ్ బడ్స్ 4 డీప్ బాస్ అండ్ క్లియర్ సౌండ్ స్పీకర్, లాంగ్ బ్యాటరీ లైఫ్, AI క్లారిటీ కాల్ ఫీచర్ మరియు గొప్ప ANC వంటి ఫీచర్లతో మార్కెట్లోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. ఈ బడ్స్ ప్రైస్ ను బట్టి ఇది ఎంత పెద్ద పోటీదారుడు అవుతుందో తెలుస్తుంది.

Also Read: ఇంటిగ్రేటెడ్ Dolby సౌండ్ బార్ Smart Tv పై భారీ ఆఫర్లు ప్రకటించిన అమెజాన్.!

వన్ ప్లస్ జూన్ 25వ తేదీన ఈ ఇయర్ బడ్స్ ను మార్కెట్ లో విడుదల చేస్తుంది. ఈ బడ్స్ ప్రైస్ అండ్ కంప్లీట్ ఫీచర్స్ లాంచ్ డేట్ రోజు మళ్ళీ కలుద్దాం.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile