రెడ్మి నోట్ 7 కంటే ఒకరోజు ముందే విడుదల కానున్న, శామ్సంగ్ గెలాక్సీ M30

రెడ్మి నోట్ 7 కంటే ఒకరోజు ముందే విడుదల కానున్న, శామ్సంగ్ గెలాక్సీ M30
HIGHLIGHTS

శామ్సంగ్ ఇండియా ట్విట్టర్ పేజీలో ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ఒక వీడియోను పోస్ట్ చేశారు.

శామ్సంగ్, ఫిబ్రవరి 27 న 6pm వద్ద భారతదేశంలోదాని M- సిరీస్ లైనప్ నుండి మరొక స్మార్ట్ ఫోన్ అయినటువంటి, గెలాక్సీ M30 స్మార్ట్ ఫోన్ను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఇతర M- సిరీస్ ఫోన్ల మాదిరిగా, ఈ గెలాక్సీ M30 కూడా అమెజాన్ ఇండియాలో అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ను # IM3XPOWERED అనేటటువంటి హాష్ ట్యాగ్ తో శామ్సంగ్ ఇండియా ట్విట్టర్ పేజీలో సూచించింది.  ఈ 3X  అనేది వెనుక ఒక ట్రిపుల్ కెమెరా సెటప్పుగా ప్రస్తావించారు. ఈ టీజర్, ఇన్ఫినిటీ- V డిస్ప్లే కలిగిన M10 మరియు M20 మాదిరిగా కాకుండా, ఇన్ఫినిటీ- U డిస్ప్లేతో ఈ ఫోన్ ఉంనున్నట్లు కూడా చూపిస్తుంది.

ఈ టీజర్, ఒక ఎడ్జ్ టూ ఎడ్జ్ డిస్ప్లేను కూడా  చూపిస్తుంది, మరియు ప్రస్తుత పుకార్ల ప్రకారం, ఇది ఒక 2220X1080 పిక్సెల్ రిజల్యూషన్ తో ఒక 6.38 అంగుళాల సూపర్ AMOLED ప్యానెల కావచ్చు అని తెలుస్తోంది. ఈ  ట్రిపుల్ కెమెరా వ్యవస్థ, వెనుక ప్యానెల్లో నిలువుగా ఉంచుతారు, అలాగే వేలిముద్ర సెన్సార్ కూడా   ఉంది. ఆప్టిక్స్ పరంగా, M30 ఒక ట్రిపుల్ కెమెరా సెటప్ కలిగి ఉండవచ్చు. ఇది 13MP (F1.9) + 5MP (F2.2) +5MP (F2.2) సెన్సార్లను వెనుకవైపున కలిగినట్లు తేలుస్తోంది. ముందు, ఇది f / 2.0 ఎపర్చరుతో ఒక 16MP సెన్సార్ను కలిగి ఉంటుంది.

గెలాక్సీ M30,,శామ్సంగ్ ఎక్సినోస్ 7904 ప్రాసెసర్ ద్వారా శక్తినిచ్చే అవకాశం ఉంది. 64GB అంతర్గత స్టోరేజితో పాటుగా 4GB RAM ఫీచర్ చేసేలా ఈ స్మార్ట్ ఫోన్  గురించి అంచనావేస్తున్నారు. అలాగే, ఈ ఫోన్ యొక్క మరొక 6GB RAM మరియు 128GB స్టోరేజి వేరియంట్ కూడా ఉండవచ్చు. ఈ ఫోన్ ఒక పెద్ద 5000 mAh బ్యాటరీతో రాబోయే అవకాశం ఉంది. ఈ శామ్సంగ్ గెలాక్సీ M30, ఇటీవల సంయుక్త ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (FCC) వెబ్సైట్లో కనిపించింది. శామ్సంగ్ గెలాక్సీ M30 భారతదేశంలో రూ .15,000 నుంచి ప్రారంభమయ్యే అవకాశముంది.

M- సిరీసుతో, భారతీయ మార్కెట్లో కోల్పోయిన తన స్థానాన్ని తిరిగి పొందడాన్ని శామ్సంగ్ లక్ష్యంగా పెట్టుకుంది. షావోమి సంస్థ దాని రెడ్మి నోట్ 7 స్మార్ట్  ఫోన్ను భారతదేశంలో ఫిబ్రవరి 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అయితే, ఇప్పుడు ఈ దక్షిణ కొరియా దిగ్గజం ఈ ఫోన్విడుదల కంటే ఒక రోజు ముందుగా తన గెలాక్సీ M30 ఫోన్ను విడుదల చేయనున్నట్లు ప్రకటించి అందరిని ఆశ్చర్యపరచింది. షావోమి యొక్క ఫోన్ లాంచ్ కంటే ఒక రోజు ముందు గెలాక్సీ M30 ప్రారంభించటానికి చైనీస్ టెక్ సంస్థకి,  శామ్సంగ్ ఇచ్చిన ధీటైన సమాధానంగా చూడవచ్చు. ఈ రెండు  ఫోన్లు ఒకే ధర బ్రాకెట్లో వస్తాయని భావిస్తున్నారు, మరియు ఒక పెద్ద మార్కెట్ వాటా కోసం ప్రస్తుతం మార్కెట్లో వున్నాఇతర బ్రాండ్లతో గట్టి పోటీ ఇవ్వనున్నాయని అనుకోవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo