48MP+8MP+5MP ట్రిపుల్ కెమేరా గల శామ్సంగ్ గెలాక్సీ M21 సేల్
6000mAh భారీ బ్యాటరీ వంటి ప్రత్యేకతలతో అత్యంత సరసమైన ధరలో లభిస్తుంది.
శామ్సంగ్, M సిరిస్ నుండి మరొక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ను వెనుక ట్రిపుల్ రియర్ కెమేరా సెటప్పుతో మరియు పెద్ద బ్యాటరీతో ఇటీవల ఇండియాలో విడుదల చేసింది. శామ్సంగ్ యొక్క ఈ గెలాక్సీ M21 స్మార్ట్ ఫోన్, ట్రిపుల్ రియర్ కెమేరాతో పాటుగా సూపర్ అమోలెడ్ డిస్ప్లే మరియు 6000mAh భారీ బ్యాటరీ వంటి ప్రత్యేకతలతో అత్యంత సరసమైన ధరలో లభిస్తుంది. ఈ గెలాక్సీ M21 స్మార్ట్ ఫోన్, అమేజాన్ ఇండియా మరియు శామ్సంగ్ అధికారిక వెబ్సైట్ ద్వారా గ్రీన్ మరియు ఆరంజ్ జోన్లలో వారు కొనడానికి అందుబాటులోకి వచ్చింది.
Surveyశామ్సంగ్ గెలాక్సీ M21 ధర
శామ్సంగ్ గెలాక్సీ M21 – 4GB + 64GB – Rs.12,699
శామ్సంగ్ గెలాక్సీ M21 – 6GB + 128GB – Rs.14,999
శామ్సంగ్ గెలాక్సీ M31 ప్రత్యేకతలు
శామ్సంగ్ గెలాక్సీ M21 స్మార్ట్ ఫోన్ 2340 x 1080 పిక్సెళ్ళ రిజల్యూషన్ అందించగల ఒక 6.4 అంగుళాల సూపర్ AMOLED ఇన్ఫినిటీ – U డిస్ప్లేతో అందించబడుతుంది. అలాగే, ఇది గరిష్టంగా 2.3GHz క్లాక్ స్పీడ్ అందించగల ఒక ఎక్సినోస్ 9611 ఆక్టా కోర్ ప్రొసెసరు యొక్క శక్తితో నడుస్తుంది. ఈ ఫోన్, ఆండ్రాయిడ్ 10 పైన ఆధారితంగా One UI శామ్సంగ్ యూజర్ ఎక్స్పీరియన్స్ పైన నడుస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఒక అతిభారీ 6000 mAh బ్యాటరీతో వస్తుంది. అలాగే, ఇది 4GB ర్యామ్ జతగా 64GB వేరియంట్ మరియు మరొక 6GB ర్యామ్ జతగా 128GB వేరియంట్తో వస్తుంది.
ఇక కెమెరావిభగానికి వస్తే, ఇది వెనుక భాగంలో 48MP +8MP+5MP ట్రిపుల్ కెమేరా సేటప్పుతో వస్తుంది. ఇందులో f/2.0 ఎపర్చరు గల 48MP ప్రధాన కెమరా మరియు 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ కి జతగా 5MP డెప్త్ సెన్సార్ ని అందించింది. ఇక ముందుభాగంలో సెల్ఫీల కోసం 20MP సెల్ఫీ కెమెరాని అందించారు. సెల్ఫీలను క్లిక్ చేయడంతో పాటుగా ఇది పేస్ రికగ్నైజేషన్ కోసం కూడా ఉపయోగపడుతుంది. ఇందులో అందించిన స్టిక్కర్లతో మంచి ఫన్నీ ఫోటోలను సెల్ఫీలను తీసొకొవచ్చు మరియు కంటిన్యుయస్ షాట్స్ ఎంపికతో కూడా వస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
