శామ్సంగ్ గెలాక్సీ M20 యొక్క ఫ్లాష్ సేల్ : ఈరోజు 12 PM కి ప్రారంభమవుతుంది

HIGHLIGHTS

ఈ స్మార్ట్ ఫోనుతో మంచి ఆఫర్లు కూడ అందుబాటులో వున్నాయి.

గొప్ప అంచనాలతో మంచి ఫీచర్లతో  మార్కెట్లోకి శామ్సంగ్ కొత్త తన గెలాక్సీ M సిరిస్ నుండి బడ్జెట్ మరియు మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్లయినటువంటి, M10&M20 లను విడుదలచేసింది. ముందుగా,  ఈ స్మార్ట్ ఫోన్ల యొక్క ఫ్లాష్ సేల్ కూడా నిర్వహించి. అయితే, ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి మరొకసారి ఈ సేల్ Amazon.in ద్వారా అందుబాటులోకి ఉండనుంది. కానీ, ఈసారి మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ అయినటువంటి శామ్సంగ్ గెలాక్సీ M20 యొక్క ఫ్లాష్ సేల్ మాత్రమే  నిర్వహిస్తోంది.  ఇంకా, ఈ స్మార్ట్ ఫోనుతో మంచి ఆఫర్లు కూడ అందుబాటులో వున్నాయి. 

శామ్సంగ్ గెలాక్సీ M 20 ధర    

1. శామ్సంగ్ గెలాక్సీ M20 ( 3GB + 32GB వేరియంట్) ధర – Rs. 10,990

2. శామ్సంగ్ గెలాక్సీ M20 ( 4GB + 64GB వేరియంట్) ధర – Rs. 12,990

శామ్సంగ్ గెలాక్సీ M20 స్పెసిఫికేషన్స్

ఇక గెలాక్సీ M20 గురించి చూస్తే , ఇది 2340x 1080 రిజల్యూషనుతో, 19.5 :9 యాస్పెక్ట్ రేషియో గల కొంచెం పెద్దదైన ఒక 6.3 – అంగుళాల FHD+ డిస్ప్లేతో వస్తుంది. ఇది కూడా, ఒక  వాటర్ డ్రాప్ నోచ్ వలె కనిపించే, ఇన్ఫినిటీ – V  డిస్ప్లేతో వస్తుంది. ఇది 90% స్క్రీన్ టూ బాడీ రేషియాతో వస్తుంది. ఇది 1.8GHz డ్యూయల్ కొర్ జతగా 1.6 హెక్సాకోర్ కలిపిన, క్లాక్ చేయబడిన Exynos 7904 ఆక్టా కోర్ ప్రాసెసర్ జతగా Mali-G71 MP2 GPU శక్తితో వస్తుంది. ఈ ఫోన్, 3GB + 32GB స్టోరేజి మరియు 4GB + 64GB వంటి రెండు వేరియంట్లలో లభిస్తుంది మరియు ఒక మెమొరీ కార్డ్ ద్వారా 512GB వరకు స్టోరేజిని పెంచుకునే వీలును కూడా కలిగి ఉంటుంది. ఇది డ్యూయల్ VoLTE సిమ్ ఫిచరుతో వస్తుంది.

ఇక కెమేరా విభాగానికి వస్తే, ఈ స్మార్ట్ ఫోన్ వెనుకభాగంలో f/1.9 అపర్చరు గల ఒక 13MP సెన్సారుకు జతగా 120 డిగ్రీల 5MP అల్ట్రా – వైడ్ యాంగిల్ సెన్సరుతో అనుసంధానించిన డ్యూయల్ కెమేరా సేటప్పుతో  వస్తుంది. ముందు, f/2.0 అపర్చరు8 ఒక 8 MP కెమేరాతో వస్తుంది మరియు ముందు ఇన్ డిస్ప్లే ఫ్లాష్ తో వస్తుంది. ఇందులో,  5000mAh బ్యాటరీని అందిచారు మరియు ఇది పేస్ అన్లాక్ మరియు ఫింగర్ ప్రింట్ సెన్సారుతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్,శామ్సంగ్ v9.5 ఆధారితంగా ఆండ్రాయిడ్ 8.1.0 OS పైన నడుస్తుంది. ఇది ఓషియన్ బ్లూ మరియు చార్ కోల్ బ్లాక్ వంటి రెండు    

ఆఫర్స్ :

శామ్సంగ్ మరియు జియో భాగస్వామ్యంతో, "శామ్సంగ్ గెలాక్సీ M- జియో డబుల్ డేటా అఫర్ -2019", ని అందిస్తోంది ఈ గెలాక్సీ M10&M20 స్మార్ట్ ఫోన్లతో. దీని ద్వారా రూ. 3110 వరకు లాభాలను పొందవచ్చు. అయితే, ఈ డబుల్ డేటా అఫర్ కేవలం రూ. 198 మరియు రూ. 299 ప్రీపెయిడ్ ప్లాన్స్ యొక్క 10 రీఛార్జిల పైన మాత్రమే వర్తిస్తుంది. అలాగే, 6 నెలల వరకు EMI పైన కొనుగోలుచేసే వారికీ No Cost EMI కూడా అందుబాటులో ఉంటుంది. అదనంగా, ICICI బ్యాంకు డెబిట్ మరియు క్రెడిట్ కార్డుతో EMI పైన కొనుగోలు చేసేవారికి 5% తక్షణ డిస్కౌంట్ అఫర్ కూడా అందుబాటులోవుంది      

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :