ఈ రోజుమధ్యాహ్నం 12 గంటలకి Samsung Galaxy M20 మరియు M30 సేల్

ఈ రోజుమధ్యాహ్నం 12 గంటలకి Samsung Galaxy M20 మరియు M30 సేల్
HIGHLIGHTS

మంచి డిస్ప్లే, పెద్ద బ్యాటరీ మరియు గొప్ప కెమేరాలతో వచినటువంటి ఈ రెండు స్మార్ట్ ఫోన్ల యొక్క ఫ్లాష్ సేల్ ను ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి అమేజాన్ ఇండియా ప్రత్యేకంగా నిర్వహిస్తోంది.

ఇటీవల, Samsung  తన M సిరీస్ ఫోన్లతో మంచి అమ్మకాలను సాగించింది. ఈ M సిరిర్స్ ఫోన్లలో ముఖ్యంగా M20 మరియు M30 ఫోన్లు గొప్ప స్పెక్స్ మరియు ఫీచర్లతో ఆకట్టుకునేలా ఉంటాయి. మంచి డిస్ప్లే, పెద్ద బ్యాటరీ మరియు గొప్ప కెమేరాలతో వచినటువంటి ఈ రెండు స్మార్ట్ ఫోన్ల యొక్క ఫ్లాష్ సేల్ ను ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి అమేజాన్ ఇండియా ప్రత్యేకంగా నిర్వహిస్తోంది.

శామ్సంగ్ గెలాక్సీ M20 ధరలు

శామ్సంగ్ గెలాక్సీ M20 ( 3GB + 32GB ) ధర – Rs. 9,990

శామ్సంగ్ గెలాక్సీ M30 ధరలు

శామ్సంగ్ గెలాక్సీ M30 ( 4GB + 64GB ) ధర – Rs. 14,990

శామ్సంగ్ గెలాక్సీ M30 ( 6GB + 64GB ) ధర – Rs. 17,990

ఈ సేల్ ద్వారా అందనున్న ఆఫర్లు

గెలాక్సీ జియో క్లబ్ అఫర్ లో భాగంగా 10 రీఛార్జిల పైన డబల్ డేటాని మరియు 3110 రుపాయల్ వరకు సేవింగ్స్ ని అందిస్తోంది. బ్యాంక్ ఆఫర్ల విషయానికి వస్తే, ICICI బ్యాంకు యొక్క డెబిట్ & క్రెడిట్ కార్డులతో ఈ ఫోన్లను కొనుగోలు చేసేవారికి 1,500 రూపాయల వరకూ తక్షణ క్యాష్ బ్యాక్ ని  అఫర్ చేస్తోంది. అదనంగా, 6 నెలల EMI ఎంపికతో కొనుగోలు చేసేవారికి No Cost EMI కూడా అందుబాటులో ఉంటుంది.

శామ్సంగ్ గెలాక్సీ M20 ప్రత్యేకతలు

గెలాక్సీ M20 గురించి చూస్తే , ఇది 2340x 1080 రిజల్యూషనుతో, 19.5 :9 యాస్పెక్ట్ రేషియో గల కొంచెం పెద్దదైన ఒక 6.3 – అంగుళాల FHD+ డిస్ప్లేతో వస్తుంది. ఇది కూడా, ఒక  వాటర్ డ్రాప్ నోచ్ వలె కనిపించే, ఇన్ఫినిటీ – V  డిస్ప్లేతో వస్తుంది. ఇది 90% స్క్రీన్ టూ బాడీ రేషియాతో వస్తుంది. ఇది 1.8GHz డ్యూయల్ కొర్ జతగా 1.6 హెక్సాకోర్ కలిపిన, క్లాక్ చేయబడిన Exynos 7904 ఆక్టా కోర్ ప్రాసెసర్ జతగా Mali-G71 MP2 GPU శక్తితో వస్తుంది. ఈ ఫోన్, 3GB + 32GB స్టోరేజి మరియు 4GB + 64GB వంటి రెండు వేరియంట్లలో లభిస్తుంది మరియు ఒక మెమొరీ కార్డ్ ద్వారా 512GB వరకు స్టోరేజిని పెంచుకునే వీలును కూడా కలిగి ఉంటుంది. ఇది డ్యూయల్ VoLTE సిమ్ ఫిచరుతో వస్తుంది.

ఇక కెమేరా విభాగానికి వస్తే, ఈ స్మార్ట్ ఫోన్ వెనుకభాగంలో f/1.9 అపర్చరు గల ఒక 13MP సెన్సారుకు జతగా 120 డిగ్రీల 5MP అల్ట్రా – వైడ్ యాంగిల్ సెన్సరుతో అనుసంధానించిన డ్యూయల్ కెమేరా సేటప్పుతో  వస్తుంది. ముందు, f/2.0 అపర్చరు8 ఒక 8 MP కెమేరాతో వస్తుంది మరియు ముందు ఇన్ డిస్ప్లే ఫ్లాష్ తో వస్తుంది. ఇందులో,  5000mAh బ్యాటరీని అందిచారు మరియు ఇది పేస్ అన్లాక్ మరియు ఫింగర్ ప్రింట్ సెన్సారుతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్,శామ్సంగ్ v9.5 ఆధారితంగా ఆండ్రాయిడ్ 8.1.0 OS పైన నడుస్తుంది.

శామ్సంగ్ గెలాక్సీ M30 ప్రత్యేకతలు

శామ్సంగ్ గెలాక్సీ M30 స్మార్ట్ ఫోన్ 2340 x 1080 పిక్సెళ్ళ రిజల్యూషన్ అందించగల ఒక 6.4 అంగుళాల సూపర్ AMOLED ఇన్ఫినిటీ – U డిస్ప్లేతో అందించబడుతుంది. అలాగే, ఇది ఒక ఎక్సినోస్ 7904  ఆక్టా కోర్ ప్రొసెసరుతో నడుస్తుంది. ఈ ప్రొసెసరు ఒక ట్రిపుల్ రియర్ కెమేరాకు అనుకూలిస్తుంది. ఈ ఫోన్, ఆండ్రాయిడ్ 8.0.1 పైన ఆధారితంగా శామ్సంగ్ యూజర్ ఎక్స్పీరియన్స్ పైన నడుస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఒక భారీ 5000 mAh బ్యాటరీతో వస్తుంది. అలాగే, ఇది 4GB ర్యామ్ జతగా 64GB వేరియంట్ మరియు మరొక 6GB ర్యామ్ జతగా 128GB వేరియంట్తో వస్తుంది. ఒక SD కార్డు ద్వారా 512GB స్టోరేజిని పెంచుకునే సామర్ధ్యంతో వస్తుంది.

ఇక కెమెరావిభగానికి వస్తే, ఇది వెనుక భాగంలో 13MP +5MP+5MP  ట్రిపుల్ కెమేరా సేటప్పుతో వస్తుంది. ఇందులో 13MP ప్రధాన కెమరా మరియు 5MP అల్ట్రా వైడ్ యాంగిల్ షాట్లకోసం మరియు మరొక 5MP డెప్త్ ని పసిగట్టటానికి ఉపయోగపడుతుంది. ఇక ముందుభాగంలో సెల్ఫీల కోసం 16MP కెమెరాని అందించారు. సెల్ఫీలను క్లిక్ చేయడంతో పాటుగా ఇది పేస్ రికగ్నైజేషన్ కోసం కూడా ఉపయోగపడుతుంది. ఇందులో అందించిన స్టిక్కర్లతో మంచి ఫన్నీ ఫోటోలను సెల్ఫీలను తీసొకొవచ్చు

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo