అమెజాన్ సేల్ నుండి శామ్సంగ్ చవక 5G ఫోన్ సేల్ భారీ ఆఫర్లతో మొదలయ్యింది..!!

HIGHLIGHTS

ఈరోజు నుండి మొదలైన అమెజాన్ ప్రైమ్ డే సేల్

అమెజాన్ నుండి ఈ శామ్సంగ్ బడ్జెట్ 5G మరింత చవక ధరకే లభిస్తోంది

కేవలం 13,999 రూపాయల ప్రారంభ ధరలో 5G ఫీచర్స్ తో వచ్చింది

అమెజాన్ సేల్ నుండి శామ్సంగ్ చవక 5G ఫోన్ సేల్ భారీ ఆఫర్లతో మొదలయ్యింది..!!

ఈరోజు నుండి మొదలైన అమెజాన్ ప్రైమ్ డే సేల్ మరియు Samsung Galaxy M13 5G సేల్. అమెజాన్ నుండి ఈ శామ్సంగ్ బడ్జెట్ 5G మరింత చవక ధరకే లభిస్తోంది. ఎందుకంటే, అమెజాన్ ఈ స్మార్ట్ ఫోన్ పైన గొప్ప బ్యాంక్ ఆఫర్లను అందించింది. అందుకే, ఈ స్మార్ట్ ఫోన్ మరింత తక్కువ ధరకే లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ కేవలం 13,999 రూపాయల ప్రారంభ ధరలో 5G ఫీచర్స్ మరియు మంచి కెమెరా సెటప్ తో వచ్చింది.  

Digit.in Survey
✅ Thank you for completing the survey!

శామ్సంగ్ గెలాక్సీ M13 5G : ధర మరియు అఫర్స్

శామ్సంగ్ గెలాక్సీ M13 5G స్టార్టింగ్ వేరియంట్ 4జీబీ మరియు 64జీబీ స్టోరేజ్ ధర రూ.13,999. ఈ ఫోన పైన లాంచ్ అఫర్ ను కూడా శామ్సంగ్ అందించింది.ఈ ఫోన్ ను అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుండి SBI లేదా ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ ద్వారా కొనే వారికి 1,250 రూపాయల డిస్కౌంట్ లభిస్తుంది. Buy From Here

శామ్సంగ్ గెలాక్సీ M13 5G: స్పెక్స్

శామ్సంగ్ గెలాక్సీ M13 5G స్మార్ట్ ఫోన్ 6.5 అంగుళాల డిస్ప్లేని 90Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ బడ్జెట్ 5G చిప్ సెట్ Dimensity 700 శక్తితో పనిచేస్తుంది. ఈ ఫోన్ కూడా ఆండ్రాయిడ్ 11 OS పైన నడుస్తుంది మరియు One UI 3.1 స్కిన్ తో వుంటుంది.

కెమెరాల పరంగా, ఈ ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఇవ్వబడింది. ఇందులో, 50ఎంపీ మైన్ కెమెరాకి జతగా డెప్త్ కెమెరా ఉంటుంది.  ఇక సెల్ఫీల కోసం ఈ ఫోన్ ముందు భాగంలో సెల్ఫీ కెమెరాని అందించింది. ఈ ఫోన్  5000 mAh బ్యాటరీని 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo