SAMSUNG లేటెస్ట్ గా విడుదల చేసిన బడ్జెట్ స్మార్ట్ ఫోన్ Galaxy M06 5G మొదటిసారిగా సేల్ కి అందుబాటులోకి రాబోతుంది. ఈ స్మార్ట్ ఫోన్ ను అండర్ 10 వేల ధరలో ఆకట్టుకునే ఫీచర్స్ మరియు డిజైన్ అందించింది. ఈ ఫోన్ మొదటి సేల్ కంటే ముందుగా మీరు తెలుసుకోవాల్సిన ధర మరియు ఫీచర్లు వివరాలు ఇక్కడ చూడవచ్చు.
Survey
✅ Thank you for completing the survey!
SAMSUNG Galaxy M06 5G : ఫస్ట్ సేల్ డీటెయిల్స్
శామ్సంగ్ గెలాక్సీ M06 5జి స్మార్ట్ ఫోన్ ను రూ. 9,999 రూపాయల ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ 4GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ను ఈ ప్రైస్ ట్యాగ్ తో అందించింది. ఈ ఫోన్ యొక్క రెండవ వేరియంట్ 6GB + 128GB ను రూ. 11,499 రూపాయల ధరతో లాంచ్ చేసింది. అయితే, ఈ ఫోన్ ను సేల్ నుంచి బ్యాంక్ ఆఫర్స్ తో కేవలం రూ. 9,499 మరియు రూ. 10,999 రూపాయల ఆఫర్ ధరకే అందుకోవచ్చని తెలిపింది. ఈ ఫోన్ అమెజాన్ ఇండియా నుంచి లభిస్తుంది.
శామ్సంగ్ గెలాక్సీ M06 5జి స్మార్ట్ ఫోన్ 6. 7 ఇంచ్ HD స్క్రీన్ ను కల్గి ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 6300 చిప్ సెట్ తో నడుస్తుంది మరియు దీనికి జతగా 6GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కూడా అందించింది. ఈ ఫోన్ 4OS అప్గ్రేడ్స్ మరియు 4 సంవత్సరాల రెగ్యులర్ సెక్యూరిటీ అప్డేట్స్ అందుకుంటుంది.
ఈ ఫోన్ లో వెనుక 50MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 8MP సెల్ఫీ కెమెరా ఉంటాయి. ఈ ఫోన్ 5000 mAh బిగ్ బ్యాటరీ మరియు 25W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ చాలా స్లీక్ డిజైన్ తో ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్ సేజ్ గ్రీన్ మరియు బ్లేజింగ్ బ్లాక్ రెండు కలర్ ఆప్షన్ లలో లభిస్తుంది. ఈ ఫోన్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, క్విక్ షేర్ మరియు వాయిస్ ఫోకస్ వంటి మరిన్ని ఫీచర్స్ కలిగి ఉంటుంది.