Samsung Galaxy F36 5G: బడ్జెట్ ధరలో 4K AI కెమెరా మరియు గొప్ప డిజైన్ తో వచ్చింది.!
ఈరోజు ఇండియన్ మార్కెట్లో శాంసంగ్ కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ విడుదల చేసింది
Samsung Galaxy F36 5G ను రెండు వేరియంట్లలో విడుదల చేసింది
ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ ఆఫర్ లో భాగంగా గొప్ప బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ని అందించింది.
Samsung Galaxy F36 5G ఈరోజు ఇండియన్ మార్కెట్లో శాంసంగ్ కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ విడుదల చేసింది. రీసెంట్ గా గెలాక్సీ M సిరీస్ నుంచి ఎం 36 స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసిన శాంసంగ్ ఈరోజు గెలాక్సీ ఎఫ్ సిరీస్ నుంచి ఎఫ్ 36 స్మార్ట్ ఫోన్ మార్కెట్లో విడుదల చేసింది. శాంసంగ్ సరికొత్తగా విడుదల చేసిన ఈ శాంసంగ్ గెలాక్సీ F36 స్మార్ట్ ఫోన్ యొక్క ధర మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయో ఒక లుక్కేద్దాం పదండి.
SurveySamsung Galaxy F36 5G : ప్రైస్
శాంసంగ్ ఈ స్మార్ట్ ఫోన్ ను రెండు వేరియంట్లలో విడుదల చేసింది ఇందులో బేసిక్ (6 జీబీ + 128 జీబీ) వేరియంట్ ను రూ. 17,499 ధరతో మరియు (8 జీబీ + 128 జీబీ) వేరియంట్ ను రూ. 18,999 రూపాయల ధరతో విడుదల చేసింది. ఈ ఫోన్ కోరల్ రెడ్, లక్స్ వయోలెట్ మరియు ఆక్సి బ్లాక్ మూడు రంగుల్లో లభిస్తుంది. ఈ ఫోన్ జూలై 29 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్ కార్ట్ మరియు శాంసంగ్ అఫీషియల్ సైట్ నుంచి సేల్ అవుతుంది.
ఆఫర్లు:
ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ ఆఫర్ లో భాగంగా గొప్ప బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ని అందించింది. సెలెక్టెడ్ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ మరియు EMI ఆఫర్ తో ఈ ఫోన్ కొనుగోలు చేసే వారికి 1,000 రూపాయలు డిస్కౌంట్ లభిస్తుంది. ఇది కాకుండా ఈ ఫోన్ తో పాటు 500 రూపాయల కూపన్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. . ఈ రెండు ఆఫర్లు కలుపుకొని చూస్తే ఈ ఫోన్ కేవలం రూ. 15,999 రూపాయల ప్రారంభ ధరలో లభిస్తుంది.
Samsung Galaxy F36 5G : ఫీచర్లు
శాంసంగ్ ఈ స్మార్ట్ ఫోన్ ను ప్రీమియం లెదర్ ప్యాట్రన్ డిజైన్ తో అందించింది మరియు ఈ ఫోన్ చాలా సన్నగా ఉంటుంది. ఈ ఫోన్ లో 6.7 ఇంచ్ Super AMOLED స్క్రీన్ ఉంటుంది మరియు ఈ స్క్రీన్ చాలా గట్టిగా ఉండే కార్నింగ్ ప్రీమియం గ్లాస్ విక్టస్ ప్లస్ ను రక్షణగా కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, FHD+ రిజల్యూషన్ మరియు 16 మిలియన్ కలర్ సపోర్ట్ కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ ను Samsung యొక్క సొంత చిప్ సెట్ Exynos 1380 తో అందించింది. ఇది 5nm చిప్ సెట్ మరియు 2.4 GHz క్లాక్ స్పీడ్ తో మంచి మల్టీ టాస్కింగ్ హ్యాండిల్ ప్రోసెసర్ గా చెప్పబడుతుంది. ఈ ఫోన్ 8 జీబీ ర్యామ్ మరియు 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 2 TB వరకు మెమరీ కార్డు సపోర్ట్ సపోర్ట్ కలిగి ఉంటుంది.
Also Read: Vivo T4R 5G: అతి సన్నని డిజైన్ తో కొత్త ఫోన్ లాంచ్ చేస్తున్న వివో.!
స్మార్ట్ ఫోన్ వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా మరియు ముందు సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఇందులో వెనుక 50MP మెయిన్, 8MP అల్ట్రా వైడ్ మరియు 2MP మాక్రో కెమెరా మరియు ముందు 13MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ ఫాలెన్ 30FPS వద్ద UHD 4K (3840 x 2160) వీడియో రికార్డింగ్ సపోర్ట్ మరియు AI కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 5000 mAh బిగ్ బ్యాటరీ మరియు ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ను కలిగి ఉంటుంది.