Samsung Galaxy F15 5G: ప్రీమియం డిజైన్ మరియు 6000mAh బ్యాటరీతో వస్తోంది.!
గెలాక్సీ ఎఫ్ సిరీస్ నుండి ఎఫ్15 5జి స్మార్ట్ ఫోన్ ను లాంఛ్ చేస్తోంది
ప్రీమియం డిజైన్ మరియు 6000mAh బ్యాటరీ తీసుకు వస్తున్నట్లు శామ్సంగ్ తెలిపింది
కీలకమైన ఫీచర్స్ మరియు స్పెక్స్ ను టీజింగ్ పేజ్ ద్వారా శామ్సంగ్ అందించింది
Samsung Galaxy F15 5G: శామ్సంగ్ బడ్జెట్ సిరీస్ అయిన గెలాక్సీ ఎఫ్ సిరీస్ నుండి ఎఫ్15 5జి స్మార్ట్ ఫోన్ ను లాంఛ్ చేస్తోంది. ఈ ఫోన్ ను ప్రీమియం డిజైన్ మరియు 6000mAh బ్యాటరీ తీసుకు వస్తున్నట్లు శామ్సంగ్ తెలిపింది. ఈ ఫోన్ ను ప్రైస్ సెగ్మెంట్ లో ముందెన్నడూ చూడని మంచి ఫీచర్స్ తో అందిస్తున్నట్లు శామ్సంగ్ గొప్పగా చెబుతోంది. ఈ ఫోన్ గురించి శామ్సంగ్ చెబుతున్న సంగతులు ఏమిటో చూసేద్దాం పదండి.
Samsung Galaxy F15 5G Launch
శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్15 5జి స్మార్ట్ ఫోన్ ను మార్చి 4వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకి ఇండియాలో లాంఛ్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ శామ్సంగ్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్స్ మరియు స్పెక్స్ ను టీజింగ్ పేజ్ ద్వారా శామ్సంగ్ అందించింది. ఈ ఫోన్ ను Flipkart కూడా ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ద్వారా టీజింగ్ చేస్తోంది.
Also Read: Lava Blaze Curve Olution: లావా అప్ కమింగ్ కర్వ్డ్ ఫోన్ టీజింగ్ అదిరిందిగా.!
శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్15 5జి ప్రత్యేకతలు
శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్15 5జి స్మార్ట్ ఫోన్ సెగ్మెంట్ ఫస్ట్ Super AMOLED డిస్ప్లే తో వస్తున్న ఫోన్ గా కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్ ను గెలాక్సీ సిగ్నేచర్ డిజైన్ తో అందిస్తున్నట్లు కూడా శామ్సంగ్ తెలిపింది. ఈ మధ్య కాలంలో శామ్సంగ్ అందిస్తున్న ప్రతి ఫోన్ లోను 6000 mAh బ్యాటరీని అందించడం పరిపాటిగా మారింది. ఈ ఫోన్ కూడా ఇందుకు విరుద్ధం కాదు. గెలాక్సీ ఎఫ్15 5జి ను కూడా 6000 mAh బిగ్ బ్యాటరీతో తీసుకు వస్తోంది.
ఈ ఫోన్ లో అందించిన మరికొన్ని కీలకమైన ఫీచర్స్ ను కూడా శామ్సంగ్ టీజింగ్ ద్వారా తెలిపింది. శామ్సంగ్ ఈ ఫోన్ ను MediaTek Dimensity 6100+ ఆక్టా కోర్ 5జి ప్రోసెసర్ తో అందిస్తున్నట్లు కన్ఫర్మ్ చేసింది. ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ కెమేరా సెటప్ ఉన్నట్లు కూడా మనం చూడవచ్చు. మరింత ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ ఫోన్ ను 4 సంవత్సరాల ఆండ్రాయిడ్ అప్గ్రేడ్ అందుకునేల అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
అంటే, శామ్సంగ్ స్మార్ట్ ఫోన్ మరింత ఎక్కువ కాలం అప్ టూ డేట్ సెక్యూరిటీ అప్డేట్స్ తో అలరిస్తుందని క్లియర్ గా చెబుతోంది.