Samsung Galaxy F06 5G: 10 వేల సెగ్మెంట్ లో ఆకట్టుకునే ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.!

HIGHLIGHTS

Samsung Galaxy F06 5G స్మార్ట్ ఫోన్ ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది

ఈ స్మార్ట్ ఫోన్ ను 10 వేల ఉప బడ్జెట్ లో ఆకట్టుకునే ఫీచర్స్ తో శామ్సంగ్ విడుదల చేసింది

కేవలం రూ. 9,999 రూపాయల ప్రారంభ ధరతో విడుదల చేసింది

Samsung Galaxy F06 5G: 10 వేల సెగ్మెంట్ లో ఆకట్టుకునే ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.!

Samsung Galaxy F06 5G స్మార్ట్ ఫోన్ ను ఈరోజు ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను 10 వేల ఉప బడ్జెట్ లో ఆకట్టుకునే ఫీచర్స్ తో శామ్సంగ్ విడుదల చేసింది. ‘అందరి వద్ద సొంత 5జి ఫోన్ ఉంటుంది’ అనే నినాదంతో ఈ బడ్జెట్ ఫోన్ ను శామ్సంగ్ విడుదల చేసింది. ఈరోజే సరికొత్తగా విడుదలైన ఈ శామ్సంగ్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ పూర్తి వివరాల పై ఒక లుక్కేద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Samsung Galaxy F06 5G : ప్రైస్

శామ్సంగ్ గెలాక్సీ F06 5జి స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 9,999 రూపాయల ప్రారంభ ధరతో విడుదల చేసింది. ఈ ఫోన్ యొక్క 4GB + 128GB వేరియంట్ ను ఈ ధరకు అందించింది. అయితే, ఈ ఫోన్ యొక్క 6GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ వేరియంట్ ను రూ. 11,499 రూపాయల ధారకు అందించింది. ఫిబ్రవరి 20 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ మొదటి సేల్ మొదలవుతుంది. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.

Samsung Galaxy F06 5G : ఫీచర్స్

శామ్సంగ్ గెలాక్సీ F06 5జి స్మార్ట్ ఫోన్ 6.7 ఇంచ్ PLS LCD డిస్ప్లే కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే HD+ (1600 x 720) రిజల్యూషన్ మరియు 800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఈ శామ్సంగ్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Dimensity 6300 బడ్జెట్ 5G చిప్ సెట్ తో వస్తుంది. దీనికి జతగా 4GB / 6GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ కలిగి ఉంటుంది.

శామ్సంగ్ గెలాక్సీ F06 5జి వెనుక 50MP + 2MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 8MP సెల్ఫీ కెమెరా కూడా కలిగి ఉంటుంది. శామ్సంగ్ ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను 5000 mAh పెద్ద బ్యాటరీతో మరియు 25W ఫాస్ట్ చార్జ్ సపోర్ట్ తో అందించింది. ఈ ఫోన్ 4 మేజర్ OS అప్గ్రేడ్ మరియు 4 years రెగ్యులర్ సెక్యూరిటీ అప్డేట్స్ ను అందుకుంటుంది.

Also Read: Mivi Super Pods Concerto బడ్స్ ను 3D సౌండ్ స్టేజ్ మరియు మరిన్ని ఫీచర్స్ తో లాంచ్ చేస్తోంది.!

ఈ శామ్సంగ్ లేటెస్ట్ ఫోన్ సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, క్విక్ షేర్ మరియు వాయిస్ ఫోకస్ ఆన్ వంటి ఫీచర్లు కూడా కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo