Mivi Super Pods Concerto ఇయర్ బడ్స్ ఇండియాలో లాంచ్ చేస్తున్నట్లు టీజింగ్ చేస్తోంది. ఈ అప్ కమింగ్ బడ్స్ Dolby Audio మరియు 3D సౌండ్ స్టేజ్ వంటి మరిన్ని ఫీచర్స్ కలిగి ఉంటుందని మివి చెబుతోంది. సూపర్ పోడ్స్ సీరీస్ నుంచి ఇప్పటికే చాలా ఇయర్ బడ్స్ లాంచ్ చేసిన మివి, ఇప్పుడు తన పోర్ట్ ఫోలియోకి ఈ కొత్త ఇయర్ బడ్స్ ను కూడా జత చేస్తుంది.
Survey
✅ Thank you for completing the survey!
Mivi Super Pods Concerto : ఫీచర్స్
మివి ఈ అప్ కమింగ్ ను బడ్స్ ను త్వరలోనే ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేసింది. ఈ బడ్స్ ను Dolby Audio సపోర్ట్ తో లాంచ్ చేస్తోంది. అంతేకాదు, ఈ బడ్స్ ను గొప్ప లీనమయ్యే సౌండ్ అందించే 3D సౌండ్ స్టేజ్ తో కూడా ఆఫర్ చేస్తుందట. ఇది మాత్రమే కాదు ఈ అప్ కమింగ్ బడ్స్ లో లాస్ లెస్ సౌండ్ అందించేలా LDAC సపోర్ట్ ను కూడా కలిగి ఉంటుంది.
మివి సూపర్ పోడ్స్ కాన్సెర్టో ఇయర్ బడ్స్ ను యూని బాడీ మెటల్ డిజైన్ తో అందిస్తుంది. ఇది మంచి ఫిట్ కలిగిన బడ్స్ మరియు ఆకర్షణీయమైన గ్లాసీ డిజైన్ బాక్స్ తో జతగా అందిస్తుంది. ఈ అప్ కమింగ్ బడ్స్ ANC సపోర్ట్ ను కూడా కలిగి ఉంటుంది. అంటే, చెవులకు ఎటువంటి నోయిస్ రాకుండా ప్యూర్ మ్యూజిక్ మరియు క్లియర్ వాయిస్ కాల్స్ అందించే సత్తా కలిగి ఉంటుంది.
ఇక ఈ ఇయర్ బడ్స్ బ్యాటరీ విషయానికి వస్తే, ఈ అప్ కమింగ్ మివి ఇయర్ బడ్స్ టోటల్ 60 గంటల ప్లే టైమ్ ఆఫర్ చేసే చేసే బ్యాటరీ సెటప్ కలిగి ఉంటాయట. ఈ బడ్స్ సింగిల్ ఛార్జ్ తో 8.5 గంటల ప్లే టైమ్ అందిస్తాయి మరియు ఈ బడ్స్ టైప్ C చార్జ్ పోర్ట్ మరియు ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది.