ఇండియాలో విడుదలైన శామ్సంగ్ గెలాక్సీ A 71 : ఈ టాప్ ఫీచర్లు దీని సొంతం

ఇండియాలో విడుదలైన శామ్సంగ్ గెలాక్సీ A 71 : ఈ టాప్ ఫీచర్లు దీని సొంతం

శామ్సంగ్ గెలాక్సీ A 71 ఈ రోజు భారతదేశంలో లాంచ్ అయ్యింది మరియు ఈ స్మార్ట్ ఫోన్ మునుపటి గెలాక్సీ ఎ 70 స్థానంలో ఉంటుంది. ఈ కొత్త శామ్సంగ్ ఫోన్ ఇన్ఫినిటీ-ఓ డిస్ప్లేతో వస్తుంది మరియు ఈ  ఫోన్ వెనుక భాగంలో క్వాడ్ కెమెరాతో వస్తుంది. గెలాక్సీ A71 ఆండ్రాయిడ్ 10 తో సహా వన్ UI తో పనిచేస్తుంది. వియత్నాంలో, ఈ ఫోన్ రెండు వేరియంట్లలో ప్రారంభించబడింది, అయితే భారతదేశంలో ఇది కేవలం ఒక వేరియంట్ తో మాత్రమే వచ్చింది. శామ్సంగ్ కొత్త ఫోన్‌ ల పోలికలతో వివో వి 17 ప్రో, ఒప్పో రెనో, రెడ్‌మి కె 20 ప్రో, వన్‌ప్లస్ 7 వంటి ఫోన్లు ఉన్నాయి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

శామ్‌సంగ్ గెలాక్సీ ఎ 71 ధర

శామ్సంగ్ గెలాక్సీ ఎ 71 కేవలం 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ తో మాత్రమే ప్రవేశపెట్టబడింది మరియు దీని ధరను రూ .29,999 రూపాయలుగా ప్రకటించింది. ఈ స్మార్ట్‌ ఫోన్ ప్రిజం క్రష్ బ్లాక్, ప్రిజం క్రష్ సిల్వర్ మరియు ప్రిజం క్రష్ బ్లూ వంటి మూడు వినూత్నమైన కలర్‌ ఎంపికలతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క అమ్మకాలు ఫిబ్రవరి 24 న శామ్సంగ్ ఒపెరా హౌస్ శామ్‌సంగ్.కామ్ మరియు ప్రధాన ఆన్‌లైన్ పోర్టళ్లలో ప్రారంభమవుతుంది.

శామ్సంగ్ గెలాక్సీ ఎ 71 స్పెసిఫికేషన్

శామ్సంగ్ గెలాక్సీ A71 ఒక 6.7-అంగుళాల FHD + డిస్ప్లేతో ప్రారంభించబడింది, ఇది సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ-ఓ డిస్ప్లే మరియు 20: 9 ఆస్పెక్ట్ రేషియోని కలిగి ఉంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 730 ఆక్టా-కోర్ SoC ద్వారా 8GB RAM తో జతచేయబడుతుంది. ఈ ఫోనులో 128 జీబీ స్టోరేజ్ ఉంది మరియు ఒక డేడికేటెడ్ మైక్రో SD కార్డ్ సహాయంతో 512 జీబీకి పెంచవచ్చు.

ఇక కెమేరాల విషయానికి వస్తే, ఈ ఫోన్ వెనుక ఒక క్వాడ్ కెమెరా సెటప్‌ తో వస్తుంది. ఇది ఒక 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కలిగి ఉంది మరియు ఇది ఎఫ్ / 1.8 ఎపర్చరు లెన్స్‌తో వస్తుంది. రెండవది 12 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా, ఇది ఎఫ్ / 2.2 ఎపర్చరు గల అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్. ఇది కాకుండా, రెండు 5 మెగాపిక్సెల్ డెప్త్ మరియు మ్యాక్రో సెన్సార్లు ఉంచబడ్డాయి, దీని ఎపర్చరు వరుసగా f / 2.2 మరియు f / 2.4 గ ఉన్నాయి. ఈ ఫోన్ ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అందుబాటులో ఉంది మరియు దాని ఎపర్చరు f / 2.2.

కనెక్టివిటీ కోసం, ఈ ఫోనులో 4 జి VoLTE , వై-ఫై, బ్లూటూత్, జిపిఎస్ / ఎ-జిపిఎస్ మరియు యుఎస్‌బి టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఫోన్‌ లో డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది మరియు ఒక పెద్ద 4,500 ఎంఏహెచ్ బ్యాటరీని మరియు 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo