త్వరలోరానున్న శామ్సంగ్ గేలాక్సీ M31 స్పెక్స్ ఆన్లైన్లో లీకయ్యాయి

త్వరలోరానున్న శామ్సంగ్ గేలాక్సీ M31 స్పెక్స్ ఆన్లైన్లో లీకయ్యాయి
HIGHLIGHTS

కొత్త లీక్స్ ఈ ఫోను యొక్క మరిన్ని వివరాలను వివరిస్తున్నాయి.

భారతదేశంలో, శామ్సంగ్ తన M సిరీస్ ద్వారా గొప్ప అమ్మకాలను సాధించింది మరియు అందులో మరి ముఖ్యంగా శామ్సంగ్ గెలాక్సీ M30 ద్వారా ఎక్కువగా కొనుగోలుదారులను ఆకట్టుకుంది. ఇక గెలాక్సీ M30 తరువాత, ఇటీవల ఇండియాలో ఒక 48MP ట్రిపుల్ రియర్ కెమేరా మరియు 6,000mAh బ్యాటరీతో విడుదల చేసిన శామ్సంగ్ గెలాక్సీ M30s కూడా మంచి విజయాన్ని సాధించింది.

ఇక ఈ M నుండి తరువాతి కొనసాగింపుగా, ఈ సిరిస్ నుండి గెలాక్సీ M31 స్నార్ట్ ఫోన్ను మార్కెట్లొకి తీసుకురావడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు, ముందుగా వచ్చిన అనేక లీకులు మరియు నివేదికలు తెలియచేస్తున్నాయి. అయితే, GeekBench పైన ఆన్లైన్లో దర్శనమిచ్చిన కొత్త లీక్స్ ఈ ఫోను యొక్క మరిన్ని వివరాలను వివరిస్తున్నాయి.

ఈ త్వరలో రానున్న స్మార్ట్ ఫోన్ SM-M315F మోడల్ నంబరుతో కనిస్తోంది మరియు ఇది గీక్ బెంచ్ పైన సింగల్ – కోర్ మీద 348 పాయింట్లను, మల్టీ – కోర్ పైన 1,214 పాయింటాలను సాధించినట్లు చెబుతోంది. అంటే, ఈ స్మార్ట్ ఫోన్ ఒక మిడ్ రేంజ్ స్థాయి స్మార్ట్ ఫోన్ యొక్క ప్రతిభను చూపుతున్నట్టు, మనం ఊహించవచ్చు. అంతేకాదు, ఈ ఫోన్ బాక్స్ నుండి బయటకి వస్తూనే Android 10 OS తో పనిచేస్తుందని తెలుస్తోంది. మరికొన్ని వివరాలను పరిశీలిస్తే, ఇది శామ్సంగ్ యొక్క Exynos 9611 ఆక్టా కోర్ ప్రాసెసర్ తో వస్తుందని అనిపిస్తుంది. అయితే, ముందుగా వచ్చిన కొన్ని నివేదిక్కలు మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 665 SoC తో వస్తుందని  ప్రకటించాయి.                                       

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo