Redmi Turbo 5 India launch date confirmed
Redmi Turbo 5 స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ డేట్ ను ఈరోజు షియోమీ రివీల్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం చాలా రోజుల ముందు నుండి రెడ్ మీ టీజింగ్ చేసింది. ఈ ఫోన్ ను అత్యంత వేగవంతమైన రెడ్ మీ ఫోన్ గా లాంచ్ చేస్తున్నట్లు షియోమీ ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి గొప్పగా చెబుతోంది. మరి ఈ అప్ కమింగ్ రెడ్ మీ ఫాస్ట్ ఫోన్ లాంచ్ డేట్ మరియు కంపెనీ రివీల్ చేసిన ఈ ఫోన్ కీలక ఫీచర్స్ పై ఒక లుక్కేద్దామా.
రెడ్ మీ టర్బో 5 స్మార్ట్ ఫోన్ జూన్ 16వ తేదీ లాంచ్ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం రెడ్ మీ ఈ డేట్ ను ఫిక్స్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కోసం అమెజాన్ ఇండియా ద్వారా ప్రత్యేకమైన టీజర్ పేజి అందించి షియోమీ టీజింగ్ చేస్తోంది. ఈ టీజర్ పేజీ నుంచి ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కీలక ఫీచర్స్ కూడా ఒక్కొక్కటిగా బయటపెడుతోంది.
రెడ్ మీ టర్బో 5 స్మార్ట్ ఫోన్ ను సరికొత్త డిజైన్ లో లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్ చూడటానికి కాంపాక్ట్ సైజులో ఉన్నట్లు అనిపిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ పెర్ఫార్మెన్స్ ని వివరించే వివరాలు కంపెనీ రివీల్ చేసింది. ఈ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 8500 Ultra తో లాంచ్ చేస్తున్నట్లు టీజర్ పేజి నుంచి రివీల్ చేసింది. ఈ ఫాస్ట్ చిప్ సెట్ తో జతగా 12GB LPDDR5X ఫిజికల్ ర్యామ్ మరియు 12GB వర్చువల్ ర్యామ్ సపోర్ట్ ఉంటుంది. ఇది మాత్రమే కాదు ఈ ఫోన్ లో ఫాస్ట్ రెస్పాన్స్ అందించే UFS 4.1 బిగ్ స్టోరేజ్ కూడా ఉంటుంది.
ప్రస్తుతానికి ఈ అప్ కమింగ్ ఫోన్ యొక్క పెర్ఫార్మెన్స్ వివరాలు మరియు ఫోన్ డిజైన్ వెల్లడించే టీజర్ ఇమేజ్ మాత్రమే రివీల్ చేసింది. ఈ ఫోన్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ లో కెమెరా చుట్టూ శక్తివంతమైన LED లైట్ ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి ఆన్లైన్ ఇప్పటికే చాలా లీక్స్ మరియు రుమార్లు ఉన్నాయి. నెట్టింట్లో ఉన్న టెక్ లీకర్ల సమాచారం ప్రకారం ఈ ఫోన్ మిడ్ రేంజ్ సెగ్మెంట్‌లో గట్టి పోటీ ఇచ్చే ఫోన్ గా ఇండియాలో లాంచ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
Also Read: Jio New Offer: జియో యూజర్ల కోసం ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఆఫర్ అందించిన జియో.!
నెట్టింట్లో దర్శనమిచ్చిన లీక్డ్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ లో 6.6 అంగుళాల 1.5K OLED డిస్‌ప్లే ఉండే అవకాశం ఉంది. రెడ్ మీ ఈ ఫోన్ ను మెటల్ ఫ్రేమ్ మరియు ప్రీమియం డిజైన్‌తో ఫోన్ చాలా ఆకర్షణీయంగా అందిస్తుందని సమాచారం. బ్యాటరీ విభాగంలో ఈ ఫోన్ లో పెద్ద అప్ గ్రేడ్ ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. వివిధ లీకుల ప్రకారం, ఈ ఫోన్ లో 7,500mAh నుంచి 8,000mAh వరకు బ్యాటరీ సామర్థ్యం కలిగిన బ్యాటరీతో ఉండొచ్చని కూడా తెలుస్తోంది. ఈ ఫోన్ ను వేగంగా ఛార్జ్ చేసే 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా లభించే అవకాశం ఉంది.
గమనిక: పై వివరాలు ప్రస్తుతం లీక్స్ మరియు రూమర్ల ఆధారంగా మాత్రమే అందించాము. అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత స్పెసిఫికేషన్ లలో మార్పులు ఉండే అవకాశం ఉండవచ్చు.