Redmi Turbo 5 ఇండియా లాంచ్ డేట్ కన్ఫర్మ్ చేసిన షియోమీ.!

HIGHLIGHTS

Redmi Turbo 5 స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ డేట్ ను ఈరోజు షియోమీ రివీల్ చేసింది

ఈ ఫోన్ ను అత్యంత వేగవంతమైన రెడ్ మీ ఫోన్ గా లాంచ్ చేస్తున్నట్లు గొప్పగా చెబుతోంది

మీడియాటెక్ Dimensity 8500 Ultra తో లాంచ్ చేస్తున్నట్లు రివీల్ చేసింది

Redmi Turbo 5 ఇండియా లాంచ్ డేట్ కన్ఫర్మ్ చేసిన షియోమీ.!

Redmi Turbo 5 స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ డేట్ ను ఈరోజు షియోమీ రివీల్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం చాలా రోజుల ముందు నుండి రెడ్ మీ టీజింగ్ చేసింది. ఈ ఫోన్ ను అత్యంత వేగవంతమైన రెడ్ మీ ఫోన్ గా లాంచ్ చేస్తున్నట్లు షియోమీ ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి గొప్పగా చెబుతోంది. మరి ఈ అప్ కమింగ్ రెడ్ మీ ఫాస్ట్ ఫోన్ లాంచ్ డేట్ మరియు కంపెనీ రివీల్ చేసిన ఈ ఫోన్ కీలక ఫీచర్స్ పై ఒక లుక్కేద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Redmi Turbo 5 : లాంచ్ డేట్?

రెడ్ మీ టర్బో 5 స్మార్ట్ ఫోన్ జూన్ 16వ తేదీ లాంచ్ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం రెడ్ మీ ఈ డేట్ ను ఫిక్స్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కోసం అమెజాన్ ఇండియా ద్వారా ప్రత్యేకమైన టీజర్ పేజి అందించి షియోమీ టీజింగ్ చేస్తోంది. ఈ టీజర్ పేజీ నుంచి ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కీలక ఫీచర్స్ కూడా ఒక్కొక్కటిగా బయటపెడుతోంది.

Redmi Turbo 5 : ఫీచర్స్

రెడ్ మీ టర్బో 5 స్మార్ట్ ఫోన్ ను సరికొత్త డిజైన్ లో లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్ చూడటానికి కాంపాక్ట్ సైజులో ఉన్నట్లు అనిపిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ పెర్ఫార్మెన్స్ ని వివరించే వివరాలు కంపెనీ రివీల్ చేసింది. ఈ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 8500 Ultra తో లాంచ్ చేస్తున్నట్లు టీజర్ పేజి నుంచి రివీల్ చేసింది. ఈ ఫాస్ట్ చిప్ సెట్ తో జతగా 12GB LPDDR5X ఫిజికల్ ర్యామ్ మరియు 12GB వర్చువల్ ర్యామ్ సపోర్ట్ ఉంటుంది. ఇది మాత్రమే కాదు ఈ ఫోన్ లో ఫాస్ట్ రెస్పాన్స్ అందించే UFS 4.1 బిగ్ స్టోరేజ్ కూడా ఉంటుంది.

Redmi Turbo 5

ప్రస్తుతానికి ఈ అప్ కమింగ్ ఫోన్ యొక్క పెర్ఫార్మెన్స్ వివరాలు మరియు ఫోన్ డిజైన్ వెల్లడించే టీజర్ ఇమేజ్ మాత్రమే రివీల్ చేసింది. ఈ ఫోన్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ లో కెమెరా చుట్టూ శక్తివంతమైన LED లైట్ ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి ఆన్లైన్ ఇప్పటికే చాలా లీక్స్ మరియు రుమార్లు ఉన్నాయి. నెట్టింట్లో ఉన్న టెక్ లీకర్ల సమాచారం ప్రకారం ఈ ఫోన్ మిడ్ రేంజ్ సెగ్మెంట్‌లో గట్టి పోటీ ఇచ్చే ఫోన్ గా ఇండియాలో లాంచ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

Also Read: Jio New Offer: జియో యూజర్ల కోసం ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఆఫర్ అందించిన జియో.!

రెడ్ మీ టర్బో 5 : లీక్ ఫీచర్స్

నెట్టింట్లో దర్శనమిచ్చిన లీక్డ్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ లో 6.6 అంగుళాల 1.5K OLED డిస్‌ప్లే ఉండే అవకాశం ఉంది. రెడ్ మీ ఈ ఫోన్ ను మెటల్ ఫ్రేమ్ మరియు ప్రీమియం డిజైన్‌తో ఫోన్ చాలా ఆకర్షణీయంగా అందిస్తుందని సమాచారం. బ్యాటరీ విభాగంలో ఈ ఫోన్ లో పెద్ద అప్‌ గ్రేడ్‌ ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. వివిధ లీకుల ప్రకారం, ఈ ఫోన్ లో 7,500mAh నుంచి 8,000mAh వరకు బ్యాటరీ సామర్థ్యం కలిగిన బ్యాటరీతో ఉండొచ్చని కూడా తెలుస్తోంది. ఈ ఫోన్ ను వేగంగా ఛార్జ్ చేసే 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా లభించే అవకాశం ఉంది.

గమనిక: పై వివరాలు ప్రస్తుతం లీక్స్ మరియు రూమర్ల ఆధారంగా మాత్రమే అందించాము. అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత స్పెసిఫికేషన్ లలో మార్పులు ఉండే అవకాశం ఉండవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile