48MP+8MP+2MP+2MP క్వాడ్ కెమేరా గేమింగ్ ప్రాసెసర్ గల Redmi Note 9 సేల్ ఈరోజే
Redmi Note 9 ఇటీవల ఇండియాలో సరికొత్త ఫీచర్లతో తీసుకురాబడింది.
ఈ స్మార్ట్ ఫోన్ యొక్క మరొక సేల్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి Mi.com మరియు Amazon నుండి మొదలవుతుంది
రెడ్ మీ నోట్ 9 సరికొత్త మీడియా టెక్ గేమింగ్ ప్రాసెసర్, 22.5 ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, క్వాడ్ రియర్ కెమేరాతో పాటుగా లేటెస్ట్ మంచి స్టైలిష్ డిజైన్ తో వుంటుంది.
Redmi Note 9 ఇటీవల ఇండియాలో సరికొత్త ఫీచర్లతో తీసుకురాబడింది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క మరొక సేల్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి Mi.com మరియు Amazon నుండి మొదలవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ సరికొత్త మీడియా టెక్ గేమింగ్ ప్రాసెసర్, 22.5 ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, క్వాడ్ రియర్ కెమేరాతో పాటుగా లేటెస్ట్ మంచి స్టైలిష్ డిజైన్ తో వుంటుంది.
Redmi Note 9 ప్రైస్
షియోమి యొక్క ఈ తాజా రెడ్ మీ నోట్ 9 స్మార్ట్ ఫోన్ 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్, 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్, 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. వీటి ధర వరుసగా రూ .11,999, రూ .13,499, రూ .14,999 . ఈ Redmi Note 9 ఆక్వా గ్రీన్, ఆర్కిటిక్ వైట్ మరియు పెబుల్ గ్రే కలర్ ఆప్షన్లలో కూడా లభిస్తుంది.
రెడ్ మీ నోట్ 9 స్పెసిఫికేషన్
షియోమి రెడ్ మీ నోట్ 9 ఒక 6.53-అంగుళాల ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లేను 1080×2340 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో కలిగి ఉంది. అలాగే, ఈ స్మార్ట్ ఫోన్ స్క్రీన్ రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 మరియు మెరుగైన పనితీరు కోసం మీడియాటెక్ Helio G 85 ప్రాసెసర్ సపోర్ట్ తో వస్తుంది. అదే సమయంలో, ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 10 ఆధారితమైన MIUI 11 ఆపరేటింగ్ సిస్టమ్ లో పనిచేస్తుంది.
Redmi Note 9 కెమేరా
కెమెరా గురించి మాట్లాడితే, వినియోగదారులకు రెడ్ మీ నోట్ 9 స్మార్ట్ ఫోన్ లో క్వాడ్ కెమెరా సెటప్ లభిస్తుంది. ఇందులో, 48 మెగాపిక్సెల్ శామ్సంగ్ ISOCELL సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్-లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ మరియు 2 మెగాపిక్సెల్ వంటి కెమేరాలు ఉన్నాయి. ఈ ఫోన్ ముందు భాగంలో 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది.
Redmi Note 9 బ్యాటరీ
కనెక్టివిటీ కోసం రెడ్ మీ నోట్ 9 లో 4 జి వోల్టీ, వై-ఫై, బ్లూటూత్ వెర్షన్ 5.0, జిపిఎస్, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ మరియు యుఎస్బి పోర్ట్ టైప్-సి ఉన్నాయి. అదనంగా, వినియోగదారులు ఈ రెడ్ మీ నోట్ 9 లో 5,020 ఎమ్ఏహెచ్ బ్యాటరీని పొందుతారు, ఇది 22.5W ఫాస్ట్ ఛార్జింగ్ కి మద్దతు ఇస్తుంది.