కేవలం రూ.12,999 ధరలో సూపర్ ఫీచర్లతో వచ్చిన REDMI NOTE 9 PRO

HIGHLIGHTS

రెడ్మి నోట్ 9 ప్రో వెనుక 48MP+8MP+5MP+2MP గల క్వాడ్ కెమేరా సెటప్పుతో వస్తుంది.

కేవలం రూ.12,999 ధరలో సూపర్ ఫీచర్లతో వచ్చిన REDMI NOTE 9 PRO

ఈరోజు షావోమి, తన Redmi 9 Series నుండి ఈ  రెడ్మి నోట్ 9 ప్రో మరియు రెడ్మి నోట్ 9 ప్రో మ్యాక్స్ ని కూడా ప్రకటించింది. వీటిలో, రెడ్మి నోట్ 9 ప్రో స్నాప్ డ్రాగన్ 720G, 48MP క్వాడ్ కెమేరా మరియు పెద్ద బ్యాటరీ వంటి గొప్ప ప్రత్యేకతలను కలిగివున్నా కూడా కేవలం రూ.12,999 ధరతో విడుదల చేయడాన్ని విశేషంగా చెప్పొచ్చు. ముఖ్యంగా, ఇప్పటివరకూ మనం చూసిన రెడ్మి ఫోన్ల మాదిరిగా కాకుండా ఒక వినూత్నమైన డిజైనుతో ఈ స్మార్ట్ ఫోన్ను తీసుకొచ్చింది.    

Digit.in Survey
✅ Thank you for completing the survey!

రెడ్మి నోట్ 9 ప్రోధరలు :                         

1. రెడ్మి నోట్ 9 ప్రో ( 4GB +64GB ) -Rs.12,999

2. రెడ్మి నోట్ 9 ప్రో ( 6GB +128GB ) -Rs.15,999

రెడ్మి నోట్ 9 ప్రో : ప్రత్యేకతలు 

ఈ రెడ్మి నోట్ 9 ప్రో స్మార్ట్ ఫోను, ఒక 6.67 అంగుళాల పరిమాణంగల డాట్ డిస్ప్లేని కలిగి ఉంటుంది. ఇది 2400×1080 పిక్సెళ్ళు అంటే FHD+ రిజల్యూషన్ తో వస్తుంది మరియు గరిష్టంగా 450 నిట్స్ బ్రైట్నెస్ అందిచే సామర్ధ్యంతో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క డిస్ప్లేని కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 యొక్క ప్రొటెక్షన్ తో అందించింది. ఈ స్మార్ట్ ఫోన్,  కొత్త ప్రాసెసర్ అయినటువంటి స్నాప్ డ్రాగన్ 720G SoC శక్తితో పనిచేస్తుంది. ఇది 8nm ఫ్యాబ్రికేషన్ తో వస్తుంది మరియు వేగంగా పనిచేస్తుంది. ఇది 618GPU తో వస్తుంది కాబట్టి గ్రాఫిక్స్ బాగా అనిపిస్తాయి మరియు గేమింగ్ మరింత ఆహ్లాదంగా ఉంటుంది. రెడ్మి నోట్ 9 ప్రో 4GB +64GB మరియు 6GB + 128GB వేరియంట్లలో లభిస్తుంది.  

ఇక కెమేరాల విషయానికి వస్తే, రెడ్మి నోట్ 9 ప్రో వెనుక 48MP+8MP+5MP+2MP గల క్వాడ్ కెమేరా సెటప్పుతో వస్తుంది. ఇందులో 48MP ప్రధాన కెమేరా కాగా, 8MP వైడ్ యాంగిల్, 5MP మ్యాక్రో మరియు 2MP పోర్ట్రైట్ సెన్సార్లతో జతగా వస్తుంది. ఇక ముందుభాగంలో, రెడ్మి నోట్ 9 ప్రో ముందుభాగంలో 16MP సెల్ఫీ కెమేరాని అందించింది. రెడ్మి నోట్ 9 ప్రో ఒక 5020mAh బ్యాటరీని, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో వస్తుంది మరియు 18W ఛార్జర్ ని బాక్సుతో పాటుగా తీసుకువస్తుంది. ఈ ఫోన్ లేటెస్ట్ MIUI 11 స్కిన్ పైనఆండ్రాయిడ్ 10 తో విడుదల చేసింది.   

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo