రెడ్మి నోట్ 9 ప్రో vs రియల్మీ 6 : స్పెక్స్ కంపారిజన్

రెడ్మి నోట్ 9 ప్రో vs రియల్మీ 6 : స్పెక్స్ కంపారిజన్
HIGHLIGHTS

ఏది మీకు మంచి ఎంపికగా ఉంటుందో తెలుసుకోనున్నాము.

ఈరోజు ఇండియాలో షావోమి తన రెడ్మి నోట్ 9 ప్రో స్మార్ట్ ఫోన్ను విడుదల చేసింది. ఈ ఫోన్ను మిడ్ రేంజ్ ధరలో మంచి స్పెషిఫికేషన్లతో విడుదల చేసింది. ఈ ఫోన్ ముందు నుండి ఇదే ధరలో అందుబాటులో వున్నా చాలా స్మార్ట్ ఫోన్లకు గట్టి పోటీగా నిలవనుంది. అయితే, ఇటీవల రియల్మీ ఇండియాలో ఒక గేమింగ్ ప్రాసెసర్ తో ఇదే ధరలో ప్రకటించిన  రియల్మీ 6 స్మార్ట్ ఫోనుతో సరిపోల్చి ఏది మీకు మంచి ఎంపికగా ఉంటుందో తెలుసుకోనున్నాము. ఇందులో మేము కేవలం స్పెక్స్ గురించి మాత్రమే వివరిస్తున్నాము.     

ధరలు

రెడ్మి నోట్ 9 ప్రో :  ధరలు

1. రెడ్మి నోట్ 9 ప్రో  (6GB + 64GB) ధర – Rs.12,999

2. రెడ్మి నోట్ 9 ప్రో  (6GB + 128GB) ధర – Rs.15,999

రియల్మీ 6 :  ధరలు

1. రియల్మీ 6  (4GB + 64GB) ధర – Rs.12,999

2. రియల్మీ 6  (6GB + 128GB) ధర – Rs.14,999

3. రియల్మీ 6  (8GB + 128GB) ధర – Rs.15,999

డిస్ప్లే :

డిస్ప్లే విభాగంలో, రెడ్మి నోట్ 9 ప్రో 6.67 అంగుళాల డాట్ డిస్ప్లే (పంచ్ హోల్) డిజైన్ గల FHD+ రిజల్యూషన్ అందించగల డిస్ప్లేని కలిగి ఉంటుంది. ఇక రియల్మీ 6 మాత్రం 6.5 అంగుళాలు పరిమాణం కలిగిన FHD+ డిస్ప్లేని ఒక 90Hz రిఫ్రెష్ రేటుతో పాటుగా ఒక ఇన్ డిస్ప్లే కెమేరా డిజైనుతో ఉంటుంది. మొత్తంగా, ఈ రెండు స్మార్ట్ ఫోన్లు కూడా పంచ్ హోల్ డిజైన్ తో వస్తాయి. అయితే, రెడ్మి నోట్ 9 ప్రో లో డిస్ప్లే పైభాగం మధ్యలో పంచ్ హోల్ ఉండగా, రియల్మీ 6 లో డిస్ప్లే పైభాగంలో ఎడమ వైపున పంచ్ హోల్ ఉంటుంది.                 

ప్రాసెసర్ :

ఈ రెండు స్మార్ట్ ఫోన్ల మధ్యగల ముఖ్యమైన వ్యత్యాసంగా ఈ రెండింటి ప్రాసెసర్ల గురించి చెప్పొచ్చు. రియల్మీ 6 ఒక 2.05 GHz వరకూ క్లాక్ స్పీడ్ అందించగల Mediatek Helio G90T ఆక్టా కోర్ ప్రాసెసర్ తో వస్తే, రెడ్మి నోట్ 9 ప్రో మాత్రం లేటెస్ట్ స్నాప్ డ్రాగన్ 720G ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తితో వస్తుంది. వీటిలో, రియల్మీ 6 ప్రాసెసర్ G90T ఒక 12nm ఫ్యాబ్రికేషన్ తో ఉంటే రెడ్మి నోట్ 9 ప్రో యొక్క 720G మాత్రం 8nm ఫ్యాబ్రికేషన్ తో ఉంటుంది. రియల్మీ 6  ARM Mali G76 GPU తో వస్తే, రెడ్మి నోట్ 9 ప్రో  Adreno 618 GPU తో వస్తుంది. వీటిలో రియల్మీ6 యొక్క GPU 7nm కాగా రెడ్మి యొక్క Adreno 618 GPU  14nm టెక్నలాజితో ఉంటుంది.

వెనుక కెమేరా :

ఈ విభాగంలో కూడా ఈ రెండు స్మార్ట్ ఫోన్ల మధ్య చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. రియల్మి 6 మరియు రెడ్మి నోట్ 9 ప్రో వెనుక భాగంలో క్వాడ్ కెమెరా సెటప్ తో ఉంటుంది. రెడ్మి నోట్ 9 ప్రో  వెనుక 48MP+8MP+5MP+2MP గల క్వాడ్ కెమేరా సెటప్పుతో వస్తుంది. ఇందులో 48MP ప్రధాన కెమేరా కాగా, 8MP వైడ్ యాంగిల్, 5MP మ్యాక్రో మరియు 2MP పోర్ట్రైట్ సెన్సార్లతో జతగా వస్తుంది. ఇక రియల్మీ 6 విషయానికి వస్తే, ఇది f / 2.25 ఎపర్చరు లెన్స్ మరియు 119 డిగ్రీల ఫీల్డ్ వ్యూతో ఒక 8MP అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, దీనికి జతగా 64MP ప్రాధమిక సెన్సార్‌తో పాటుగా, F / 2.4 లెన్స్‌తో 2MP మ్యాక్రో లెన్స్ తో ఒక బ్లాక్ & వైట్ పోర్ట్రైట్ సెన్సార్ తో. 

సెల్ఫీ కెమెరా :

ఈ విభాగంలో, ఈ  రెండింటిలో కూడా ముందుభాగంలో ఒక 16MP  సెల్ఫీ కెమెరాతో వస్తాయి.   

 బ్యాటరీ :

రెడ్మి నోట్ 9 ప్రో ఒక పెద్ద 5020mAh బ్యాటరీ, టైప్-సి మరియు 18W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో వస్తుంది. ఇక రియల్మీ6 విషయానికి వస్తే, ఇది ఒక 4300mAh బ్యాటరీతో టైప్-సి పోర్ట్‌ను కలిగి ఉంది మరియు ఇది 30W వాట్స్ ఫ్లాష్ ఛార్జ్  మద్దతు ఇస్తుంది.

OS & సెక్యూరిటీ:

ఈ విభాగంలో, రియల్మీ 6 స్మార్ట్ ఫోన్ తమ సొంత Realme UI స్కిన్ పైన ఆండ్రాయిడ్ 10 ఫై ఆధారితంగా పనిచేస్థాయి. ఇక రెడ్మి విషయానికి వస్తే, ఇది MIUI 11 స్కిన్ పైన ఆండ్రాయిడ్ 10 తో నడుస్తాయి.           

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo