Redmi Note 9 5G మరియు Note 9 5G స్పెక్స్ లీక్

Redmi Note 9 5G మరియు Note 9 5G స్పెక్స్ లీక్
HIGHLIGHTS

రెండు ఫోన్ల స్పెక్స్ షీట్ ఇప్పుడు ఆన్లైన్లో లీక్ అయ్యాయి

ఫోన్ డిజైన్ గురించి కూడా కొన్ని సూచనలు కూడా ఉన్నాయి.

Redmi Note 9 యొక్క కొత్త వేరియంట్లుగా ఉంటాయని ఇప్పుడు తెలుస్తోంది

షియోమి సబ్ బ్రాండ్ Redmi నుండి కొత్త స్మార్ట్ ఫోన్లు తయారవుతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. వీటిలో M2007J22C మరియు M2007J17C అనే రెండు పరికరాలు ఉండవచ్చు. రెడ్మి నోట్ 10 సిరీస్ లో రెండు పరికరాలు వస్తాయని మొదట్లో నమ్మకం ఉండేది. అయితే, ఈ M2007J22C మరియు M2007J17C రెండు కూడా Redmi Note 9 యొక్క కొత్త వేరియంట్లుగా ఉంటాయని ఇప్పుడు తెలుస్తోంది మరియు వీటిని 5G మద్దతుతో అందించవచ్చు.

M2007J22C రెడ్మి నోట్ 9 5G గా విడుదల చేయగా, M2007J17C రెడ్మి నోట్ 9 ప్రో 5 జిగా లాంచ్ అవ్వవచ్చు. ఎందుకంటే, ఈ రెండు ఫోన్ల స్పెక్స్ షీట్ ఇప్పుడు ఆన్లైన్లో లీక్ అయ్యాయి. రెడ్మి నోట్ 9 5 జి TEENA లో కనిపించింది మరియు స్పెక్స్ కూడా బయటకు వస్తున్నాయి. ఇది కాకుండా, ఫోన్ డిజైన్ గురించి కూడా కొన్ని సూచనలు కూడా ఉన్నాయి.

రెడ్మి నోట్ 9 5 జి ఫోన్లు

మునుపటి లీక్ లో , రెడ్మి నోట్ 9 5 జి మరియు నోట్ 9 ప్రో 5 జి పంచ్-హోల్ డిజైన్ తో వస్తాయని TEENA నుండి వెల్లడైంది. ప్రామాణిక మోడళ్లలో ఈ పంచ్ హోల్  ఎడమ వైపున ఉంటుంది మరియు ప్రో మోడల్లో ఇది మధ్యలో ఉంచబడుతుంది. రెడ్మి నోట్ 9 5 జిలో 6.53-అంగుళాల LCD ప్యానెల్ ఉంటుంది, దీనికి FHD+   రిజల్యూషన్ ఇవ్వబడుతుంది. రెడ్మి నోట్ 9 ప్రో 5 జిలో 6.7-అంగుళాల LCD స్క్రీన్ ఉంటుంది, ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ మరియు 240 Hz టచ్ శాంప్లింగ్ రేట్ ని  అందిస్తుంది.

రెడ్మి నోట్ 9 5 జి 2.4GHz వద్ద క్లాక్ చేయబడిన CPU శక్తితో పనిచేస్తుందని కూడా TEENA లిస్టింగ్ సూచిస్తుంది. అయితే, చిప్సెట్ పేరు ఇంకా వెల్లడించలేదు. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 800U  కావచ్చు. డైమెన్సిటీ 800 యు చిప్సెట్ 7 nm ప్రాసెస్ లో నిర్మించబడుతుంది మరియు 5 జి సపోర్ట్ కూడా లభిస్తుంది. రెడ్మి నోట్ 9 5 జికి 4 జీబీ, 6 జీబీ, 8 జీబీ ర్యామ్, 64 జీబీ, 128 జీబీ, 256 జీబీ స్టోరేజ్ లభిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo